TE/Prabhupada 1006 - మనము కుల వ్యవస్థను ప్రవేశ పెట్టడము లేదు



750713 - Conversation B - Philadelphia


మనము కుల వ్యవస్థను ప్రవేశ పెట్టడము లేదు

శాండీ నిక్సన్: మీరు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారా ... నేను ఈ ప్రశ్నను రెండు రకాలుగా అడుగలనుకుంటున్నాను. మొదట నేను ఒక విధముగా అడుగుతాను, ఇది ఒక భావములో తప్పు. బహుశా నేను ఈ మరో విధముగా అడుగుతాను మీ సమాధానమును పొందుతాను. మీరు పాశ్చాత్య దేశాలలో అవగాహనను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారా ... మీరు పాశ్చాత్య దేశాలలో పురాతన భారతీయ కుల వ్యవస్థని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను నా దగ్గర ...

ప్రభుపాద: మేము కుల వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని మీరు ఎక్కడ చూసినారు మీరు ఎక్కడ కనుగొన్నారు? మొదట నన్ను తెలుసుకోనివ్వండి. ఎందుకు మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు? మేము భారతీయ కుల వ్యవస్థను ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని మీరు గమనించినట్లయితే, అప్పుడు మీరు చెప్పండి. అలాంటి ప్రయత్నం లేకుంటే, మీరు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు?

శాండీ నిక్సన్: సరే, ఎందుకంటే చాలామంది ఆసక్తి కలిగి ఉన్నారు, నేను ప్రశ్న అడగటానికి కారణం ...

ప్రభుపాద: లేదు, లేదు, చాలామంది ప్రజలు-మీరు కూడా వారిలో ఒకరు. కావున మేము కులవ్యవస్థను ప్రవేశ పెట్టాడానికి ప్రయత్నిస్తున్నామని మీరు ఎక్కడ చూసినారు? మొదట ఎక్కడ ప్రయత్నం చేస్తున్నామో కనుగొనండి. అప్పుడు మీరు ప్రశ్న అడగండి. లేకపోతే ఇది సంబంధము లేని ప్రశ్న.

శాండీ నిక్సన్: భగవద్గీతలో ఈ కుల వ్యవస్థ గురించి చెప్పబడినది. ప్రభుపాద: హుహ్?

శాండీ నిక్సన్: భగవద్గీతలో కుల వ్యవస్థ గురించి ప్రస్తావించారు.

ప్రభుపాద: గీత, ఏమి చెప్పుతుందో నీకు తెలుసా?

శాండీ నిక్సన్: నాలుగు కులాలు మరియు అంటరాని కులము

ప్రభుపాద: అది ఏమిటి? దేని ఆధారముగా?

శాండీ నిక్సన్: నేను దానిని నేరుగా గుర్తించలేను. కానీ బ్రహ్మా ...

ప్రభుపాద: బ్రహ్మానందా. ఇది కుల వ్యవస్థ అని ఎవరు చెప్పారు? ఇది కుల వ్యవస్థ కాదు. Cātur-varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma-vibhāgaśaḥ ( BG 4.13) లక్షణముల ప్రకారము మరియు పని ప్రకారం, వ్యక్తులు నాలుగు విభాగాలు ఉన్నారు. మీరు ఇంజనీర్లు ఉన్నారని అర్థం చేసుకోగలరు వైద్యులు ఉన్నారు. కాబట్టి మీరు వారిని కులంగా తీసుకుంటారా? , ఓ, ఆయన ఇంజనీర్ కులం. ఆయన వైద్య కులం. "మీరు అలా అంటారా?

శాండీ నిక్సన్: నేను నా అభిప్రాయాన్ని చెప్పాలని భావించడము లేదు, ఎందుకంటే నేను మీరు మాట్లాడుతున్నది రికార్డింగ్ చేస్తున్నాను. (నవ్వారు)

ప్రభుపాద: నేను నిన్ను అడుగుతున్నాను. నేను నిన్ను అడుగుతున్నాను...

శాండీ నిక్సన్: సరే, నేను ఎల్లప్పుడూ కులాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఇది కేవలము అవి అక్కడ ఉన్నాయన్న వాస్తవాన్ని మనము గుర్తించలేదు.

ప్రభుపాద: కాదు, ఒక మనిషి అర్హుడైన వైద్య నిపుణుడు అయినట్లయితే మనం అతన్ని వైద్యునిగా అంగీకరిస్తాము. ఒక వ్యక్తి అర్హుడైన ఇంజనీర్ అయితే, మనము ఆయనని ఇంజనీర్ గా అంగీకరిస్తాము. అదేవిధముగా, భగవద్గీత సలహా ఇస్తుంది, సలహా ఇవ్వడము కాదు; అది అక్కడ ఉంది - నాలుగు తరగతుల వ్యక్తులు ఉన్నారు: అత్యంత తెలివైన తరగతి వ్యక్తులు, నిర్వాహక తరగతి వ్యక్తులు, ఉత్పాదక తరగతి వ్యక్తులు, సాధారణ కార్మికులు. అది ఇప్పటికే ఉంది. భగవద్గీత వారిని ఎలా వర్గీకరించాలి అని చెప్తుంది, "ఆయన ఈ తరగతి చెందినవాడు, అతడు ఆ తరగతికి చెందినవాడు." ఇది భగవద్గీతలో వివరించబడింది, జన్మ పరముగా కాదు, వారసత్వంగా కాదు, ఒకరు ఈ కులముకు చెందుతారు మీరు తప్పుగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించవద్దు. వర్గీకరణ ఇప్పటికే ఉంది: ఒక తరగతి యొక్క వ్యక్తులు, చాలా తెలివైన వారు. ఆయన మానవ సమాజంలో లేరా? మీరు వ్యక్తులు అందరు సమానంగా తెలివైన వారు అని భావిస్తున్నారా? మీరు భావిస్తున్నారా? ఒక తరగతి ఉండాలి, చాలా ఉన్నతమైన తెలివైన తరగతి వారు. తెలివైన తరగతి యొక్క లక్షణాలు ఏమిటి? ఇది భగవద్గీతలో వివరించబడింది. మొదటి-తరగతి తెలివైన మనిషి తన మనసును నియంత్రిస్తాడు, ఆయన ఇంద్రియాలను నియంత్రిస్తాడు, చాలా నిజాయితీగా ఉంటాడు, చాలా శుభ్రంగా, చాలా సాధారణముగా, చాలా సహనంతో, జ్ఞానములో చాలా ఉన్నత స్థానములో, జీవితంలో జ్ఞానమును ఆచరణాత్మకముగా ఉపయోగిస్తాడు, భగవంతుడు మీద దృఢమైన నమ్మకము. ఇది మొదటి-తరగతి వ్యక్తి. ఇది భారతదేశం లోపల మాత్రమే కాదు, మీరు ఎక్కడైనా ఈ లక్షణాలను కనుగొంటే, ఆయన మొదటి తరగతి వ్యక్తి.

