TE/Prabhupada 0900 - ఇంద్రియాలను ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకున్నప్పుడు, అది మాయ



730415 - Lecture SB 01.08.23 - Los Angeles


ఇంద్రియాలను ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకున్నప్పుడు, అది మాయ నేను "ఇది నా చేయి, ఇది నా కాలు, ఇది నా చెవి." అని చెప్పుకుంటున్నాను పిల్లలు కూడా చెప్తారు. మీరు పిల్లలను అడగండి, "ఇది ఏమిటి?" "ఇది నా చేయి." కానీ మనము చెప్పవచ్చు, కానీ వాస్తవానికి ఇది మన చేయి కాదు. ఇది ఇవ్వబడింది. నేను చాలా విధాలుగా నా చేతులును ఉపయోగించాలనుకుంటున్నాను. ఎందుకంటే, కృష్ణుడు ఇచ్చాడు: "సరే, నీవు ఈ చేయిని తీసుకో, ఉపయోగించు. ఇది కృష్ణుడి యొక్క బహుమతి.

అందువల్ల ఒక మతి ఉన్న మనిషి ఎల్లప్పుడూ చైతన్యముతో ఉంటాడు, నా ఆధీనములో ఉన్నది ఏమైనా, మొదట, ఈ శరీరము మరియు ఇంద్రియాలు, అవి నిజానికి నావి కాదు. ఇవి అన్నీ ఉపయోగించుట కోసం నాకు ఇవ్వబడినవి అంతిమంగా ప్రతిదీ కృష్ణుడికి చెందితే, ఎందుకు కృష్ణుడి కోసం ఉపయోగించబడదు? " ఇది కృష్ణ చైతన్యము. ఇది కృష్ణ చైతన్యము. ఇది బుద్ధి. నా ఉపయోగం కోసం ఈ అంశాలన్నిటిని నాకు ఇస్తే, నా ఇంద్రియ తృప్తి కొరకు కానీ చివరకు ఇది కృష్ణుడికి చెందుతుంది... Mamaivāṁśo jīva-bhūtaḥ ( BG 15.7) ప్రతి ఒక్కరూ కృష్ణుడిలో భాగం, కాబట్టి ప్రతి ఒక్కరి ఇంద్రియాలు కూడా కృష్ణుడివి. కాబట్టి, కృష్ణుడి సేవ కోసం ఇంద్రియాలను ఉపయోగించినప్పుడు, అది జీవిత పరిపూర్ణము. ఎంత కాలము నా ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తూ ఉంటే, ఇది మాయ. అందువలన భక్తి అనగా hṛṣīkeṇa hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate ( CC Madhya 19.170) హృషీకేణ , ఇంద్రియాల ద్వారా. ఈ హృషీకేశ -సేవానం... మీరు హృషీకేశకు సేవ చేస్తున్నప్పుడు, వాస్తవముగా ఇంద్రియాలకు గురువు, దానిని భక్తి అంటారు చాలా సాధారణ వర్ణన, భక్తి యొక్క నిర్వచనం. Hṛṣīkeṇa hṛṣīkeśa-sevanam ( CC Madhya 19.170) హృషీకేశ - సేవనం . హృషీక-సేవనం కాదు. హృషీక అంటే ఇంద్రియాలు అని అర్థం. అందువల్ల ఇంద్రియాలను ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తే, అది మాయ. ఇంద్రియాల యజమానిని తృప్తిపర్చడానికి ఇంద్రియాలను ఉపయోగించినప్పుడు, అది భక్తిగా పిలువబడుతుంది. చాలా సులభమైన నిర్వచనం. ఎవరైనా అర్థం చేసుకోగలరు.

