TE/Prabhupada 0899 - భగవంతుడు అంటే పోటీ లేకుండా : ఒకరే. భగవంతుడు ఒకడే. ఎవరూ ఆయన కంటే గొప్పవారు కాదు

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730415 - Lecture SB 01.08.23 - Los Angeles


భగవంతుడు అంటే పోటీ లేకుండా : ఒకరే. భగవంతుడు ఒకడే. ఎవరూ ఆయన కంటే గొప్పవారు కాదు అనువాదం: "ఓ హృషీకేశ, ఇంద్రియాల యజమాని మరియు ప్రభువులకు ప్రభువు, మీరు మీ తల్లి, దేవకిని విడుదల చేసారు, ఆమె సుదీర్ఘకాలం ఖైదీ చేయబడి కంసరాజు చేత బాధించ బడినది, మరియు నన్ను మరియు నా పిల్లలను నిరంతర అపాయాల బారి నుండి కాపాడినావు. "

ప్రభుపాద: కాబట్టి ఇది భక్తుల యొక్క స్థితి, కృష్ణుడికి తల్లి అయిన దేవకి... ఆమె సాధారణ మహిళ కాదు. భగవంతుని యొక్క తల్లి అవ్వడానికి? అత్యంత ఉన్నతమైన భక్తురాలు, దీని వలన కృష్ణుడు ఆమె కుమారునిగా అవ్వడానికి అంగీకరించారు. తన పూర్వ జన్మలో, భర్త మరియు భార్య, వారు తీవ్రమైన తపస్సులు చేసినారు, కృష్ణుడు వారి ముందు అవతరించి వారికి దీవెనలు ఇవ్వాలని కోరుకున్నారు, వారు భగవంతుని వంటి కొడుకును కోరుకున్నారు. కాబట్టి భగవంతుడుతో సమానంగా ఉన్న మరొక వ్యక్తి ఎక్కడ ఉంటాడు? అది సాధ్యం కాదు. భగవంతుడు అంటే ఆయనకు సమానంగా ఎవరు లేరు, అధికముగా ఎవరు లేరు Asamordhva. అది భగవంతుడు. భగవంతుడు, ఆయనకు పోటి లేదు. నీవు భగవంతుడవు, నేను భగవంతుడు, అతడు భగవంతుడు, అతడు భగవంతుడు. కాదు ఇవి కుక్కలు. వారు భగవంతుడు కాదు. భగవంతుడు అంటే పోటీ లేకుండా, అంటే: ఒకరే. భగవంతుడు ఒకరే. ఎవరూ గొప్పవారు కాదు... asamordhva. ఎవరూ ఆయన కంటే ఎక్కువ కాదు. ఎవరూ ఆయనకు సమానం కాదు. ప్రతి ఒక్కరూ ఆయనకంటే తక్కువే. Ekale īśvara kṛṣṇa āra saba bhṛtya ( CC Adi 5.142) భగవంతుడు కృష్ణుడు మాత్రమే, భగవంతుడు; అందరూ, సేవకులు. పర్వాలేదు. ఆయన బ్రహ్మా, విష్ణువు లేదా శివుడు, గొప్ప, గొప్ప దేవతలు అయినా కూడా. మరి ఇతరుల గురించి ఏమి మాట్లాడాలి?

Śiva-viriñci-nutam ( SB 11.5.33) శాస్త్రములో చెప్పబడినది ఆయన భగవంతుడు శివుడు మరియు భగవంతుడు బ్రహ్మ చేత గౌరవించబడ్డారని చెప్పబడింది. వారు అత్యుత్తమ దేవతలు.వారు దేవతలు మానవులకు పైన, దేవతలు ఉన్నారు. మనం మానవులము కనుక , తక్కువ జీవుల కంటే ఎక్కువ , తక్కువ జంతువులకు, అదేవిధముగా, మనకు పైన దేవతలు ఉన్నారు. అతి ముఖ్యమైన దేవత భగవంతుడు బ్రహ్మ, మరియు భగవంతుడు శివుడు. బ్రహ్మ దేవుడు ఈ విశ్వమునకు సృష్టికర్త, భగవంతుడు శివుడు ఈ విశ్వం యొక్క ప్రళయకారుడు. భగవంతుడు విష్ణువు నిర్వహించు వాడు. భగవంతుడు విష్ణువు కృష్ణుడే. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం యొక్క నిర్వహణకు మూడు గుణాలు ఉన్నాయి, సత్వ గుణము, రజో-గుణము, తమో-గుణము ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు ఒక విభాగానికి బాధ్యతలను స్వీకరించారు. అందువల్ల భగవంతుడు విష్ణువు సత్వ గుణ విభాగాన్ని తీసుకున్నాడు, బ్రహ్మ దేవుడు రజో-గుణ విభాగాన్ని తీసుకున్నారు, శివుడు తమో-గుణ విభాగాన్ని తీసుకున్నారు. వారు ఈ గుణాల ప్రభావము క్రింద లేరు. ఉదాహరణకు ఒక జైలు సూపరింటెండెంట్ వలె. ఆయన ఖైదీ కాదు; ఆయన నియంత్రణాధికారి. అదేవిధముగా భగవంతుడు శివుడు, భగవంతుడు విష్ణువు, భగవంతుడు బ్రహ్మ దేవుడు, వారు ప్రతి విభాగాన్ని నియంత్రిస్తున్నప్పటికీ, వారు నియంత్రణా విభాగం క్రింద లేరు. మనము తప్పు చేయకూడదు.

కాబట్టి హృషీకేశ. కృష్ణుడు మహోన్నతమైన ప్రామాణికుడు. హృషీక . హృషీక అంటే అర్థం ఇంద్రియాలు. కాబట్టి మనము మన ఇంద్రియాలను అనుభవిస్తున్నాము, కానీ చివరికి నియంత్రికుడు కృష్ణుడు. ఉదాహరణకు ఇది నా చేయి అని అనుకుందాం. ఇది నా చేయి అని నేను చెప్తున్నాను: నేను మీ ముఖము మీద పిడికిలితో గట్టిగా ఒక్కటి ఇస్తాను... నేను చాలా గర్వంగా ఉన్నాను. కానీ నేను నియంత్రికుడిని కాదు. నియంత్రికుడు కృష్ణుడు. ఆయన, ఆయన కనుక మీ చేతి యొక్క శక్తిని ఉపసంహరించుకుంటే, మీరు పక్షవాతానికి గురవుతారు. మీరు చెప్తున్నారు, "ఇది నా చేయి, నేను దాన్ని వాడుతాను" కానీ అది పక్షవాతానికి గురైనప్పుడు, మీరు ఏమీ చేయలేరు. కావున నేను కృష్ణుడి కృప వలన ఈ చేతిని కలిగి ఉన్నాను, కానీ నేను నియంత్రికుడను కాదు. ఇది కృష్ణ చైతన్యము. కావున ఈ తెలివి ఉన్న వ్యక్తి ఆలోచిస్తాడు చేయి కృష్ణుడిచే నియంత్రించబడుతుంటే, అది కృష్ణుడికి ఉద్దేశించబడింది. ఇది లౌకిక జ్ఞానం అవగాహన