కాబట్టి మనం ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, మొదటి-తరగతి వ్యక్తులు లేకుండా, సమాజం నిష్ఫలమైనది. కాబట్టి మొదటి-తరగతి వ్యక్తులు ఉన్నారు. మీరు శిక్షణ ఇవ్వండి. ఉదాహరణకు ఒక బాలుడు తెలివైనవాడు; అయినప్పటికీ, ఆయనకు పాఠశాల, కళాశాలలో శిక్షణ అవసరం. అప్పుడు ఆయన తన మొదటి-తరగతి బుద్ధిని, మొదటి-తరగతి పరిస్థితిని కొనసాగిస్తాడు. కాబట్టి మొదటి-తరగతి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మనము సరిగ్గా వారికి శిక్షణ ఇవ్వాలి మనస్సు యొక్క నియంత్రికుడిగా ఎలా మారాలి అని, ఇంద్రియాల యొక్క నియంత్రికుడిగా ఎలా మారాలి, ఎలా నిజాయితీగా మారాలి, ఎలా అంతర్గతంగా మరియు బాహ్యంగా పవిత్రముగా ఉండాలి, జ్ఞానము పరిపూర్ణముగా ఎలా కలిగి ఉండాలి ఆచరణాత్మక జీవితంలో జ్ఞానాన్ని ఉపయోగించడానికి ఎలా ప్రయత్నించాలి, ఎలా భగవంతుడి చైతన్యము కలిగిన వాడిగా మారాలి. ఈ శిక్షణ ... ఒక మొదటి-తరగతి వ్యక్తి తీసుకోగలడు, ఉదాహరణకు ఈ అబ్బాయిలందరు తీసుకున్నట్లుగా, వారు వారి మొదటి-తరగతి బుద్ధిని కలిగి ఉన్నారు, ఇప్పుడు వారు శిక్షణ పొందుతున్నారు. ఇది అవసరం: శిక్షణ పొందిన మొదటి-తరగతి వ్యక్తులు. ఆ శిక్షణ అవసరం.

కాబట్టి మనము కుల వ్యవస్థను ప్రవేశ పెట్టడము లేదు, ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఎటువంటి దుష్టుడైనా, ఆయన ఒక బ్రాహ్మణుడు అవుతాడు మనము దానిని ఆమోదించము. ఒక బ్రాహ్మణుడు అవ్వటానికి మొదటి-తరగతి శిక్షణ పొందిన వ్యక్తి కావాలి, మనము ఆయనని అంగీకరించాలి. ఆయన భారతదేశం లేదా ఐరోపా లేదా అమెరికా దేశస్తుడా అనే విషయము పట్టింపు లేదు. ఇది పట్టింపు లేదు. మనము ఈ పద్ధతిని ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది భగవద్గీతలో పేర్కొనబడింది. కుల వ్యవస్థ అంటే అర్థం ఒక మనిషి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినవాడు, అలవాటు ద్వారా ఐదవ-తరగతి వ్యక్తి అయినా, ఆయన జన్మించిన కారణముగా మొదటి-తరగతి వ్యక్తిగా అంగీకరించారు. అదేవిధముగా , చాలా తెలివైన వ్యక్తి, ఆయన అన్ని మొదటి-తరగతి అలవాట్లను అనుసరించగలడు కానీ ఆయన శూద్ర కుటుంబంలో జన్మించినందున, ఆయన శూద్రుడు. మనము ఈ అర్థము లేనివి ఆపాలని కోరుకుంటున్నాము. మనము మొదటి-తరగతి బుద్ధి కలిగిన వారిని ఎన్నుకుంటున్నాము, మొదటి-తరగతి వ్యక్తులుగా ఎలా అవ్వాలో శిక్షణ ఇస్తున్నాము. ఇది మన కర్తవ్యము. ఈ చెత్త విషయమును ప్రవేశ పెట్టడము లేదు. లేదు, మేము ప్రవేశ పెట్టడము లేదు లేకపోతే వారికి నేను పవిత్రమైన జంధ్యమును ఎలా ఇస్తాను? ఇప్పుడు చూడండి. భారతదేశం నుండి ఎవరైనా, అతడు ఒక మొదటి తరగతి బ్రాహ్మణ అని ఆయన అర్థము చేసుకుంటారు. మనము అలాంటి శిక్షణ ఇస్తున్నాము