TE/Prabhupada 0907 - ఆధ్యాత్మిక ప్రపంచంలో,అధర్మము అని పిలవబడేది కూడా మంచిది: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0906 - Vous avez des zéros. Mettez Krishna. Vous devenez Dix|0906|FR/Prabhupada 0908 - Je peux essayer de devenir heureux, mais si Krishna ne sanctionne pas, je ne serai jamais heureux|0908}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0906 - మీరు సున్నాలను కలిగి ఉన్నారు. కృష్ణుడిని ఉంచుకోండి. మీరు పది అవుతారు|0906|TE/Prabhupada 0908 - నేను సంతోషంగా ఉండటానికి ప్రయత్నించవచ్చు కృష్ణుడు మంజూరు చేయకపోతే సంతోషంగా ఉండలేను|0908}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|D4WqwJdqayo|ఆధ్యాత్మిక ప్రపంచంలో,అధర్మము అని పిలవబడేది కూడా మంచిది  <br/>- Prabhupāda 0907}}
{{youtube_right|l9vjqrVM4e8|ఆధ్యాత్మిక ప్రపంచంలో,అధర్మము అని పిలవబడేది కూడా మంచిది  <br/>- Prabhupāda 0907}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 1 October 2020



730419 - Lecture SB 01.08.27 - Los Angeles


ఆధ్యాత్మిక ప్రపంచంలో,అధర్మము అని పిలవబడేది కూడా మంచిది భక్తుడు: "...భౌతికముగా ధనము లేని వారి యొక్క ఆస్తి ఏమిటి? భౌతిక ప్రకృతి గుణాల యొక్క చర్యలకు మరియు ప్రతిచర్యలకు మీకు సంబంధం లేదు. మీరు స్వయముగా సంతృప్తి చెందారు, అందువల్ల మీరు చాలా సున్నితంగా ఉంటారు మరియు అద్వైతవాదుల యొక్క గురువు "

ప్రభుపాద:కావున నమః అకించన-విత్తాయ. భౌతికముగా పేదవాడు. ఇది భక్తుడి యొక్క మొదటి అర్హత. ఈ భౌతిక ప్రపంచములో భౌతికమైన వాటిని దేనిని కలిగి లేనివాడు. ఆయన కేవలం కృష్ణుడిని మాత్రమే కలిగి ఉంటాడు. అది అకించన-విత్తాయ. అకించన అనగా భౌతికముగా ప్రతిదీ కోల్పోయిన వ్యక్తి. ఎందుకంటే మీకు, ఒక చిన్న రవ్వంతా ఆలోచన ఉంటే నేను ఈ విధముగా భౌతికముగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, అప్పటివరకు, మీరు ఒక శరీరాన్ని అంగీకరించాలి.

ప్రకృతి చాలా దయ కలిగినది మీరు ఏరకముగా ప్రపంచాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారో ఆ విధముగా, ఆమె మీకు భగవంతుని యొక్క ఆధ్వర్యంలో తగిన శరీరాన్ని ఇస్తుంది. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయములో ఉన్నాడు. అందువల్ల అతడికి ప్రతిదీ తెలుసు, మీరు ఇప్పటికీ ఏదో భౌతికమైనది కావాలి అని కోరుకుంటున్నారు అని. ఆయన మీకు ఇస్తాడు. "అవును, మీరు తీసుకోండి." కృష్ణుడు మీరు పూర్తి అనుభవము పొందాలని కోరుకుంటాడు. దాని ద్వారా మీరు ఎప్పటికి సంతోషముగా ఉండరని తెలుసుకుంటారని ఇది కృష్ణుడి కర్తవ్యము. ఇది పూర్తి స్వేచ్ఛ. మీకు చాలా తక్కువ స్వేచ్ఛ ఉన్నప్పటికీ, ఎందుకంటే మనము కృష్ణుడిలో భాగమే. కృష్ణుడు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉన్నాడు, కానీ నేను కృష్ణుడిలో భాగం మరియు అంశ కనుక స్వేచ్ఛ లక్షణము నాలో కూడా ఉంది. రసాయన కూర్పు. సముద్రపు నీటి చుక్క కూడా కొంత ఉప్పును కలిగి ఉంటుంది. ఇది సముద్రపు నీటిలో ఉన్న ఉప్పుతో పోల్చదగినది కాదు. కానీ ఉప్పు రసాయనము ఉంది. ఇది మన అవగాహన. Janmādy asya yataḥ ( SB 1.1.1) మనము చాలా తక్కువ పరిమాణము కలిగి ఉన్నాము ఏదైనా,అదే విషయము సంపూర్ణముగా, కృష్ణుడిలో ఉంది. సంపూర్ణముగా. ఉదాహరణకు కృష్ణుడు చెప్పినట్లుగా: mṛtyuḥ sarva-haraś ca aham.

