TE/Prabhupada 0992 - అవకాశవాదులకు కృష్ణ చైతన్యము లేదు

Revision as of 09:34, 11 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0992 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


740724 - Lecture SB 01.02.20 - New York


అవకాశవాదులకు కృష్ణ చైతన్యము లేదు. అంతా భక్తియుక్త సేవలో ఉంది, భక్తి రసామృత సింధు, చైతన్య మహాప్రభు భోధనలు, శ్రీమద్-భాగవతం, భగవద్గీత మనము ప్రచురిస్తున్నాము. మీరు అర్థం చేసుకోకపోతే, మీరు అనుకుంటే "ఈ పుస్తకాలు అమ్మకాని కోసం, మేము అంతా జ్ఞానవంతులము. మేము అంతా నేర్చుకున్నాము, పూర్తయ్యింది. మన పని అయిపోయింది, " అది పరిస్థితిని మెరుగుపరచదు.

evaṁ prasanna-manaso
bhagavad-bhakti-yoga
bhagavat-tattva-vijñānaṁ
(SB 1.2.20)

ఇది ఒక శాస్త్రం. మీరు శాస్త్రమును నేర్చుకుంటే... ఉదాహరణకు మన స్వరూప దామోదర లాగా, డాక్టర్ - కాబట్టి ఆయన ఇప్పుడు డాక్టర్. న్యూ వృందావనములో మరో డాక్టర్ ఉన్నాడు. ఆయన కూడా శాస్త్రవేత్త. మీరు డాక్టరేట్ బిరుదు తీసుకోవాలనుకుంటే, దానికి కూడా శరణాగతి పొందాలి. కమిటీలు, మూడు-, నాలుగు-వ్యక్తుల కమిటీలు ఉంటాయి. వారు ధృవీకరించినప్పుడు, "అవును, ఇది సరైనది. ఫలానా వారు సమర్పించిన ఈ థీసిస్, ఇది ఆమోదించబడింది, "అప్పుడు మీరు పొందుతారు. కావున ప్రతిచోటా tad vijñānārthaṁ sa gurum eva abhigacchet (MU 1.2.12) కావున కృష్ణుడి విజ్ఞానాన్ని అర్థం చేసుకోవటంలో మనము తీవ్రంగా లేకుంటే, మీరు ఇది అవ్వటానికి అది అవ్వటానికి కొంత అవకాశాన్ని తీసుకుంటే, కొంత డబ్బు సంపాదించుకుంటే, ఇది మరియు అది, ఆ మొత్తం విషయము పూర్తయింది. అవకాశవాదులకు కృష్ణ చైతన్యము లేదు. వాస్తవముగా శరణాగతి పొందిన వ్యక్తులకు: మదాశ్రయ.

కాబట్టి bhagavat-tattva-vijñānaṁ. మనం అందరము, కనీసం ఇక్కడ ఉన్నవారు, భాగవత-తత్వ-విజ్ఞానములో గ్రాడ్యుయేట్ అవ్వడానికి మనము చేరాము. ఇది పద్ధతి. మదాశ్రయ, కృష్ణుడు చెప్తాడు. మదాశ్రయ అంటే yogaṁ yuñjan mad-āśrayaḥ. కృష్ణుడి క్రింద లేదా.. అది సాధ్యం కాదు, ఎందుకనగా కృష్ణుని సేవకుని ఆశ్రయం తీసుకోకుండా... Gopī-bhartuḥ pada-kamalayor dāsa-dāsānudāsaḥ ( CC Madhya 13.80 Padyāvalī 74) .. కృష్ణుని సేవకుని సేవకుని సేవకుని సేవకుడు అవ్వాలి. ఇష్ట పడటము కాదు, "నేను కృష్ణునికి నేరుగా సేవకునిగా ఉంటాను." అది మాయవాదం. మన పద్ధతి సేవకుని... చైతన్య మహా ప్రభు ప్రచారము చేస్తారు, సేవకుని... ఎంత ఎక్కువ వందవ తరానికి సేవకుడు సేవకుడు అయితే, ఆయన పరిపూర్ణుడు.

కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

bhagavat-tattva-vijñānaṁ
mukta-saṅgasya jāyate
(SB 1.2.20)

Bhagavat-tattva-vijñānaṁ. ఈ శాస్త్రము, ఎవరు అర్థం చేసుకోగలరు? ముక్త-సంగస్య. ముక్త అంటే "విముక్తి" పొందిన వారు, సంగ అంటే "సాంగత్యము." కాబట్టి సాంగత్యము అంటే మనం ఎల్లప్పుడూ... మనము భౌతిక ప్రకృతి వలన కలుషితమవుతున్నాము. కొన్నిసార్లు మనము మంచి వారిగా ఉంటాము; కొన్నిసార్లు మనము రజో గుణములో ఉంటాము; కొన్నిసార్లు మనము మూర్ఖలు గా ఉంటాము. మూడు గుణములు ఉన్నాయి. వాటిలో కొన్ని మంచివి, వాటిలో కొన్ని ఉద్వేగభరితమైనవి వాటిలో కొన్ని మూర్ఖుల గుణాలు కాబట్టి మనం సత్వ స్థితి అని పిలవబడే దానిని కూడా అధిగమించవలసి ఉంటుంది. దానిని ముక్త సంఘ అని అంటారు. భౌతిక జీవితంలో, మనము ఎల్లప్పుడూ ఈ గుణాలతో సాంగత్యము చేస్తున్నాము, మూడు గుణాలు, గుణ-మయీ, మాయ. Daivī hy eṣā guṇa-mayī. Guna-mayī. గుణ, ఈ మూడు గుణములు. ఇది చాలా కష్టము. కొన్నిసార్లు మనము సత్వ గుణములో ఉంటాము, తరువాత మనము రజో గుణములోకి పడిపోతాము, తరువాత మనము తమో గుణములోకి పడిపోతాము. లేదా తమో గుణము నుండి నేను సత్వ గుణములోనికి మళ్ళీ వస్తాను మరియు మళ్ళీ పడిపోతాను. ఇది జరుగుతోంది. అందువల్ల మీరు ఈ గుణాలకు అన్నింటికీ అతీతముగా, ముక్త-సంగస్య అవ్వాలి. ఇవే కాకుండా. "నేను చాలా మంచి మనిషిని, నేను మంచి నిర్వాహకుడను, నేను ఇది..." మీరు దానిని కూడా అధిగమించాలి. దీనిని ముక్త-సంగస్య అని పిలుస్తారు.

కానీ ఆ ముక్త-సంగస్య సాధ్యము అవుతుంది, మనము భక్తియుక్త సేవలో నిజాయితిగా నిమగ్నమైతే. ఉదాహరణకు అర్చా మూర్తి ఆరాధన మాదిరిగానే. అర్చా మూర్తి ఆరాధన అంటే క్రమంగా ముక్త-సంఘ అవ్వటము అని అర్థం. అందువలన అర్చా మూర్తి ఆరాధన తప్పని సరి. పద్ధతి ఉంది: ఉదయాన్నే మీరు నిద్ర లేవాలి. మీరు స్నానము చేయాలి; మీరు మంగళ ఆరతి చేయాలి. ఆ తరువాత, ఆ తరువాత, కొన్ని పుష్పాలతో అలంకరణ చేసి, ఈ విధముగా, మీరు ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటే, అప్పుడు క్రమంగా మీరు ముక్త-సంఘ అవుతారు.