TE/Prabhupada 1002 - నేను కొంత లాభము కోసం భగవంతుణ్ణి ప్రేమిస్తే, అది వ్యాపారము అవుతుంది; అది ప్రేమ కాదు

Revision as of 06:36, 29 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 1002 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750713 - Conversation B - Philadelphia


నేను కొంత లాభము కోసం భగవంతుణ్ణి ప్రేమిస్తే, అది వ్యాపారము అవుతుంది; అది ప్రేమ కాదు

శాండీ నిక్సన్: అటువంటప్పుడు, వారికి మార్గనిర్దేశము చేయగల ఒక ఆధ్యాత్మిక గురువు గురించి ఎలా తెలుస్తుంది?

ప్రభుపాద: ఈ విషయాలను భోధించేవాడు - భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవచ్చు, ఆయనను ఎలా ప్రేమించవచ్చు- ఆయన ఆధ్యాత్మిక గురువు. లేకపోతే బూటకపు వ్యక్తి, మూర్ఖుడు, బోగస్. కొన్ని సార్లు వారు "నేను భగవంతుణ్ణి" అని తప్పుదారి పట్టారు. నిస్సహాయపు ప్రజలు, వారికి భగవంతుడు అంటే ఏమిటో తెలియదు, ఒక మూర్ఖుడు ప్రతిపాదిస్తాడు, "నేను భగవంతుడను", వారు దానిని అంగీకరిస్తారు. మీ దేశంలో ఉన్నట్లు వారు నిక్సన్ ను అధ్యక్షుడిగా ఎన్నికున్నారు, మళ్ళీ ఆయనని దించేసారు. అంటే వారికి వాస్తవమునకు ప్రామాణికమైన అధ్యక్షుడు ఎవరో తెలియదు, ఎవరినో ఎన్నుకుంటారు, తిరిగి వారిని దింపేస్తారు అదేవిధముగా, ప్రజలు మూర్ఖులు. ఏవరైనా దుష్టుడు వచ్చి, ఆయన "నేను భగవంతుణ్ణి" అని అంటే వారు అంగీకరిస్తారు. మరలా వారు మరొకరిని అంగీకరిస్తారు. ఇది జరుగుతోంది. కాబట్టి భగవంతుణ్ణి, ఆయనను ఎలా ప్రేమించాలి అనే విషయాలను అర్థం చేసుకోవడం కోసము చాలా తీవ్రమైన విద్యార్థిగా ఉండాలి. అది ధర్మము. లేకపోతే, అది కేవలం సమయం వృధా.

మనము బోధిస్తున్నాం. ఇది ఇతరులకు మనకు మధ్య ఉన్న వ్యత్యాసం. మనము కృష్ణుడిని, భగవంతుణ్ణి మహోన్నతమైన వ్యక్తిని, సైన్స్, ఆయనను ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి భోధిస్తున్నాము. భగవద్గీత అక్కడ ఉంది, భాగవతము అక్కడ ఉంది. బోగస్ కాదు. ప్రామాణికం. కాబట్టి భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవచ్చో, ఆయనను ఎలా ప్రేమించాలి అని నేర్పించే ఏకైక సంస్థ ఇది. రెండే పనులు, మూడో పని లేదు. మన అవసరాలకు ఇవ్వమని భగవంతుణ్ణి అడగడము మన పని కాదు. భగవంతుడు మన అందరికీ మన అవసరాలకు ఇస్తాడని మనకు తెలుసు. కేవలము పిల్లులు మరియు కుక్కల వలె, వాటికి ఏ ధర్మము (మతము) లేదు. వాటికి ధర్మము ఏమిటో తెలియదు. కానీ అయినప్పటికీ, పిల్లులు మరియు కుక్కలకు జీవితం యొక్క అవసరాలు సరఫరా చేయబడినవి కావున మనము కృష్ణుడిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, "మా దైనందిన రొట్టె మాకు ఇవ్వండి" అని అడగడము. ఆయన ఇప్పటికే సరఫరా చేస్తున్నారు. మన కర్తవ్యము ఆయనని ఎలా ప్రేమించాలి. అది ధర్మము. Dharmaḥ projjhita-kaitavaḥ atra paramo nirmatsarāṇāṁ satāṁ vāstavaṁ vastu vedyam atra ( SB 1.1.2) Sa vai puṁsāṁ paro dharmaḥ yato bhaktir adhokṣaje ( SB 1.2.6) భగవంతుని ఎలా ప్రేమించాలి అని భోధించేది, అది మొదటి తరగతి ధర్మము. ఆ ప్రేమ-ఏ భౌతిక ఉద్దేశ్యం కోసము కాదు: భగవంతుడా, నీవు నాకు ఇవ్వండి. అప్పుడు నేను ప్రేమిస్తాను. కాదు అహైతుకీ. ప్రేమ అంటే ఏ వ్యక్తిగత లాభం లేకుండా అంతే. నేను కొంత లాభం కోసం భగవంతుణ్ణి ప్రేమిస్తే, అది వ్యాపారము; అది ప్రేమ కాదు. Ahaituky apratihatā. భగవంతుని మీద అలాంటి ప్రేమను ఏ భౌతిక కారణము ఆపలేదు. ఏ పరిస్థితిలోనైనా, భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో తెలుసుకోవచ్చు. ఇది షరతులతో కాదు, నేను పేద వాడిని, నేను భగవంతుణ్ణి ఎలా ప్రేమిస్తాను? నాకు చాలా పనులు చేయడానికి ఉన్నాయి. "లేదు, అది అలా కాదు. పేద, ధనిక, లేదా యువకులు లేదా వృద్ధులు, నల్లటి వారు లేదా తెల్లటి వారు, వారికి ఏ అడ్డంకి లేదు. ఎవరైనా దేవుణ్ణి ప్రేమించాలి అని అనుకుంటే, ఆయనను ప్రేమించవచ్చు