TE/Prabhupada 0882 - కృష్ణుడు మనలని తిరిగి భగవధ్ధామమునకు తీసుకువెళ్లడానికి చాలా ఆతృతగా ఉన్నాడు



730413 - Lecture SB 01.08.21 - New York


కృష్ణుడు మనలని తిరిగి భగవధ్ధామమునకు తీసుకువెళ్లడానికి చాలా ఆతృతగా ఉన్నాడు. కానీ మనము మొండి పట్టుదలతో ఉన్నాము. మీరు మీ పరిమిత జ్ఞానం ద్వారా అపరిమేయున్ని చేరుకోలేరు. అది సాధ్యం కాదు. కాబట్టి, కుంతీదేవి వంటి భక్తుల దయచేత, మనము వాసుదేవుడు ఇలా వుంటాడని గ్రహించగలము. సర్వవ్యాపియైన పరమసత్యము, పరమాత్మ, వాసుదేవుడు, ఇక్కడ ఉన్నాడు. Kṛṣṇāya vāsudevāya ( SB 1.8.21) కాబట్టి ఈ వాసుదేవ సాక్షాత్కారము నిరాకారవాదులకు అనేకానేక జన్మల తరువాతగాని సాధ్యంకాదు. చాలా సులభంగా కాదు.

bahūnāṁ janmanām ante
jñānavān māṁ prapadyate
vāsudevaḥ sarvam iti
sa mahātmā sudurlabhaḥ
(BG 7.19)

Sudurlabhaḥ, "చాలా అరుదుగా," మహాత్మా, "విశాల హృదయులు." అయితే కృష్ణుడిని అర్థం చేసుకోలేని వారు, వారు కుంచిత మనస్కులు. వారు విశాలదృక్పదులు కారు. ఒకవేళ ఎవరైనా విశాల మనస్కులైతే,అప్పుడు,కృష్ణుడి యొక్క కృపచేత, వారు కృష్ణుడిని అర్థం చేసుకోగలరు.

Sevonmukhe hi jihvādau (Bhakti-rasāmṛta-sindhu 1.2.234). ఈ పద్ధతి సేవాన్ముఖ, సేవ. నాలుకతో మొదలయ్యే సేవ ద్వారా, వాసుదేవ సాక్షాత్కారం సాధ్యమగును. సేవ, మొదటి సేవ శ్రవణకీర్తనలు ( SB 7.5.23) హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయండి మరియు పదే పదే వినండి.మరియు ప్రసాదాన్ని తీసుకోండి. ఈ రెండు నాలుక యొక్క వ్యాపారాలు. అప్పుడు మీరు తప్పక సాక్షాత్కారాన్ని పొందుతారు.ఇది చాలా సరళమైన పద్ధతి.

