TE/Prabhupada 1016 - భాగవతము చెప్తుంది ప్రతీ దానీ యొక్క మూలము చైతన్యము కలిగి ఉంటుంది: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1015 - Sauf s'il y a une force vivante derrière la matière, rien ne peut être crée|1015|FR/Prabhupada 1017 - Brahma n'est pas le créateur original. Le Créateur original est Krishna|1017}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1015 - దాని వెనుక జీవశక్తి లేనట్లయితే అక్కడ ఏదీ కూడా సృష్టించబడదు|1015|TE/Prabhupada 1017 - బ్రహ్మ వాస్తవ సృష్టికర్త కాదు. వాస్తవ సృష్టికర్త కృష్ణుడు|1017}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|VBENS1IfzxE|భాగవతము చెప్తుంది ప్రతీ దానీ యొక్క మూలము చైతన్యము కలిగి ఉంటుంది  <br/>- Prabhupāda 1016}}
{{youtube_right|hEYRhH3VWHE|భాగవతము చెప్తుంది ప్రతీ దానీ యొక్క మూలము చైతన్యము కలిగి ఉంటుంది  <br/>- Prabhupāda 1016}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 21:04, 8 October 2018



720200 - Lecture SB 01.01.01 - Los Angeles


భాగవతము చెప్తుంది ప్రతీ దానీ యొక్క మూలము చైతన్యము కలిగి ఉంటుంది నా కోరిక ప్రకారం, నేను ఈ శరీరాన్ని ఉత్పత్తి చేసాను. కానీ నేను నా శరీరం అని చెప్పుకున్నట్లు, నాకు ఈ శరీరం ఎలా పని చేస్తుందో తెలియదు. అది నాకు తెలియదు. నేను నా జుట్టును కత్తిరించాను, కానీ జుట్టు తిరిగి ఎలా పెరుగుతుందో నాకు తెలీదు. నేను నా గోళ్ళను కత్తిరించాను. కానీ నాకు తెలియదు ఎలా, లోపల ఏమి పని జరుగుతుందో, గోర్లు మరియు వెంట్రుకలు కత్తిరించిన తర్వాత కూడా, మళ్ళీ పెరుగుతాయి. నాకు తెలియదు... నేను తింటున్నాను, నాకు తెలుసు, ఎందుకంటే నేను గణనీయంగా ఏదో తింటున్నాను ఇది నా ఉదరం లోపల వివిధ రకాల స్రావాలుగా రూపాంతరం చెందుతుంది, స్రావం శరీరము అంతా పంపిణీ చేయబడుతుంది. నాకు కొందరు వైద్యులు లేదా వైద్య విజ్ఞాన శాస్త్రం నుండి తెలుసు, కానీ నా వరకు ఆలోచిస్తే, నా ఆహారం ఎలా రక్తంలోకి మారుతుందో నాకు తెలీదు. నా శరీరం యొక్క వివిధ భాగాలలో రక్తం ఎలా వ్యాపించింది, ఆపై నేను మళ్లీ శక్తిని ఎలా పొందుతాను. వాస్తవమునకు నాకు తెలియదు.

కానీ భగవంతునికి, ఆయనకి పరోక్షంగా మరియు ప్రత్యక్షంగా తెలుసు, రెండూ విధాలుగా, ఎలా ఈ భౌతిక విశ్వము పని చేస్తుంది. ఆయనకు ప్రతిదీ తెలుసు. ఎలా సూర్యుడు ఉదయిస్తున్నాడు. చంద్రుడు ఎలా ఉదయిస్తున్నాడు. మహా సముద్రాలు ఎలా స్థిరంగా ఉన్నాయి. అవి భూమి మీదకు చొరబడటము లేదు. అటువంటి గొప్ప సముద్రం - ఇది ఒక్క క్షణములో ఏ నగరము పైన అయినా లేదా ఏ భూమి పైన అయినా వరదగా రావచ్చు. కానీ అలా చేయడం లేదు. కాబట్టి నిర్దేశము ఉంది. అందువలన భాగవతము చెప్తుంది ప్రతిదాని యొక్క మూలము చైతన్యము కలిగి ఉంటుంది. చైతన్యము. చైతన్యము వలన ప్రతిదీ నియంత్రణలో ఉంది. Anvayād itarataś cārtheṣv abhijñaḥ ( SB 1.1.1) Abhijñaḥ 'పూర్తిగా అర్థం చేసుకుంటారు.

