TE/Prabhupada 0966 - భక్తి అనే అంజనం కన్నులకు రాసుకున్నప్పుడు ఒకరు భగవంతుడిని చూడవచ్చు

Revision as of 12:35, 29 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0966 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


720527 - Lecture BG The Yoga System - Los Angeles


భక్తి యొక్క లేపనంతో అభిషేకించినప్పుడు ఒకరు భగవంతుడిని చూడవచ్చు కావున, ఈ యోగ పద్ధతి, భక్తి-యోగ, ఎలా కృష్ణుడితో అనుబంధమును పెంచుకోవాలి, అనేది మన కృష్ణ చైతన్యము ఉద్యమము ప్రచారము చేస్తుంది Mayy āsakta-manāḥ pārtha yogaṁ yuñjan mad-āśrayaḥ ( BG 7.1) ఈ సంబంధములో, ఈ యోగ పద్ధతిని నేరుగా కృష్ణుడి నుండి లేదా ఆయన ప్రతినిధి నుండి ఎలా నేర్చుకోవాలి అది మదాశ్రయ యొక్క అర్థము. ఒకరు ఆశ్రయము తీసుకోవాలి...

కాబట్టి ప్రస్తుత క్షణము, కృష్ణుడి ఆశ్రయాన్ని నేరుగా పొందడం సాధ్యం కాదు, అందువల్ల తన ప్రామాణిక ప్రతినిధి యొక్క ఆశ్రయం తీసుకోవాలి. వైష్ణవుల సంప్రదాయములు నాలుగు ఉన్నాయి. బ్రహ్మ-సంప్రదాయము, రుద్ర-సంప్రదాయము, శ్రీ-సంప్రదాయ, కుమార-సంప్రదాయము. అందువల్ల ఈ సంప్రదాయములలో ఒక దానిని, గురు శిష్య పరంపర ద్వారా శరణాగతి పొందాలి, ఆపై ఆయన నుండి భక్తి-యోగ పద్ధతిని నేర్చుకోవాలి అప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు, లేదా ఆయన భగవంతుని చూస్తాడు. భగవంతుని చూడడము అంటే సరిగ్గా కళ్ళతో చూడడము అని కాదు. భగవంతుని మరొక నామము అనుభవ, సాక్షాత్కారము. వెల్లడి ఆవుతుంది సాక్షాత్కారము. కాబట్టి అది కావలసినది. ఆ సాక్షాత్కారము కృష్ణుడి చేత భగవంతుని భక్తుని ద్వార ఇవ్వబడుడుతుంది. Sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ ( CC Madhya 17.136) కృష్ణుడు, భగవంతుడు తనకు తాను వెల్లడి అవుతాడు. ఉదాహరణకు మీరు రాత్రి చీకటిలో సూర్యుడిని చూడలేరు. సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, కానీ ఎట్లాగైతేనే, మీ లోకము మరొక వైపు ఉన్నప్పుడు, అది చీకటి, మీరు సూర్యుడిని చూడలేరు. సూర్యుడు లేడు అని కాదు, కానీ మీరు చూడలేరు. అదేవిధముగా, కృష్ణుడు మన ముందు ఎల్లప్పుడూ ఉంటాడు, కానీ మనము ఆయనను చూడలేము. ఉదాహరణకు కృష్ణుడి వలె, ఆయన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, వారు... భూగోళం యొక్క ఉపరితలంపై అనేక వందల మిలియన్ల మంది వ్యక్తులు ఉన్నారు, కేవలం కొందరు మాత్రమే ఆయనను చూడగలిగారు, ఆయన భగవంతుడు అని కాబట్టి భగవంతుడు కూడా, దేవాదిదేవుడు, కృష్ణుడు ఎవరి ముందుకు అయినా వస్తే; అతన్ని చూడడం సాధ్యం కాదు. చూసే పద్ధతి భిన్నంగా ఉంటుంది. Premāñjana-cchurita-bhakti-vilocanena (Bs 5.38). భక్తి యొక్క లేపనంతో కళ్ళు అభిషేకమయినప్పుడు చూడవచ్చు. భగవంతుణ్ణి చూడడానికి కళ్ళు పరిశుభ్రం అవుతాయి. అది వెల్లడి అవడము అంటే.