Sevonmukhe hi jihvādau svayam... కృష్ణుడు మీకు వ్యక్తమవుతాడు అయితే మీ సొంత యత్నం వలన మీరు కృష్ణున్ని గ్రహించలేరు, కానీ ప్రేమపూర్వక సేవలో మీ ప్రయత్నం, అది మిమ్ములను అర్హులను చేస్తుంది. కృష్ణుడు మీకు వ్యక్తమవుతాడు. Svayam eva sphuraty adaḥ. కృష్ణుడు మిమ్మల్ని భగవధ్దామమునకు తిరిగి తీసుకెళ్ళేందుకు చాలా ఆతృతతో వున్నాడు. కానీ మనము మొండివారము. మనకు కోరిక లేదు. అందువలన ఆయన ఎల్లప్పుడూ మీమ్మల్ని స్వధామమైన భగవధ్ధామానికి తీసుకువెళ్ళే అవకాశాన్ని కల్పిస్తూనే వున్నాడు. ఎలాగంటే ఒక ఆప్యాయత కలిగిన తండ్రి వలె,మూర్ఖ కుమారుడు తన తండ్రిని వదిలివెళ్ళాడు, వీధిల్లో పరిభ్రమిస్తూ,ఏ ఆశ్రయం లేక,ఆహారం లేక, చాలా బాధలు అనుభవిస్తున్నాడు. అబ్బాయిని ఇంటికి తీసుకురావడానికి తండ్రి చాలా ఆత్రుతగా ఉంటాడు. అదేవిధముగా, కృష్ణుడు పరమపిత. ఈ భౌతిక ప్రపంచంలో గల ఈ జీవులందరూ, వారందరూ ఒక గొప్ప, ధనవంతుడైన తండ్రి నుంచి తప్పిపోయి, వీధిలో ఇబ్బందులు పడుతున్న పిల్లవానిలాంటివారు. అందువల్ల ఈ మానవ సమాజానికి గొప్ప మేలుచేయడమంటే వారికి కృష్ణచైతన్యాన్ని ఇవ్వడం. గొప్పమేలు... మీరు ఇతర ఏ ప్రయోజనాన్ని కల్గించలేరు; ఏ రకమైన భౌతిక లాభం కూడా జీవున్ని సంతృప్తిపరచలేదు. అతనికి ఈ కృష్ణ చైతన్యాన్ని ఇచ్చినట్లయితే ... అదే రీతిగా. ఒక భ్రాంతి చెందిన పుత్రుడు వీధిలో పరిభ్రమిస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా అతనికి,"నా ప్రియమైన పుత్రుడా, ఎందుకు నీవు చాలా బాధకు గురవుతున్నావు? నీవు ఒకానొక గొప్ప వ్యక్తి కుమారుడవు మీ తండ్రికి చాలా ఆస్తి వుంది. ఎందుకు నీవు వీధిల్లో సంచరిస్తున్నావు? "అని గుర్తుచేస్తే మరియు ఒకవేళ అతనికి తన వాస్తవమైన స్పృహ కలిగినట్లయితే: "అవును, నేను పలానా గొప్ప వ్యక్తి కుమారుడను. నేను వీధిల్లో ఎందుకు తిరగాలి? "ఆయన తిరిగి భగవధ్ధామానికి వెళ్తాడు.Yad gatvā na nivartante ( BG 15.6)

అందువల్ల ఇదే ఉత్తమమై సేవ,ఏమంటే, "మీరు కృష్ణుని యొక్క అంశ, మీరు కృష్ణుడి కుమారుడు."అని అతనికి సమాచారం ఇవ్వడం. కృష్ణుడు సర్వ సంపన్నుడు, ఆరు రకాల విభూతులు కలవాడు. ఎందుకు మీరు పరిభ్రమిస్తున్నారు, ఎందుకు మీరు ఈ భౌతికము ప్రపంచంలో మగ్గిపోతున్నారు? " ఇది గొప్ప సేవ,కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం. కానీ మాయ చాలా ధృడమైనది. అయినప్పటికీ, ఇది ప్రతి యొక్క కృష్ణభక్తుని కర్తవ్యము, ప్రతి ఒక్కరినీ కృష్ణ చైతన్యంతో జాగృతులను చేయడానికి ప్రయత్నించడం. ఎలాగంటే కుంతిదేవి తెలిపినట్లుగా. ఆమె చెప్పినదానిలో మొదటిది, alakṣyaṁ sarva-bhūtānām antar bahir avasthi ( SB 1.8.18) .. కృష్ణుడు,పరమ పురుషుడు,సర్వుల బయట మరియు లోపల స్థితుడైవున్నప్పటికీ, మూర్ఖులకూ మరియూ మూఢులకూ,ఆయన అదృశ్యంగా ఉంటాడు. అందువల్ల ఆమె ఇలా చెబుతోంది: " భగవంతుడు ఇలా వున్నాడు, kṛṣṇya vāsudevāya ( SB 1.8.21) " ఆయన సర్వవ్యాపియైన పరమపురుషుడు, కానీ ఆయన దేవకి కుమారునిగా మారడానికి చాలా ఆనందిస్తున్నాడు. Devakī-nandanāya. Devakī-nandanāya. దేవకి-నందనుని గురించి అధర్వణ-వేదంలో కూడా ప్రస్తావించబడింది. కృష్ణుడు దేవకీ-నందనునిగా అవతరిస్తాడు, మరియు ఆయన పెంపుడు తండ్రి నంద-గోప, నంద మహారాజు.