TE/Prabhupada 1028 - ఈ రాజకీయ నాయకులు అందరు, వారు పరిస్థితిని నాశనము చేస్తున్నారు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1027 - Ma femme, mes enfants et ma société sont mes soldats. Si je suis en danger, ils m'aideront|1027|FR/Prabhupada 1029 - Notre religion ne dit pas ascétisme. Notre religion enseigne à aimer Dieu|1029}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1027 - నా భార్య, పిల్లలు సమాజం నా సైనికులు. నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేస్తారు|1027|TE/Prabhupada 1029 - మా ధర్మము అన్నిటిని త్యజించమని భోదించదు. మా ధర్మము భగవంతుని ప్రేమించమని నేర్పుతుంది|1029}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|hOBMO-BHbgk|ఈ రాజకీయ నాయకులు అందరు, వారు పరిస్థితిని నాశనము చేస్తున్నారు  <br/>- Prabhupāda 1028}}
{{youtube_right|ZdPjxT6yT8A|ఈ రాజకీయ నాయకులు అందరు, వారు పరిస్థితిని నాశనము చేస్తున్నారు  <br/>- Prabhupāda 1028}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 00:01, 2 October 2020



731129 - Lecture SB 01.15.01 - New York


ఈ రాజకీయ నాయకులు అందరు, వారు పరిస్థితిని నాశనము చేస్తున్నారు ప్రభుపాద: ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా ఉన్నారని ఆలోచిస్తున్నారు, కానీ ఆయన ఆధారపడి ఉన్నాడు. కానీ ఆయన తప్పుడు అవగాహన మీద ఆధారపడి ఉన్నాడు. ఇది భౌతిక నాగరికత యొక్క పొరపాటు. వారు ఒక పతనమవుతున్న వేదిక నుండి, భౌతిక ప్రపంచం యొక్క రక్షణ గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి మనము కృష్ణుడి ఆశ్రయం తీసుకోవాలి. కృష్ణుడు మన అందరితో చాలా స్నేహముగా ఉన్నాడు. అందువల్ల ఆయన ఈ విషయాన్ని తెలియజేయడానికి వైకుంఠము నుండి వస్తారు; అది భగవద్గీత. ఇది శ్రీమద్-భాగవతములో విపులముగా వివరించబడింది. ఇది మాత్రమే విషయము. కావున సంక్షోభం, ప్రజలు చాలా సంక్షోభాలు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది నేను విమానాశ్రయంలో చెప్పాను. విలేకరి నన్ను అడిగారు "ఈ రాబోతున్న సంక్షోభమునకు పరిష్కారం ఏమిటి?" పరిష్కారం కృష్ణ చైతన్యము, ఇది ఇప్పటికే ఉంది, కానీ మీరు మూర్ఖులు, మీరు దానిని తీసుకోరు. పరిష్కారం ఇప్పటికే ఉంది. అరబ్బులు ఈ చమురు కృష్ణుడి ఆస్తి అని అనుకుంటే ఇతరులు, కొనుగోలుదారులు, వారు కూడా భావిస్తే కృష్ణుడి యొక్క ఆస్తి అని, అప్పుడు వారు కూడా అంగీకరించాలి. అమెరికా కూడా ఈ భూమి కృష్ణుడి ఆస్తి అని అమెరికా అంగీకరించాలి. అరేబియా చమురు కృష్ణుడి ఆస్తి, భగవంతుడు ఆస్తి అని మీరు అనుకుంటే, మనము దాన్ని తీసుకోవాలి, బలవంతంగా. అరేబియా దేశస్థులు ఎడారి నుంచి వచ్చి ఎందుకు అమెరికాలో నివసించకూడదు? కానీ వారు అవివేకులు, వారు రారు, వారికి ఐక్య రాజ్య సమితి ఉంది. కానీ ఐక్యరాజ్యసమితి అంటే కేవలం పొరపాటు చేయడము, పొరపాటు, పొరపాటు, తప్పు, తప్పు. అంతే. అది వారి కర్తవ్యము. ఎందుకు మీరు ఎందుకు ఏకం చేయలేరు? అవును, ఈ అరేబియా చమురు కృష్ణుడి ఆస్తి. అదే విధముగా ఆస్ట్రేలియా భూమి, లేదా ఆఫ్రికన్ భూమి, లేదా ఈ అమెరికన్ భూమి, చాలా విస్తృత భూభాగం, కానీ "లేదు, మీరు ఇక్కడకు రాలేరు. యౌ యౌ వారు చెపుతారు ఇమ్మిగ్రేషన్ శాఖ. మీరు చూడండి. 'యౌ యౌ డిపార్ట్మెంట్'.

