TE/Prabhupada 0980 - మనము భౌతిక సంపదతో ఆనందముగా ఉండలేము, ఇది వాస్తవం

Revision as of 23:46, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


720905 - Lecture SB 01.02.06 - New Vrindaban, USA


మనము భౌతిక సంపదతో ఆనందముగా ఉండలేము, ఇది వాస్తవం ప్రద్యుమ్న: అనువాదం: "మానవులు అందరికీ మహోన్నతమైన వృత్తి లేదా ధర్మము, అది ఏమిటంటే మానవులు ప్రేమతో భగవంతునికి భక్తి యుక్త సేవ చేసే స్థితికి రావడము. ఈ భక్తి యుక్త సేవ పూర్తిగా కోరికలు లేకుండా మరియు నిరంతరాయంగా ఉండాలి. " ప్రభుపాద:...

Sa vai puṁsāṁ paro dharmo
yato bhaktir adhokṣaje
ahaituky apratihatā
yayātmā suprasīdati
( SB 1.2.6)

ప్రతిఒక్కరూ సంతృప్తి కొరకు చూస్తున్నారు. Atyantikṣu అందరూ అంతిమ ఆనందం కోసం జీవితములో పోరాడుతున్నారు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో, వారు ఆలోచిస్తున్నప్పటికీ భౌతిక సంపదను కలిగి ఉండటం ద్వారా వారు సంతృప్తి చెందుతారు, కాని అది వాస్తవం కాదు. మీ దేశంలో ఉదాహరణకు, మీరు తగినంత భౌతిక ఐశ్వర్యము కలిగి ఉన్నారు ఇతర దేశాల కంటే, కానీ ఇప్పటికీ సంతృప్తి లేదు. భౌతిక ఆనందం కోసం మంచి అమరిక ఉన్నప్పటికీ, తగినంత ఆహారం, తగినంత... చక్కని అపార్ట్మెంట్, మోటార్ కార్లు, రోడ్లు, మైథున సుఖములో స్వేచ్ఛ కోసం చాలా మంచి అమరిక, రక్షణ కోసం మంచి అమరిక - ప్రతిదీ పూర్తిగా ఉంది - కానీ ఇప్పటికీ, ప్రజలు అసంతృప్తి, అయోమయముగా ఉన్నారు యువ తరం, వారు హిప్పీలు అవుతున్నారు, నిరాశ లేదా నిరసన వ్యక్తము చేస్తున్నారు ఎందుకంటే వారు సంతోషంగా లేరు నేను లాస్ ఏంజిల్స్లో అనేక సార్లు ఉదాహరణ ఇచ్చాను, నేను బెవర్లీ హిల్స్ లో ఉదయము నడుస్తున్నప్పుడు, చాలా మంది హిప్పీలు చాలా గౌరవనీయమైన ఇల్ల నుండి వస్తున్నారు. ఇది తన తండ్రి, ఆయన చాలా మంచి కారును కూడా కలిగి ఉన్నాడు అని కనిపిస్తుంది, కానీ దుస్తుల హిప్పీ విగా ఉంటాయి. కాబట్టి భౌతిక అమరిక అని పిలవబడేదానికి వ్యతిరేకంగా నిరసన ఉంది, వారికి ఇష్టం లేదు.

వాస్తవానికి మనము సంపద ద్వారా సంతృప్తి చెందలేము, అది సత్యము. ఇది శ్రీమద్-భాగవతం లో కూడా చెప్పబడింది. ప్రహ్లాద మహారాజు తన నాస్తిక తండ్రికి చెప్తాడు... ఆయన తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్య అనగా బంగారం కశిపు అనగా మృదువైన మంచం, పరుపు. అది భౌతిక నాగరికత. వారు చాలా మృదువైన పరుపు మరియు పరుపులో సహచరుడిని కోరుకుంటున్నారు, తగినంత బ్యాంకు బ్యాలెన్స్, డబ్బు. అది హిరణ్యకశిపుడు అంటే ఇంకొక అర్థం. అందువలన ఆయన సంతోషముగా కూడా లేడు . హిరణ్యకశిపుడు సంతోషంగా లేడు-కనీసం ఆయన సంతోషంగా లేడు, తన కుమారుడు ప్రహ్లాదుడు భగవంతుని భక్తునిగా మారుతున్నాడు అని, అది ఆయనకు ఇష్టములేదు. అందువలన ఆయన తన కుమారుడిని అడిగాడు: "నీవు ఎలా అనుభూతి చెందుతున్నావు? నీవు ఒక చిన్న పిల్లవాడవు, పిల్లవాడవు, నీవు అంత సౌకర్యవంతముగా ఎలా అనుభూతి చెందుతున్నావు నా బెదిరింపు ఉన్నప్పటికీ. నీ వాస్తవ ఆస్తి ఏమిటి? " అందుకు ఆయన సమాధానం చెప్పాడు, "నా ప్రియమైన తండ్రి, na te viduḥ svārtha-gatiṁ hi viṣṇum ( SB 7.5.31) మూర్ఖులైన వ్యక్తులకు, వారికి వారి అంతిమ ఆనందము యొక్క లక్ష్యము ఏమిటో తెలియదు విష్ణువు, భగవంతుడు, దేవాదిదేవుడు." Durāśayā ye bahir-artha-māninaḥ ( SB 7.5.31) Durāśayā, dur, ఆశ మీద ఆశతో, వారు ఆశిస్తున్నది అది ఎన్నటికి నెరవేరదు. అది ఏమిటి? Durāśayā ye bahir-artha-māninaḥ