TE/Prabhupada 1021 - పతిత బద్ధజీవుల గురించి ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారు అంటే, ఆయన వైష్ణవుడు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1020 - Le coeur est là pour l'amour, mais pourquoi est-ce que votre coeur est si dur?|1020|FR/Prabhupada 1022 - La première chose est que nous devons apprendre à aimer. Cela est la religion de première classe|1022}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1020 - హృదయం ప్రేమ కోసం ఉంది, కానీ ఎందుకు మీరు అంత కఠిన హృదయముతో ఉన్నారు|1020|TE/Prabhupada 1022 - మొదటి విషయము ఏమిటంటే మనము ప్రేమించడము నేర్చుకోవాలి, అది మొదటి-తరగతి ధర్మము|1022}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|oAsLKmzRBNc|పతిత బద్ధజీవుల గురించి ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారు అంటే, ఆయన వైష్ణవుడు  <br/>- Prabhupāda 1021}}
{{youtube_right|37cKMwq5nJw|పతిత బద్ధజీవుల గురించి ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారు అంటే, ఆయన వైష్ణవుడు  <br/>- Prabhupāda 1021}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



730408 - Lecture SB 01.14.44 - New York


పతిత బద్ధజీవుల గురించి ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారు అంటే, ఆయన వైష్ణవుడు కాబట్టి జీవులందరూ, ఈ భౌతిక పరిస్థితిలో పతితులైనందున, వారు బాధపడుతున్నారు. కాబట్టి వైష్ణవునికి సానుభూతి ఉంది. వాస్తవానికి పతితులైన బద్ధజీవుల మీద ఎవరైనా సానుభూతిని కలిగి ఉంటే, అతను ఒక వైష్ణవుడు. వారు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారో ఆయనకు తెలుసు అందువల్ల ఆయన వారికి సమాచారం ఇవ్వాలనుకుంటాడు: నా ప్రియమైన మిత్రుడా, మీ వాస్తవమైన ప్రేమికుని, కృష్ణుని మర్చిపోవడము వలన మీరు బాధపడుతున్నారు. కాబట్టి మీరు బాధపడుతున్నారు. ఈ సందేశము, వైష్ణవుని యొక్క సందేశం. ఈ సందేశం కోసం కృష్ణుడు స్వయంగా భగవంతునిగా వస్తాడు.

ఆయన కూడా చెప్తారు,

sarva-dharmān parityajya
mām ekaṁśaraṇaṁ
( BG 18.66)

మీ ప్రేమించే ప్రవృత్తి చాలా విషయాలలో పంపిణి చేయబడింది, కానీ మీరు సంతోషంగా లేరు, ఎందుకంటే... మీరు కృష్ణుని ప్రేమించకపోతే, మీరు ప్రేమ అని పిలవబడే పేరుతో ఏమి చేసినా, మీరు పాపములు చేస్తారు, అవిధేయత కలిగి ఉంటారు. ఉదాహరణకు, మీరు రాష్ట్ర చట్టంకి అవిధేయులైతే, మీ అన్ని కార్యక్రమాలు పాపములు అవుతాయి. మీరు దానికి రంగు వేయవచ్చు, "ఓ, ఇది చాలా మంచిది," కానీ అది, అది కాదు. ప్రకృతి, ఎందుకంటే మీరు కృష్ణుని యొక్క సేవకుడు కనుక, jīvera svarūpa haya nitya kṛṣṇa dāsa ( CC Madhya 20.108) మీ శాశ్వతమైన పరిస్థితి కృష్ణునికి సేవ చేయడం. కాబట్టి ఈ జ్ఞానము లేకుండా, మీరు ఏ సేవ చేసినా వేరేవారికి, మీరు పాపం చేస్తున్నారు. అదే ఉదాహరణ. మీరు రాష్ట్ర చట్టాలకు విధేయులుగా లేకపోతే, మీరు ఒక పరోపకారము చేసే వారు అయితే...

కాబట్టి నేను భారతదేశంలోనే చూశాను. భారతదేశంలో, స్వతంత్ర ఉద్యమం ఉన్నప్పుడు - భారతదేశంలో మాత్రమే కాదు, ప్రతి దేశంలోనూ స్వాతంత్ర్యోద్యమంలో, చాలామందిని ఉరితీశారు, మరణ శిక్ష విధించారు. కానీ మీరు మీ దేశం యొక్క గొప్ప ప్రేమికులు. కానీ ఆయన దేశం మీద ఉన్న తన తీవ్రమైన పేమ కారణంగా, ఆయన ఉరి తీయబడ్డాడు, ఎందుకంటే చట్టం... ఆయన ప్రభుత్వ చట్టం తిరస్కరించాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధముగా, మనము మహోన్నతమైన ప్రభుత్వ చట్టాలను అంగీకరించకపోతే, దానిని ధర్మ అని పిలుస్తారు. ధర్మ అంటే మహోన్నతమైన ప్రభుత్వ చట్టం. Dharmaṁ tu sākṣād bhagavat-praṇītam ( SB 6.3.19) ధర్మ అర్థం... ఆ ధర్మము ఏమిటి? కృష్ణుడు చెప్తాడు, ఇది చాలా సరళమైన విషయము,sarva-dharmān parityajya mām ekaṁ. వాస్తవిక ధర్మము కృష్ణునికి లేదా భగవంతునికి శరణాగతి పొందడము. అది వాస్తవమైన ధర్మము. ఈ విషయమును అంగీకరించపోతే అన్ని ధర్మములు, వారు కేవలం మోసం చేస్తున్నారు. Dharmaḥ projjhita-kaitavo 'tra ( SB 1.1.2) శ్రీమద్-భాగవతం ప్రారంభమవుతుంది. మోసము చేసే ధర్మము. భగవంతుని ప్రేమ లేనట్లయితే, అది కాదు... కేవలం కొన్ని సంప్రదాయక సూత్రం. ఇది ధర్మము కాదు. ఉదాహరణకు హిందువులు దేవాలయానికి వెళ్తారు, సంప్రదాయ సూత్రంగా, లేదా ముస్లిమ్ లు మసీదుకు వెళ్లినా లేదా క్రైస్తవులు చర్చికి వెళ్లినా. కానీ వారికి భగవంతుని పట్ల ఎటువంటి ప్రేమ లేదు. కేవలము ప్రామాణికము మాత్రమే. ఎందుకంటే వారు కొన్ని మతపరమైన ముద్రతో తమను తాము ముద్రించుకోవలసి ఉంటుంది: నేను హిందూ మతానికి చెందినవాడిని, "నేను క్రిస్టియన్ మతానికి చెందినవాడిని." అది పోరాటానికి మాత్రమే ఎందుకంటే, అక్కడ ప్రేమ లేదు ఒకవేళ మీరు... మీరు మతసంబంధంగా ఉన్నట్లయితే, అప్పుడు మీరు భగవంతుని పట్ల అవగాహన కలిగి ఉండాలి. మీరు భగవంతుని పట్ల చైతన్యవంతులుగా ఉంటే, నేను భగవంతుని చైతన్యం కలిగి ఉంటే, పోరాటానికి కారణం ఎక్కడ ఉంది? అందువల్ల వారు మరచి పోయిన విషయము ఏమిటంటే ; అటువంటి ధర్మము, ధర్మము మోసం చేస్తోంది, ఎందుకంటే ప్రేమ లేదు.