TE/Prabhupada 0883 - మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో మీ సమయం వృథా చేయవద్దు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0882 - Krishna est très impatient de vous ramener à à la maison Retour à Dieu, Mais nous sommes tenaces|0882|FR/Prabhupada 0884 - Nous sommes assis et en train d'enquêter sur Krishna. C'est la vie|0884}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0882 - కృష్ణుడు మనలని తిరిగి భగవధ్ధామమునకు తీసుకువెళ్లడానికి చాలా ఆతృతగా ఉన్నాడు|0882|TE/Prabhupada 0884 - మనము క్రింద కూర్చుని కృష్ణుని గురించి విచారణ చేస్తున్నాం. ఇదీ జీవితము అంటే!|0884}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|YPHBpr_anSo|మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో మీ సమయం వృథా చేయవద్దు  <br />- Prabhupāda 0883}}
{{youtube_right|1yG4RDckCYQ|మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో మీ సమయం వృథా చేయవద్దు  <br />- Prabhupāda 0883}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 1 October 2020



Lecture on SB 1.8.21 -- New York, April 13, 1973


కాబట్టి కృష్ణుడు తన భక్తులు తనతో తండ్రి మరియు తల్లిలాగా సంబంధం కలిగి ఉండడాన్ని ఇష్టపడతాడు. ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో, మనము పరమపురుషుడు మనతో తండ్రిలాంటి సంబంధం కలిగివుండాలని మనము కోరుకుంటాము. కానీ కృష్ణుడు కుమారుడిగా కావాలని కోరుకుంటాడు. కాబట్టి నంద-గోప ( SB 1.8.21) తన భక్తుని కుమారుడిగా ఉండడంలో ఆయన ఆనందం పొందుతాడు. సాధారణ వ్యక్తులు, వారు భగవంతుని తండ్రిగా కోరుకుంటారు, కానీ అది కృష్ణుడికి అంతగా ఇష్టమైనది కాదు . తండ్రి అంటే, తండ్రి అవడం అంటే, ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోవడం: "నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, నాకు అది ఇవ్వండి". మీరు గమనించవచ్చు. వాస్తవానికి, సరఫరా చేయడానికి కృష్ణుడికి అపారమైన సామర్థ్యాలు వున్నాయి. Eko yo bahūnāṁ vidadhāti kāmān. ఆయన ప్రతి ఒక్కరికీ తమకు కావలిసినంత సరఫరా చేయగలడు. ఆయన ఏనుగులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు. ఆయన చీమలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు. అటువంటప్పుడు మానవులకు ఎందుకు చేయలేడు ? కానీ ఈ మూర్ఖులకు, వారికి తెలియదు. ఆహారం కోసం వారు గాడిదల వలె రోజూ రాత్రింబగళ్ళు పని చేస్తున్నారు. మరియు వారు చర్చికి వెళ్ళినప్పుడు, అక్కడ కూడా: "నాకు రొట్టె ఇవ్వండి." వారిది రొట్టె సమస్య మాత్రమే. అంతే. జీవి సంపన్న వ్యక్తికి కుమారుడు అయినప్పటికీ, ఆయన తన రొట్టె సమస్యను సృష్టించుకున్నాడు. ఇదే అజ్ఞానం. ఆయన ఇలా అనుకుంటాడు "నా రొట్టె సమస్యను పరిష్కరించుకోకపోతే, నేను నా ట్రక్కులు రోజు రాత్రింబగళ్ళు నడపకపోతే ... (ట్రక్ శబ్దాన్ని అనుకరించడం, నవ్వు) ఎటువంటి అర్థంలేని నాగరికత. మీరు చూడండి. రొట్టె సమస్య. రొట్టె సమస్య ఎక్కడ ఉంది? కృష్ణుడు సరఫరా చేయగలడు. ఆయన ఆఫ్రికాలో ఏనుగుకు ఆహారాన్ని సరఫరా చేయగలిగినప్పుడు- లక్షలాది ఆఫ్రికా ఏనుగులు ఉన్నాయి, మీకు తెలుసా, వాటికి ఆహారం సరఫరా చేయబడుతుంది.