కాబట్టి సాధారణంగా, ఈ భౌతిక ప్రపంచంలో, ప్రతిఒక్కరూ ఇంద్రియలను తృప్తి పరచుకునేందుకు ఇంద్రియాలను ఉపయోగిస్తున్నారు. అంతే. ఇది వారి బంధనము. ఇది మాయ, భ్రమ. ఆయన కృష్ణ చైతన్యమునకు వచ్చినప్పుడు, పవిత్రము అయినప్పుడు, ఆయన అర్థం చేసుకున్నప్పుడు వాస్తవానికి ఈ ఇంద్రియాలు కృష్ణుడిని సంతృప్తి పరచడానికి ఉద్దేశించబడినవి, అప్పుడు ఆయన విముక్తి పొందిన వ్యక్తి, ముక్త. ముక్త-పురుష. విముక్తి పొందిన వ్యక్తి. విముక్తి పొందిన వ్యక్తి. Īhā yasya harer dāsye karmaṇā manasā vācā. ఈ స్థానానికి ఒకరు వచ్చినప్పుడు, "నా ఇంద్రియాలు ఇంద్రియల యొక్క గురువుకి సేవ చేయడానికి ఉద్దేశించబడినవి, హృషీకేశ..." ఇంద్రియాల యజమాని, మీ హృదయము లోపల కూర్చొని ఉన్నాడు. భగవద్గీతలో చెప్పబడినది sarvasya cāhaṁ hṛdi sanniviṣṭaḥ: నేను ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చున్నాను. Mattaḥ smṛtir jñānam apohanaṁ ca: ( BG 15.15) నా నుండి జ్ఞాపక శక్తీ, జ్ఞానము, మతిమరుపు వస్తోంది. ఎందుకు అలా? ఎందుకంటే కృష్ణుడు చాలా కరుణామయుడు... నేను ఒక నిర్దిష్ట మార్గంలో నా ఇంద్రియాలను ఉపయోగించాలనుకుంటే - నా ఇంద్రియాలను కాదు, అవి కృష్ణుడివి, ఇవ్వబడినవి - కాబట్టి కృష్ణుడు అవకాశం ఇస్తాడు: "అది సరే, అది ఉపయోగించుకోండి." ఉదాహరణకు నేను నాలుకను కలిగి ఉన్నాను. అని అనుకుందాం. నాకు కావాలంటే, "కృష్ణా, నేను మలము తినాలని కోరుకుంటున్నాను. నేను మలమును రుచి చూడాలనుకుంటున్నాను " అవును, కృష్ణుడు చెబుతాడు. "అవును, మీరు పంది యొక్క ఈ శరీరాన్ని తీసుకోండి మలం తినండి." యజమాని ఉన్నాడు, కృష్ణుడు.

అందుచేత కృష్ణుడు చెప్తాడు, mattaḥ smṛtir jñānam apohanaṁ ca ( BG 15.15) ఆయన మీకు శరీరాన్ని ఇస్తాడు, మీకు గుర్తు చేస్తాడు నా ప్రియమైన జీవి, మీరు మలం తినాలని కోరుకున్నారు? ఇప్పుడు మీరు సరైన శరీరాన్ని పొందారు. ఇప్పుడు వాడండి. ఇక్కడ మలము కూడా ఉంది. " అదేవిధముగా, మీరు దేవత కావాలని కోరుకుంటే, దానికి కూడా కృష్ణుడు మీకు అవకాశం కల్పిస్తాడు. ఏదైనా... 84,00,000 రూపాలు, జీవులు ఉన్నాయి. మీరు ఏ రకమైన శరీరంలోనైనా మీ ఇంద్రియాలను నిమగ్నం చేయాలనుకుంటే, కృష్ణుడు మీకు ఇస్తున్నాడు: "రండి, ఇక్కడ శరీరం ఉంది. మీరు తీసుకోండి" కానీ మనము మన ఇంద్రియాలను ఉపయోగించడం ద్వారా విసిగి పోయాము. చివరకు మనము జ్ఞానాన్ని కోల్పోయాము. అందుచేత కృష్ణుడు ఇలా చెప్పాడు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ ( BG 18.66) ఇలా చేయవద్దు. మీ ఇంద్రియాలు నా సేవకు ఉద్దేశించబడినవి. కానీ మీరు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. దుర్వినియోగం చేయడము వలన, మీరు వివిధ రకాలైన శరీరములలో చిక్కుకుపోతున్నారు. అందువలన ఈ దుర్భరమైన పని నుండి ఉపశమనం పొందడానికి ఒక శరీరమును అంగీకరించడం మరియు దానిని వదలి వేయడము, మళ్ళీ మరొక శరీరం, మళ్ళీ మరొక... ఈ భౌతిక జీవితముని కొనసాగించడానికి... మీరు ఈ ఇంద్రియ తృప్తి పద్దతిని వదలివేసి మరియు నాకు శరణాగతి పొందితే, అప్పుడు నీవు రక్షింపబడతావు. "ఇది కృష్ణ చైతన్యము