TE/Prabhupada 1023 - భగవంతుడు సర్వశక్తిమంతుడైతే,ఆయన శక్తిని ఎందుకు తగ్గిస్తున్నారు

Revision as of 11:44, 27 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 1023 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730408 - Lecture SB 01.14.44 - New York


భగవంతుడు సర్వశక్తిమంతుడైతే, ఆయన శక్తిని ఎందుకు తగ్గిస్తున్నారు? ఆయన రాలేడు అని భగవంతునికి రక్షణ ఇవ్వడము మరియు రాక్షసులను చంపడము భగవంతుని యొక్క రెండు కర్తవ్యములు. కాబట్టి రాక్షసులును చంపడానికి, అయనకు రావలసిన అవసరము లేదు. ఆయన అపారమైన శక్తిని కలిగి ఉన్నాడు. కేవలము ఆయన సూచన ద్వారా, ఏ వ్యక్తిని అయినా చంప వచ్చు. తగినంత శక్తి ఉంది. దుర్గాదేవి కానీ ఆయన తన భక్తుని కోసం వస్తాడు, ఆయన భక్తుడు, ఆయన చాలా ఆత్రుతగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ భగవంతుని యొక్క రక్షణ కోరుకుంటాడు. అందువల్ల భక్తుడు ఆయనను చూడటం ద్వారా సంతృప్తి చెందుతాడు కనుక, ఆయన వస్తాడు. అది ఆయన రావడానికి..... భక్తులు ఎల్లప్పుడూ విరహ భావన కలిగి ఉండడము వలన, ఆయనకి ఉపశమనం ఇవ్వడానికి, భగవంతుని అవతారం వస్తుంది. Pralaya-payodhi jale dhṛtavān asi vedam (Śrī Daśāvatāra Stotra 1). వేర్వేరు అవతారాలు కేవలము భక్తులకు ఉపశమనం ఇవ్వడానికి వస్తాయి. లేకపోతే ఆయనకి రావలసిన పనే లేదు. భారతదేశంలో, హిందువుల తరగతి ఉంది, వారు అలా పిలుస్తారు, కానీ వాస్తవానికి వారు ఆర్య-సమాజ్ అని పిలవాలి. ఆర్య-సమాజ్. ఆర్య-సమాజ్ అభిప్రాయం, "భగవంతుడు ఎందుకు రావాలి? ఆయన చాలా గొప్పవాడు; ఎందుకు ఆయన ఇక్కడికి రావాలి? "అవతారమును, వారు నమ్మరు. ముస్లింలు కూడా, వారికి అవతారాల మీద వారికి నమ్మకం లేదు. వారు కూడా అదే విషయమును నొక్కి చెప్తారు, "భగవంతుడు ఎందుకు రావాలి, ఆయన ఎందుకు మనిషిలా అవతరించాలి?" కానీ వారికి తెలియదు, వారు ఈ ప్రశ్నకు సమాధానము ఇవ్వలేరు "ఎందుకు భగవంతుడు రాకూడదు?" వారు భగవంతుడు రాలేరని వారు చెప్తారు. కానీ నేను ప్రశ్న వేస్తే: "ఎందుకు భగవంతుడు రాకూడదు?"; జవాబు ఏమిటి? భగవంతుడు సర్వశక్తిమంతుడైతే, ఆయన రాకూడదు అని ఆయన శక్తిని ఎందుకు తగ్గిస్తున్నారు? ఆయన ఏ విధమైన భగవంతుడు? భగవంతుడు మీ చట్టము క్రింద ఉన్నాడా, లేదా మీరు భగవంతుని చట్టము క్రింద ఉన్నారా?

కాబట్టి, ఇది భగవంతుని ప్రేమించే భక్తుడు మరియు రాక్షసుల మధ్య తేడా. రాక్షసులు ఆలోచించలేరు. వారు "ఎవరో ఒక భగవంతుడు ఉండవచ్చు, ఆయన తప్పకుండా దురముగా ఉంటాడు, నిరాకారము" అని వారు నమ్ముతారు. ఆయన ఈ రూపము మీద అనుభవం కలిగి ఉన్నాడు కనుక: పరిమితమైనది. అందుచేత మాయావాది తత్వవేత్త చెప్తాడు భగవంతుడు వచ్చినప్పుడు, నిరాకారము - ఆయన మాయా రూపాన్ని తీసుకుంటాడు. అది మాయావాద అని పిలువబడుతుంది. వారు నిజానికి భగవంతుని నమ్మరు. Impersonalism, śūnyavāda. Nirviśeṣa-śūnyavādi. వారిలో కొందరు నిర్విశేష : "అవును, భగవంతుడు ఉండవచ్చు, కానీ ఆయనకి రూపం లేదు." మాయావాదా... వీరిద్దరూ మాయావాదులు, శూన్య వాదులు బౌద్ధులు మరియు శంకరాచార్య అనుచరులు , వారు నమ్మరు. కానీ మనము, వైష్ణవులము, నాస్తికులు ఎలా మోసగించబడతారో మనకు తెలుసు. Sammohāya sura-dviṣām ( SB 1.3.24) భగవంతుడు బుద్ధుడు నాస్తికులను మోసం చేయడానికి వచ్చారు. నాస్తికులు భగవంతుని నమ్మరు, కాబట్టి భగవంతుడు బుద్ధుడు చెప్పాడు, "అవును, నీవు సత్యము చెప్తున్నావు. భగవంతుడు లేడు. కానీ మీరు నా నుండి శ్రవణము చేయడానికి ప్రయత్నించండి. " కానీ ఆయన భగవంతుడు. కాబట్టి ఇది మోసం చేయడము అంటే. మీరు భగవంతుని నమ్మ వద్దు, కానీ నన్ను నమ్మండి. అవును, అయ్యా, నేను నమ్ముతాను. ఆయన భగవంతుడు అని మనకు తెలుసు. (నవ్వు) Keśava dhṛta-buddha-śarīra jaya jagadīśa hare (Gītā Govinda, Śrī Daśāvatāra Stotra 9). కేవలము చూడండి (గజిబిజిగా)