ఈ రొట్టె సమస్య కోసం మీ సమయం వృధా చేయవద్దని భాగవతము చెబుతోంది. మీ సమయం వృధా చేయవద్దు. Tasyaiva hetoḥ prayateta kovido na labhyate yad bhramatām upary adhaḥ ( SB 1.5.18) మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో మీ సమయం వృథా చేయవద్దు. ఇది అర్థంలేనిది. అయితే, ఇది చాలా విప్లవాత్మకమైనది. ప్రజలు నన్ను ద్వేషిస్తారు. "స్వామిజీ మాట్లాడేదేమిటి?" వాస్తవానికి ఇది నిజం. ఇది మరొకరకం పిచ్చి. ఉదాహరణకు మీరు ధనికుడైన గొప్ప తండ్రిని, తగినంత ఆహారాన్ని పొందివున్నారని అనుకుందాం. మీకు ఆర్థిక సమస్య ఎక్కడ ఉంది? ఇది పిచ్చితనం. అసలు ఆర్థిక సమస్య లేదు. నా తండ్రి ఈ నగరంలోనే అత్యంత ధనవంతుడు, అని మీకు తెలిస్తే అప్పుడు నాకు ఆర్థిక సమస్య ఎక్కడ ఉంది? వాస్తవమునకు, అది మన పరిస్థితి. మనకు ఆర్థిక సమస్య లేదు. అంతా కలిగివున్నాము, సంపూర్ణంగా. Pūrṇam adaḥ pūrṇam idaṁ pūrṇāt pūrṇam udacyate (Īśopaniṣad, Invocation). ఇక్కడ ప్రతిదీ సంపూర్ణంగా వుంది. మీకు నీరు కావాలి. చూడండి: ఎన్నో సముద్రజలాలు ఉన్నాయి. మీకు శుధ్ధిచేయబడ్డ నీరు కావాలి. మీరు పొందలేరు. మహాసముద్రపు నీరు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, నీటి కొరత ఉన్నప్పుడు, మీరు కృష్ణుడి సహాయం తీసుకోవాలి. ఆయన నీటిని ఆవిరిచేసి, ఆయన దానిని మేఘముగా తయారు చేస్తాడు. అప్పుడు అది భూమిమీద పడగానే, అది మధురంగా మారుతుంది. లేకపోతే మీరు త్రాగలేరు . అంతా నియంత్రణలో ఉంది. ప్రతిదీ సంపూర్ణంగా వుంది - నీరు, కాంతి, వేడి. ప్రతిదీ వుంది. Pūrṇāt pūrṇam udacyate, pūrṇasya pūrṇam ādāya pūrṇam evāvaśiṣyate (Īśo Invocation). ఆయన నిలువ ఎప్పటికీ తరగదు. కేవలం మీరు విధేయులవ్వండి అప్పుడు మీకు సరఫరా లభిస్తుంది. మీరు అర్థం చేసుకోవచ్చు.

ఈ కృష్ణ చైతన్య వ్యక్తులు, వారికి సమస్యలు, ఆర్థిక సమస్యలు లేవు. సర్వమూ కృష్ణుడిచే తగినంత సరఫరా చేయబడుతుంది. లాస్ ఏంజిల్స్ లో, మా పొరుగువారు, వారు చాలా అసూయపడేవారు, మీరు పని చేయరు, మీకు ఆందోళన లేదు, మీకు నాలుగు కార్లు వున్నాయి. అని. మీరు చక్కని ఆహారాన్ని భుజిస్తున్నారు. అది ఎలా సంభవం?" అని వారు మన భక్తుల నుండి విచారించారు. నిజానికి అది వాస్తవం. మేము చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాము, మాకు చాలా కేంద్రాలు వున్నాయి. అంచనాల ప్రకారం మేము సుమారు 70,000 డాలర్లు ఖర్చు చేస్తున్నాము. ఎవరు సరఫరా చేస్తున్నారు? ఎలాగోలాగ, మేము పొందుతున్నాము. కాబట్టి సమస్య లేదు. కేవలం మీరు కృష్ణుడికి యథార్థ సేవకుడిగా మారండి. ప్రతీది లభిస్తుంది. అదే పరీక్ష