తర్వాతి ప్రశ్న అడగవచ్చు? ఎక్కడ నుంచి ఆయనకు ఈ జ్ఞానము వచ్చినది. ఆయన మూలం. ఎందుకంటే మనకు ఈ ఆలోచన ఉంది. ప్రతి జీవికి ఇతరుల నుండి జ్ఞానం లభిస్తుంది ఉదాహరణకు మా ఆధ్యాత్మిక గురువు నుండి నేను జ్ఞానాన్ని నేర్చుకున్నట్లుగానే. నా శిష్యులు నా నుండి జ్ఞానం పొందుతున్నారు, కాబట్టి వారి జ్ఞానం కూడా ఎవరి ద్వారానో ఇవ్వబడింది. దీనికి ఒక మూలం ఉంది. కానీ, భగవంతుడు మూలం అయినట్లయితే, ఆయనకు ఈ సృష్టించడము మరియు నిర్వహించడము యొక్క జ్ఞానము ఎలా వచ్చినది సమాధానం 'స్వరాట్.' ఆయన ఎవరి నుండి జ్ఞానం పొందలేదు. ఆయన తనకు తాను స్వయంగా, సంపూర్ణ, జ్ఞానము కలిగి ఉన్నాడు. ఇది భగవంతుని స్వభావం. ఎవరైనా ఉన్నత వ్యక్తుల నుండి జ్ఞానం పొందవలసిన అవసరము ఆయనకు లేదు, ఎవ్వరూ భగవంతుడు కంటే గొప్పవారు ఎవ్వరూ కాలేరు. భగవంతుడుతో సమానంగా లేరు. "Asamordhva". ఎవరూ ఆయనకు సమానముగా లేరు. ఎవరూ ఆయన కంటే ఎక్కువగా లేరు.

ఇప్పుడు ఈ విశ్వంలో ఉన్న వారిలో మొదటి జీవి, జీవి, బ్రహ్మ అని మనకు అవగాహన ఉంది. అందువల్ల ఆయన ఇతరుల నుండి ఎలాంటి సహాయం లేకుండా జ్ఞానాన్ని పొందాడు, ఎందుకంటే అక్కడ... ఆయన మొదటి జీవి. అందువల్ల ఏ ఇతర ప్రాణి లేదు, ఆయన ఎలా జ్ఞానం పొందాడు? అంటే ఈ వాస్తవ మూలం బ్రహ్మ అని అర్థమా? ప్రజలు ప్రశ్నించవచ్చు, కానీ భాగవతము చెప్తుంది కాదు అని చెప్పింది. ఆయన ఈ విశ్వం యొక్క మొదటి జీవి, అది సరైనది, కానీ ఆయన కూడా సృష్టించబడిన వ్యక్తి. ఎందుకంటే భగవంతుడు విశ్వమును సృష్టించాడు, మహోన్నతమైన వాడు. ఈ సృష్టి తరువాత బ్రహ్మ సృష్టించబడ్డాడు. అందువలన ఆయన సృష్టించబడిన జీవి. ఈ విశ్వము సృష్టించిన తర్వాత. ఎందుకంటే భగవంతుడు, ఆయన సృష్టికర్త, కాబట్టి ఆయన సృష్టించబడిన జీవులలో ఒకడు కాదు. ఆయన సృష్టిస్తాడు కానీ ఆయన సృష్టించబడలేదు. కానీ బ్రహ్మ సృష్టించబడినాడు. అందువలన స్వతంత్రుడు అయిన భగవంతుని నుండి ఆయన జ్ఞానాన్ని పొందాడు