TE/Prabhupada 0979 - భారతదేశం యొక్క పరిస్థితి చాలా గందరగోళముగా ఉంది
730408 - Lecture BG 04.13 - New York
భారతదేశం యొక్క పరిస్థితి చాలా గందరగోళముగా ఉంది ప్రభుపాద: ఈ కృష్ణ చైతన్య ఉద్యమం మానవ సమాజమునకు కొంచము బుర్రను సృష్టిస్తుంది. బ్రాహ్మణ. ఈ బుర్ర ... బ్రాహ్మణుల యొక్క కర్తవ్యము... బ్రాహ్మణ, ఈ పదం, ఈ పదమే వస్తుంది:
- namo brahmaṇya-devāya
- go-brāhmaṇa-hitāya ca
- jagad-dhitāya kṛṣṇāya
- govindāya namo namaḥ
- (CC Madhya 13.77, Viṣṇu Purāṇa 1.19.65)
కాబట్టి బ్రాహ్మణ అంటే భగవంతుని గురించి తెలుసుకునే వ్యక్తి. అది బ్రాహ్మణ అంటే భగవంతుని దృష్టిలో ఉంచుకొని, వారు ఇతరులకు ఇతరులకు భగవంతుని చైతన్యమును బోధిస్తారు. భగవంతుని చైతన్యం లేకుండా, మానవ సమాజం కేవలం జంతు సమాజం. ఎందుకనగా జంతువులు భగవంతుని చైతన్యము కలిగి ఉండలేవు, జంతువులు, పిల్లులు కుక్కల మధ్య మీరు ప్రచారము చేస్తున్నారు. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుడు అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి వారికి బుర్ర లేదు. కాబట్టి మానవ సమాజంలో, భగవంతుని గురించి ప్రచారము చేయడానికి బ్రాహ్మణుడు లేకపోతే, ఆ బ్రాహ్మణుడు భగవంతుని చైతన్యమునకు వ్యక్తులను తీసుకురాగలరో, అప్పుడు అది కూడా జంతు సమాజం. కేవలం తినడం, నిద్రపోవటం, లైంగిక జీవితం మరియు రక్షణ, ఇవి జంతువుల కర్తవ్యము కూడా. జంతువులకు కూడా ఎలా తినాలో తెలుసు, ఎలా నిద్ర పోవాలో తెలుసు, ఎలా మైథునజీవితం ఆనందించాలో తెలుసు, ఎలా రక్షించుకోవాలో తెలుసు. వారికి వారి విధానములోనే తెలుసు.
కాబట్టి కేవలం ఈ పనులను చేయడము అంటే మానవుడు కాదు. అప్పుడు మానవుని యొక్క లక్ష్యము నెరవేరదు. కృష్ణుడు సిఫార్సు చేసినట్లు, నాలుగు తరగతుల వ్యక్తులు ఉండాలి: cātur-varṇyaṁ mayā sṛṣṭam ( BG 4.13) బ్రాహ్మణ తరగతి మనుషులు ఉండాలి, క్షత్రియ తరగతి వ్యక్తులు ఉండాలి, ఒక వైశ్య తరగతి వారు ఉండాలి... ఇప్పటికే ఉన్నారు. కానీ అవి భగవద్గీతలో చెప్పబడిన విధానములో అవి శాస్త్రీయంగా చెప్పబడలేదు Cātur-varṇyaṁ mayā sṛṣṭam ( BG 4.13) ఇవి guṇa-karma-vibhāgaśaḥ. గుణ అంటే లక్షణముల ప్రకారం. కాబట్టి భారతదేశంలో, ఈ నాలుగు తరగతుల వ్యక్తులు ఉన్నారు, కానీ వారు నామమాత్రముగానే ఉన్నారు. వాస్తవానికి అది కూడా అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. ఎందుకంటే భగవద్గీత, guṇa-karma-vibhāgaśaḥ. ఇచ్చిన సూచనలు ఎవరూ అనుసరించడము లేదు. భారతదేశంలో, ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి, కానీ ఆయన గుణము, లక్షణములు, శుద్రుని కన్నా తక్కువగా ఉన్నాయి, కానీ ఇప్పటికీ అతడు ఒక బ్రాహ్మణునిగా అంగీకరించబడుతున్నాడు . ఇదే కష్టం. అందువల్ల, భారతదేశం యొక్క పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. కానీ ఇది ఒక శాస్త్రీయ పద్ధతి. మీ పాశ్చాత్య ప్రజలు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన అబ్బాయిలు మరియు అమ్మాయిలు, ఎవరైతే చేరినారో, వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, సూత్రాలు అమలు చేయడానికి. కాబట్టి మీరు ఈ కృష్ణ చైతన్యము ఉద్యమమును తీసుకుంటే, బ్రాహ్మణుల కోసం ఇది ఉద్దేశించబడినది, మీరు బ్రాహ్మణుడు అయితే , లక్షణముల ద్వారా, అప్పుడు మీరు, పాశ్చాత్య దేశాలు... ముఖ్యంగా అమెరికాలో, వారు మొదటి-తరగతి దేశంగా ఉంటారు. వారు మొదటి-తరగతి దేశంగా ఉంటారు. మీకు బుద్ధి ఉంది. మీకు వనరులు ఉన్నాయి మీరు ఉత్సాహవంతులుగా కూడా ఉన్నారు. మీరు మంచి విషయాలు అర్థము చేసుకుంటారు. కాబట్టి మీకు మంచి లక్షణాలు ఉన్నాయి. మీరు ఈ కృష్ణ చైతన్యము ఉద్యమమును తీవ్రంగా చేపట్టండి, మీరు ప్రపంచంలోని మొదటి-తరగతి దేశంగా ఉంటారు. ఇది నా అభ్యర్థన. చాలా ధన్యవాదాలు.
హరే కృష్ణ.
భక్తులు: జయ, కీర్తి అంతా శ్రీల ప్రభుపాదుల వారికి!