ఈ అర్థంలేని, ఈ మూర్ఖులకు, ఈ రాజకీయ నాయకులు, వారు పరిస్థితిని నాశనము చేస్తున్నారు, కానీ వారు ఎంత గొప్ప మూర్ఖులు అంటే , వారు పరిష్కారం అంగీకరించరు. కృష్ణ చైతన్యముని తీసుకోండి, ప్రతిదీ పరిష్కరించబడుతుంది. అది సత్యము. మూర్ఖుడు, కానీ వారు మూర్ఖులు, duṣkṛtina , పూర్తిగా పాపములతో ఉన్నారు . Na māṁ duṣkṛtina mūḍhāḥ prapadyante narādhamāḥ, మానవజాతిలో అధములు. కాబట్టి మనము ప్రచారపు పనిలో ఈ రకమైన మనుషులతో వ్యవహరించాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. Duṣkṛtina అంటే పూర్తిగా పాప కార్యములతో . Mūḍhā, మూర్ఖులు, narādhamāḥ, మానవజాతిలో అధములు māyayāpahṛta-jñānā, వారు విద్యలో చాలా ఉన్నత స్థానములో ఉన్నారని ఆలోచిస్తూన్నారు, కానీ అవివేకులలో మొదటి వారు: మాయ వారి వాస్తవమైన జ్ఞానమును తీసివేసింది , māyayāpahṛta-jñānā. Āsuri bhāvam āśritāḥ. ఎందుకు ఈ విషయాలు? వారు భగవంతుని నమ్మరు, భగవంతుని నమ్మకపోవటము మాత్రమే తప్పు. Āsuri Bhāvam āśritāḥ. ఎందుకంటే వారు ఈ స్థానాన్ని తీసుకున్నారు, "భగవంతుడు లేడు". ఈ గొప్ప, గొప్ప శాస్త్రవేత్తలు, వారు భగవంతుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు, ఈ సృష్టి రసాయనము వలన పదార్థము వలన ఉంది నీరు రసాయనిక కలయిక, హైడ్రోజన్, ఆక్సిజన్ నుండి వచ్చింది. ఇవి ... "అన్నీ వెర్రి సిద్ధాంతాలు, వారు నోబెల్ బహుమతి అందుకుంటున్నారు.వారు నోబెల్ బహుమతి పొందుతున్నారు. ఇది పరిస్థితి.

అందువలన, ఈ శ్లోకము నుండి, మీరు తెలుసుకోవాలి ... Evaṁ kṛṣṇa-sakhaḥ kṛṣṇo bhrātrā rājñā vikalpitaḥ, nānā-śaṅkā... ఈ మూర్ఖులు... మా, మన సోదరుడు చెప్తున్నాడు, ఉన్నత స్థానము, వారు సూచిస్తున్నారు, "దీనికి కారణం," ఇది కారణం, "ఇది కారణం," "ఇది కారణం." కానీ కృష్ణుడిని మర్చిపోవడము మాత్రమే కారణం, అది వారికి తెలియదు. ఒకే కారణం.

kṛṣṇa bhuliya jīva bhoga vāñchā kare,
pāśate māyā tāre jāpaṭiyā...

ఇది కారణము. కాబట్టి ఈ ధర్మమును ప్రచారము చేయడానికి ప్రయత్నించండి. కానీ ప్రతి ఒక్కరూ అంగీకరించరు, కానీ కొంత శాతం అయినా కూడా, మొత్తం జనాభాలో ఒక శాతం అంగీకరించాలి. ఉదాహరణకు ఆకాశంలో వలె, ఒక చంద్రుడు మాత్రమే ఉన్నాడు, లక్షలాది నక్షత్రాలు ఉన్నాయి. అవి నిష్ఫలమైనవి. లక్షల నక్షత్రాలు ఉండటము వలన విలువ ఏమిటి? కానీ ఒక చంద్రుడు, రాత్రి మొత్తం చీకటిని పారద్రోలుతాడు. అదేవిధముగా, కృష్ణ చైతన్యమును తీసుకున్నవారిలో కనీసం మీరు అవ్వండి, మీలో ప్రతి ఒక్కరు చంద్రుడిగా మారండి మరియు ప్రపంచానికి జ్ఞానమును ఇవ్వండి. ఈ మిణుగురు-పురుగులు, వారు ఏమీ చేయలేరు. అది సత్యము. ఒక మిణుగురు-పురుగుగా ఉండకండి. కేవలము ఒక సూర్యుడు మరియు చంద్రుడు అవ్వండి. అప్పుడు మీరు ... ప్రజలు సంతోషంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ ప్రభుపాద!