TE/Prabhupada 1040 - మన మానవ జీవితం యొక్క లక్ష్యము ప్రపంచవ్యాప్తంగా వైఫల్యం చెందుతోంది: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1039 - La vache est une mère parce que nous buvons du lait de vache. Comment puis-je nier qu'elle n'est pas une mère?|1039|FR/Prabhupada 1041 - Simplement par un traitement symptomatique vous ne pouvez pas guérir l'homme|1041}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1039 - ఆవు మన తల్లి ఎందుకంటే మనము ఆవు పాలను త్రాగుతాము. ఆమె తల్లికాదని ఎలా తిరస్కరించగలను|1039|TE/Prabhupada 1041 - కేవలము లక్షణములకు మాత్రమే చికిత్స ఇవ్వడము ద్వారా మీరు మానవుణ్ణి ఆరోగ్యంగా చేయలేరు|1041}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|RCR61nvCCow|మన మానవ జీవితం యొక్క లక్ష్యము ప్రపంచవ్యాప్తంగా వైఫల్యం చెందుతోంది  <br/>- Prabhupāda 1040}}
{{youtube_right|8boC7Enn6LU|మన మానవ జీవితం యొక్క లక్ష్యము ప్రపంచవ్యాప్తంగా వైఫల్యం చెందుతోంది  <br/>- Prabhupāda 1040}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 00:01, 2 October 2020



751001 - Arrival Reception - Mauritius


మన మానవ జీవితం యొక్క లక్ష్యము ప్రపంచవ్యాప్తంగా వైఫల్యం చెందుతోంది

భారతీయ అధికారి:...మా మధ్యలో మీరు ఉన్నందుకు మేము ఎంతో సంతోషముగా ఉన్నాము. మారిషస్ ప్రజల తరపున ఈ ద్వీపానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, మీరు ఇక్కడ ఉండే సమయమును మీరు ఆనందిస్తారని ఆశిస్తున్నాము. స్వామిజీ, ఎంతకాలం ఇక్కడ మీరు ఉంటున్నారు?

ప్రభుపాద: కార్యక్రమము ఒక వారం.

భారత అధికారి: ఒక వారం. మీరు ఏమైనా ప్రత్యేక కార్యక్రమముతో వచ్చారా? మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారా లేక...

ప్రభుపాద: వారు ఏమి ఏర్పాటు చేసారో నాకు తెలియదు, కానీ నా కార్యదర్శి అది ఒక వారం అని చెబుతుంది.

భారతీయ అధికారి: మీరు ఇక్కడకు రావడానికి ముందు మీకు మారిషస్ గురించి ఏమైనా తెలుసా? మీకు మారిషస్ గురించి ఏదైనా తెలుసా..

ప్రభుపాద: (నవ్వుతూ) కృష్ణ చైతన్యమును ప్రచారము చేయడమే నా ఉద్దేశ్యం. ఈ జ్ఞానం కోసమే, మానవ జీవితం యొక్క మన లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా విఫలమవుతోంది. అందువల్ల ప్రపంచం వ్యాప్తముగా ఈ కృష్ణ చైతన్యముని ప్రవేశ పెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను, కులం, ధర్మము, రంగు ఏ తేడా లేకుండా. భగవంతుడు ప్రతి ఒక్కరి కోసమూ ఉన్నాడు, మనము భగవంతునితో మన సంబంధం మర్చిపోయాము. అందువలన, మీరు చాలా విధాలుగా బాధపడుతున్నారు. ఆయన ఉపదేశము భగవద్గీతలో ఉంది. మనము అనుసరిస్తే, మనము సంతోషముగా ఉంటాము. మన జీవితం విజయవంతమవుతుంది. ఇది మన లక్ష్యం.

భారతీయ అధికారి: సరే, క్లుప్తంగా మీరు మీ సందర్శన యొక్క ఉద్దేశ్యాన్ని వివరించారు.

ప్రభుపాద: అవును.

భారతీయ అధికారి:, అయితే మీకు తెలిసినట్లుగా, మనము కలిగి... ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం అని మనకు తెలుసు, చాలా కాలము తరువాత ఇది మారిషస్ చేరుకున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాము ఈ ఉద్యమమునకు మీ దీవెనలతో ఇక్కడ అవకాశము ఉంటుందని మేము ఆశిస్తున్నాము.

ప్రభుపాద: మీరు నాకు అవకాశం ఇస్తే, నేను మీకు వివరిస్తాను, ఈ ఉద్యమం ఎంత ముఖ్యమైనది మరియు ప్రతి ఒక్కరూ ఎలా తీసుకోవాలి. ఇది చాలా సులభం అయినప్పటికీ, కాని ప్రజలు శిక్షణ పొందలేదు. కాబట్టి మనము కలిసి ప్రయత్నిద్దాము. ప్రజలు దాన్ని తీసుకొవచ్చు మరియు ఆనందంగా ఉంటారు.

భారతీయ అధికారి: కావున చాలా ధన్యవాదాలు, స్వామి, మీరు విజయము సాధిస్తారు అని ఆశిస్తున్నాము మీరు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న దీర్ఘకాలికమైన కఠినమైన పని ద్వారా. మేము ఆశిస్తున్నాము మీరు ...

ప్రభుపాద: నేను ఈ దేశములో ప్రధానమైన నాయకులను చూడాలనుకుంటున్నాను.

భారతీయ అధికారి: అవును.తప్పకుండా.

ప్రభుపాద: ఎందుకంటే వారు ఈ ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే, నా లక్ష్యం విజయవంతమవుతుంది.

భారతీయ అధికారి: మనము వారిని చూసే అవకాశం ఉంటుంది.

ప్రభుపాద: అవును.Yad yad ācarati śreṣṭhaḥ tat tad evetaro janaḥ ( BG 3.21) భగవద్గీతలో ఇలా చెప్పబడింది: నాయకులు, వారు చేస్తున్నది, సామాన్యమైన, సామాన్య మానవులు అనుసరిస్తారు.

భారతీయ అధికారి: అనుసరిస్తారు (అస్పష్టముగా ఉంది). అది మంచిది, అవును.

ప్రభుపాద: కాబట్టి ఈ ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకుంటే, మారిషస్ నాయకులు, నేను ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని ఖచ్చితముగా చెప్తాను.

భారతయ అధికారి: ప్రతిఒక్కరికీ. అవును. స్వామీజీ మారిషస్ ప్రజలు, మా స్నేహితులు మరియు NBC టివి అందరి తరపున చాలా ధన్యవాదాలు, వారు చాలా దయ కలిగి ఉన్నారు. ఇక్కడ మీరు వారి చైర్మన్ ను కలిగి ఉన్నారు. మేము మీకు చాలా రుణపడి ఉన్నాము.

ప్రభుపాద: ధన్యవాదాలు.