ఇప్పుడు మనము ఇతరుల విషయాలను తీసుకునే ప్రవృత్తి కలిగి ఉన్నాము. దొంగిలించటము అని మీరు చెప్పవచ్చు. మనకు ఈ ప్రవృత్తి ఉన్నది ఎందుకు? కృష్ణుడికి ఉంది కనుక. కృష్ణుని వెన్న దొంగ అని పిలుస్తారు. ప్రారంభంలో, దొంగతనంగా, దొంగిలించడం. ఆ దొంగిలించడం ప్రవృత్తిని ఉంటే తప్ప, నేను ఎలా పొందగలను? కానీ కృష్ణుడు దొంగిలించడం మరియు మనము దొంగిలించడం భిన్నంగా ఉంటుంది. నేను భౌతికంగా కలుషితమైనందున, నా దొంగతనం అసహ్యకరమైనది. కానీ అదే దొంగిలించడం ఆధ్యాత్మిక సంపూర్ణ స్థితి లో చాలా చక్కగా ఉంటుంది, ఆనందించదగినది. కృష్ణుడు దొంగిలించే కార్యక్రమాలను యశోదమ్మ ఆనందిస్తుంది ఇది తేడా. భౌతికము మరియు ఆధ్యాత్మికము ఆధ్యాత్మిక కార్యక్రమము ఏదైనా, అవి అన్నీ మంచివి, భౌతిక కార్యక్రమము ఏదైనా , అది అంతా చెడ్డది. ఈ తేడా ఉంది. ఇక్కడ నైతికత, మంచితనము, అని పిలవబడేది అవి అన్నీ చెడ్డవి. ఆధ్యాత్మిక ప్రపంచంలో, అధర్మము అని పిలవబడేది కూడా మంచిది. మీరు అర్థం చేసుకోవాలి.

అర్ధ రాత్రి ఇతరుల భార్యతో నృత్యం చేయడము, ఇది అధర్మము. అందరికి తెలుసు. కనీసము వేదముల నాగరికతలో, ఇది అనుమతించబడలేదు. ఒక యువతి తనతో కలిసి నృత్యం చేయటానికి అర్ధ రాత్రి మరో యువకుడితో వెళ్ళడము. ఇది భారతదేశంలో ఎప్పటికీ అనుమతించబడదు. ఇప్పటికి అది నిషేధించబడింది. కానీ మనము గోపికలు అందరు, వారు వేణునాదంను విన్న వెంటనే, వెంటనే వారు వచ్చేవారు. కాబట్టి భౌతిక భావన నుండి ఇది అధర్మము కానీ ఆధ్యాత్మిక భావన నుండి, ఇది గొప్ప నైతికత. చైతన్య మహా ప్రభు చెప్పినట్లుగా: ramyā kācid upāsanā vraja-vadhū-vargeṇā yā kalpitā. ఓ,vraja-vadhūs, వృందావన కన్యలు ఊహించిన దానికంటే మెరుగైన ఆరాధన లేదు. చైతన్య మహాప్రభు మహిళల గురించి చాలా కఠినంగా ఉండేవాడు. ఆయన కుటుంబ జీవితంలో కూడా, ఆయన స్త్రీలతో ఎటువంటి పరిహాసము చేసేవారు కాదు. ఆయన చాలా హాస్యాస్పదంగా ఉండేవారు. కానీ అది అంతా, పురుషులతో మాత్రమే. ఆయన మహిళలతో ఎటువంటి పరిహాసము చేసేవారు కాదు. లేదు బహుశా ఒకసారి మాత్రమే ఆయన భార్య, విష్ణు-ప్రియతో పరిహాసము చేశారు. శచిమాత ఏదో వెతుకుతున్నప్పుడు, ఆమె, ఆయన పరిహాసము చేశారు: బహుశా మీ కోడలు అది తీసుకొని ఉంటుంది. ఇది ఆయన మొత్తం జీవితంలో మనము చూసే హాస్యము. లేకపోతే, ఆయన చాలా కఠినంగా ఉన్నాడు. ఆయన సన్యాసిగా ఉన్నప్పుడు, ప్రణామములు చేయడానికి ఏ మహిళ ఆయన దగ్గరకు వచ్చేవారు కాదు. వారు దూరము నుండి ప్రణామము చేసే వారు కానీ ఆయన ఇలా అంటున్నారు:ramyā kācid upāsanā vraja-vadhū-vargeṇā yā kalpitā. ఆయన vraja-vadhūs ఊహించిన దానికంటే మెరుగైన పూజించే భావన లేదా విధానము లేదని ఆయన అన్నారు. vraja-vadhūs వ్రజ వధూస్ యొక్క భావన ఏమిటి? వారు ఎంతటి ప్రమాదము అయినా కృష్ణుడిని ప్రేమించాలని కోరుకున్నారు. కాబట్టి ఇది అధర్మము కాదు. అది మనము అర్థం చేసుకోవాలి