TE/Prabhupada 0990 - ప్రేమ అంటే 'నేను నన్ను ప్రేమిస్తున్నాను' అని ప్రేమపైధ్యానం చేయటము కాదు. కాదు

Revision as of 09:48, 11 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0990 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


740724 - Lecture SB 01.02.20 - New York


ప్రేమ అంటే 'నేను నన్ను ప్రేమిస్తున్నాను' అని ప్రేమపై ధ్యానం చేయటము కాదు. కాదు. భగవద్-భక్తి - యోగ. ఇది ఒక రకమైన యోగ , లేదా వాస్తవమైన యోగ. ఉన్నతమైన యోగ పద్ధతి భగవద్-భక్తి, భగవద్-భక్తి-యోగ ప్రారంభమవుతుంది, ఆదౌ గురు -ఆశ్రయః. మొదట గురువుకు శరణాగతి పొందాలి.

Tad viddhi praṇipātena
paripraśnena sevayā
( BG 4.34)

ప్రామాణికముగా ఇచ్చే దీక్షా కార్యక్రమానికి అర్థం లేదు. పూర్తిగా గురువుకి శరణాగతి పొందిన వ్యక్తి అయితే తప్ప, దీక్ష అనే ప్రశ్నే లేదు. Divya jñāna hṛde prokāśito. దివ్య- జ్ఞానం అంటే "ఆధ్యాత్మిక జ్ఞానం." గురువు తో మాయలు చేయడము, దౌత్య వేత్తగా ఉండటము కుట్రలు చేయడము ఈ మూర్ఖత్వము భగవద్-భక్తి-యోగాకు సహాయం చేయదు. మీరు మరికొన్ని విషయాలు, కొన్ని భౌతిక లాభాలను పొందవచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితం నాశనము అవుతుంది.

కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం, ఎలా డబ్బు సంపాదించాలో, ఎలా డబ్బు సంపాదించాలో అని కాదు. ఇది కృష్ణ చైతన్యము కాదు. చైతన్య మహా ప్రభు బోధిస్తున్నారు,

na dhanaṁ na janaṁ na sundarīṁ
kavitāṁ vā jagad-īśa kāmaye
( CC Antya 20.29)

న ధనము. భౌతిక వ్యక్తులకు, వారికి, వారికి ఏమి కావాలి? వారికి డబ్బు కావాలి. వారికి చాలామంది అనుచరులు చాలామంది అనుచరులు, లేదా చక్కని, అందమైన భార్య కావాలి. ఇది భౌతిక వ్యక్తి అంటే. కానీ చైతన్య మహా ప్రభు నిరాకరిస్తాడు. న ధనం: "కాదు, కాదు, నాకు ధనం వద్దు." ఇది ఉపదేశము. న ధనం, న జనం: "నేను ఎవరి మీద అధికారము చేయాలని కోరుకోవడము లేదు." లేదు Na… Na dhanaṁ na janaṁ na sundarīṁ kavitāṁ; కవితా కల్పన వలె చక్కని, అందమైన భార్య . ఈ విషయాలు నాకు ఇష్టం లేదు. ఏమిటి? అప్పుడు, భగవద్-భక్తి-యోగ,

mama janmani janmanīśvare
bhavatād bhaktir ahaitukī tvayi
( CC Antya 20.29)

భగవద్-భక్తుడు విముక్తిని కూడా కోరుకోరు. ఎందుకు కృష్ణ, చైతన్య మహా ప్రభు జన్మని జన్మని అని చెప్తున్నారు, "జన్మ జన్మ లకి..."? విముక్తి పొందిన వ్యక్తి, ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఇక ఏ జన్మ తీసుకోడు. నిరాకార వ్యక్తులు, వారు కృష్ణుని తేజస్సులోనికి విలీనము అవుతారు, కృష్ణుని శరీర కిరణాలలో, భక్తులు, వారు వైకుంఠ, లేదా గోలోకా వృందావనములోకి ప్రవేశించడానికి అనుమతి పొందుతారు. (పక్కన :) ధ్వని చేయవద్దు.

మనము ప్రసన్న మనా కావాలనుకుంటే అంటే ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక జీవితం. ఎల్లప్పుడూ కోపముగా ఉండటము కాదు, కొన్ని ప్రణాళికలు చేస్తూ. ఇది ఆధ్యాత్మిక జీవితం కాదు. మీరు ఏ భౌతిక వ్యక్తిని అయినా ఆనందముగా చూడలేరు. ఆయన కోపముగా, ఆలోచిస్తూ, ధూమపానం సిగరెట్ , మద్యపానం, కొన్ని పెద్ద, పెద్ద ప్రణాళికలను తయారు చేస్తుంటాడు. అది భౌతిక వ్యక్తి అంటే. bhagavad-bhakti-yogataḥ: prasanna-manaso. భగవద్గీతలో,

brahma-bhūtaḥ prasannātmā
na śocati na kāṅkṣati
( BG 18.54)

Prasannātmā. ఇది ఆధ్యాత్మిక జీవితం. మీరు ఆధ్యాత్మిక జీవితంలోనికి వాస్తవముగా వచ్చినట్లయితే, మీరు వ్యక్తిగతమైన తత్వములో కాని లేదా వ్యక్తిగత తత్త్వ శాస్త్రంలో నిరాకార తత్వము లో గాని, వారిద్దరూ ఆధ్యాత్మిక వ్యక్తులు; తేడా ఒకటి మాత్రమే ఉంది నిరాకారవాది అనుకుంటాడు నేను ఆత్మ. భగవంతుడు ఆత్మ. కాబట్టి మనము ఒకటి. మనము దాని లోనికి విలీనం అవుతాము. సాయుజ్య-ముక్తి. కృష్ణుడు వారికి సాయుజ్య-ముక్తిని ఇస్తాడు. కానీ అది చాలా సురక్షితమైనది కాదు, ఎందుకంటే ānandamayo 'bhyāsāt (Vedānta-sūtra 1.1.12). అనంద, వాస్తవమైన ఆనందము, తానే స్వయంగా గ్రహించలేడు, రెండు ఉండాలి. ప్రేమ అంటే "నేను నన్ను ప్రేమిస్తున్నాను" అని కాదు ప్రేమ మీద ధ్యానం చేయడము కాదు. కాదు మరొక వ్యక్తి, ప్రేమికుడు ఉండాలి. అందువలన ద్వైతవాద. మీరు భక్తి పాఠశాలకు వచ్చిన వెంటనే, ద్వైతవాదం ఉండాలి: రెండు - కృష్ణుడు మరియు కృష్ణ భక్తుడు. కృష్ణుడు మరియు కృష్ణుని సేవకుని మధ్య కార్యక్రమాలను భక్తి అని పిలుస్తారు. దానిని భక్తి అని పిలుస్తారు వ్యవహారాలు. అందువల్ల భగవద్-భక్తి-యోగతః ఇలా చెప్పబడింది. ఏకత్వం, ఏకత్వం కాదు. ఎప్పుడూ భక్త ఉంటాడు... భక్తుడు కృష్ణుడిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.