TE/Prabhupada 1005 - కృష్ణ చైతన్యము లేకుండా ఉంటే, మీరు కేవలం చెత్త కోరికలను కలిగి ఉంటారు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1004 - Travailler comme des chiens et des chats et mourrir. Cela n'est pas de l'intelligence|1004|FR/Prabhupada 1006 - Nous ne sommes pas en train d'introduire le système de castes|1006}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1004 - పిల్లులు కుక్కల వలె పని చేయడము మరియు చనిపోవడము ఇది తెలివి కాదు|1004|TE/Prabhupada 1006 - మనము కుల వ్యవస్థను ప్రవేశ పెట్టడము లేదు|1006}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|1QPdaUd4khU|కృష్ణ చైతన్యము లేకుండా ఉంటే, మీరు కేవలం చెత్త కోరికలను కలిగి ఉంటారు  <br/>- Prabhupāda 1005}}
{{youtube_right|fUouejlOBcI|కృష్ణ చైతన్యము లేకుండా ఉంటే, మీరు కేవలం చెత్త కోరికలను కలిగి ఉంటారు  <br/>- Prabhupāda 1005}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



750713 - Conversation B - Philadelphia


కృష్ణ చైతన్యము లేకుండా ఉంటే, మీరు కేవలం చెత్త కోరికలను కలిగి ఉంటారు

శాండీ నిక్సాన్: సరే. ఈ ప్రశ్న నాకు అడగటానికి కష్టముగా ఉంది, ఎందుకంటే ఇది నా అజ్ఞానం చూపుతుంది. కానీ నేను అజ్ఞానంలో అడగడం లేదు. నాకు టేప్లో మీ సమాధానం కావాలి, సరే? మీ కోరిక ..? కృష్ణ చైతన్యాన్ని పొందాలనే కోరికతో సహా అన్ని కోరికలను చివరికి విడచి పెట్టాలా?

ప్రభుపాద: కృష్ణ చైతన్యము లేకుండా, మీరు కేవలం చెత్త కోరికలను కలిగి ఉంటారు. మీరు కృష్ణ చైతన్య వంతులు అయినప్పుడు, అప్పుడు మీరు సరియైన కోరికలను కోరుకుంటారు.

శాండీ నిక్సన్: అనేక ఆధ్యాత్మిక మార్గాల లక్ష్యం లోపల ఉన్న గురువు కనుగొనడము.

ప్రభుపాద: లోపల?

శాండీ నిక్సన్: లోపల ఉన్న గురువును. ఇది భిన్నమైనదేనా?

ప్రభుపాద: ఎవరు చెప్పారు , లోపల ఉన్న గురువును కను గోనాలి అని?

శాండీ నిక్సాన్: ఉమ్...

జయతీర్థ: కిర్పాల్ సింగ్, ఆయన చెప్పాడు.

శాండీ నిక్సాన్: నన్ను క్షమించండి?

జయతీర్థ: కిర్పాల్ సింగ్, అనే ఒక వ్యక్తి.

గురుదాస: కృష్ణమూర్తి కూడా ఇలా అన్నారు.

ప్రభుపాద: ఎందుకు ఆయన ప్రచారము చేయడానికి వచ్చాడు? (నవ్వు) ఈ మూర్ఖుడు, ఎందుకు ఆయన ప్రచారము చేయడానికి వచ్చాడు? ఇది సమాధానం. ఈ విషయాలు మూర్ఖులచే చెప్ప బడతాయి ఆయన ప్రచారము చేయడానికి వచ్చాడు, ఆయన " లోపల ఉన్న గురువును కనుగోనండి." అప్పుడు మీరు ఎందుకు వచ్చారు భోదించ డానికి? ప్రజలు తెలివైన వారు కాదు ఎందుకంటే, వారు ఆయనని పట్టుకోలేరు ఆయన అన్ని అర్థంలేనివి మాట్లాడతాడు, వారు వింటారు, అంతే.

గురుదాస: ఆయన "పుస్తకాల అవసరం లేదు" అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. (నవ్వు)

ప్రభుపాద: అందువల్ల ఆయన ఎంత మూర్ఖుడో అని మీరు తెలుసుకోవచ్చు. అవునా కాదా? మీరు ఒప్పుకుంటారా, లేదా? ఆయన పుస్తకాన్ని వ్రాసాడు ఆయన ఇలా చెప్పాడు, "పుస్తకాల అవసరం లేదు." ఆయన ప్రచారము చేయడానికి వచ్చాడు ఆయన చెప్పాడు, "గురువు అవసరం లేదు. గురువు లోపల ఉన్నాడు. "ఆయన ఒక మూర్ఖుడు కాదా?

శాండీ నిక్సాన్: సరే, వారు చెప్పేవారు... ఆ ప్రజలు...

ప్రభుపాద: కాదు, మొదట నా ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వండి. ఆయన వివాదాస్పద విషయాలు చెప్పినట్లయితే, ఆయన ఒక మూర్ఖుడు కాదా?

శాండీ నిక్సాన్: సరే, ఆయన తనకు తాను విరుద్ధంగా ఉన్నాడు.

ప్రభుపాద: అందువలన ఆయన ఒక మూర్ఖుడు. తనను తాను ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలియదు.

శాండీ నిక్సాన్: వేదాలను లాంఛనప్రాయంగా మరియు యథాతధముగా కూడా తీసుకోవచ్చా?

ప్రభుపాద: యథాతధముగా. మనము భగవద్గీత యథాతధముగా ఇస్తున్నాము, ఇది లాంఛనప్రాయంగా కాదు.