TE/Prabhupada 1056 - కృష్ణ చైతన్య ఉద్యమం ఆధ్యాత్మిక స్థితి మీద ఉంది శరీరము, మనస్సు, బుద్ధి మీద

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750522 - Conversation B - Melbourne


కృష్ణ చైతన్య ఉద్యమం ఆధ్యాత్మిక స్థితి మీద ఉంది శరీరము, మనస్సు, బుద్ధి మీద

ప్రభుపాద: భారతదేశములో ఇప్పటికీ, ఒకరికి మంచి తోట, పువ్వులు ఉంటే, ఎవరైనా వెళ్ళితే అయ్యా, నేను భగవంతుని పూజించేందుకు మీ తోట నుండి కొన్ని పువ్వులను తీసుకోవాలనుకుంటున్నాను, అవును, మీరు తీసుకోవచ్చు. వారు చాలా ఆనందంగా ఉంటారు.

రేమండ్ లోపెజ్: ఈ మనిషి, ఆయన జీవనోపాధి ఆ పువ్వులపై ఆధారపడింది, నేను పట్టించుకోను... దురదృష్టవశాత్తూ ఆయన ఆస్తులు ఆయనకు మరింత ముఖ్యమైనవి అని నేను భావిస్తున్నాను.

వాలీ స్ట్రోబ్స్: ఇది ఒక హాస్యమైన కథ. దాని తరువాత మరింత హాస్యము ఉంది ఆ నర్సరీలను నడిపే ఇద్దరు మనుష్యుల నుండి పువ్వులు తీసుకున్నారు. మేము ఇంటికి రావడానికి న్యాయవాది దగ్గరకు వెళ్ళ వలసి వచ్చినది కానీ అప్పీల్ వచ్చే ముందు, అబ్బాయిలకు ఒక అద్దాల గది అవసరము అయినది ఎందుకంటే వారివి ప్రత్యేక మొక్కలు, మీరు ఇక్కడ వెలుపల చూస్తారు

శృతికారి: తులసి.

వాలీ స్ట్రోబ్స్: వారికి అద్దాల గది గురించి ఏమీ తెలియదు. కాబట్టి వారు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఒకరు అన్నారు, "సరే, మనము వెళ్ళి కొంత తెలుసుకుందాము అద్దాల గది గురించి. ఒక చక్కని నర్సరీ ఉంది. "(నవ్వు) కాబట్టి కారులో అక్కడికి వచ్చారు, మీరు చూడండి. భక్తుడు బయటికి వచ్చి, ఆయన చెప్పాడు క్షమించండి, అయ్యా , కానీ మేము అద్దాల గది గురించి ఆసక్తి కలిగి ఉన్నాము. ఆయన చెప్పాడు, "మీరు నా ప్రదేశము నుండి బయటకు వెళ్తారా ?" అదే నర్సరీ. (నవ్వు) ఈ ప్రాంతం చుట్టూ రెండు వందల నర్సరీలు ఉన్నాయి. ఆయన ప్రత్యేకముగా దాన్ని ఎంచుకున్నాడు.

ప్రభుపాద: ప్రజలు భగవంతుని చైతన్యమును కలిగిన వారైతే, వారు క్షమించేవారు, ఓ, వారు భగవంతుని సేవ కోసం వచ్చారు. సరే, మీరు తీసుకోవచ్చు. అందువల్ల మొదటి కర్తవ్యము ప్రజలను భగవంతుని చైతన్యవంతులుగా చేయడము. అప్పుడు ప్రతిదీ సర్దుబాటు చేయబడుతుంది. Yasyāsti bhaktiḥ... భాగవతములో ఒక మంచి శ్లోకము ఉంది:

yasyāsti bhaktir bhagavaty akiñcanā
sarvair guṇais tatra samāsate surāḥ
harāv abhaktasya kuto mahad-guṇā
manorathenāsati dhāvato bahiḥ
(SB 5.18.12)

అర్థం ఏమిటంటే, "భగవంతుని చైతన్యమును కలిగిన వారు ఎవరైనా, ఒక భక్తుడు, ఆయన అన్ని మంచి లక్షణాలను కలిగి ఉంటాడు." మనం మంచి లక్షణాలుగా పరిగణించేవి ఆయన కలిగి ఉంటాడు. అదేవిధముగా, భగవంతుని భక్తుడు కానీ వ్యక్తికి, ఆయన మంచి లక్షణాలు కలిగి ఉండడు, ఎందుకంటే ఆయన మానసిక స్థితిపై ఉంటాడు. ఇవి వివిధ వేదికలు శరీర భావన, సాధారణంగా, "నేను ఈ శరీరమును. అందుచే నా కర్తవ్యము ఇంద్రియాలను సంతృప్తి పరచుట. "ఇది శరీర భావం. ఇతరులు, "వారు ఆలోచిస్తున్నారు నేను ఈ శరీరం కాదు, నేను మనస్సును కలిగి ఉన్నాను." కాబట్టి వారు తత్వవేత్తలు, తెలివి కలిగిన వ్యక్తులు వలె మానసిక కల్పన చేస్తున్నారు. దాని పైన, కొందరు తెలివైన వ్యక్తులు ఉన్నారు, యోగ సాధన చేస్తున్న వారు. ఆధ్యాత్మిక స్థితి అంటే దాని పైన అని అర్థం. మొదట శరీర భావన, స్థూల, తరువాత మానసిక, తరువాత బుద్ధి, తరువాత ఆధ్యాత్మిక.

కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఆధ్యాత్మిక స్థితి మీద ఉంది, శరీరం, మనస్సు మరియు బుద్ధి పైన. కానీ వాస్తవానికి, మనము ఆ స్థితికి రావాలి, ఎందుకంటే మనము ఆత్మలము, మనము ఈ శరీరం లేదా ఈ మనస్సు లేదా ఈ బుద్ధి కాదు. ఆధ్యాత్మిక చైతన్యపు స్థితిపై ఉన్నవారు, వారు అన్నింటినీ కలిగి ఉన్నారు- బుద్ధి, మనస్సును సరిగ్గా ఉపయోగించడము, శరీరం యొక్క సరైన ఉపయోగం. కేవలం ఒక లక్షాధికారి వలె, ఆయన అన్ని తక్కువ తరగతి వాటిని కలిగి ఉన్నాడు. పది రూపాయలు లేదా వంద రూపాయలు లేదా వంద పౌండ్లు - ఆయన అన్నింటినీ కలిగి ఉన్నాడు. అదేవిధముగా, మనము భగవంతుని చైతన్యము స్థితిపైకి ప్రజలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే, అప్పుడు ఆయన అన్ని ఇతర లక్షణాలు కలిగి ఉంటాడు: శరీరము మీద ఎలా శ్రద్ధ వహించాలి అని, మనస్సును ఎలా ఉపయోగించాలి, బుద్ధిని ఎలా ఉపయోగించాలి, ప్రతిదీ. కానీ ప్రతి ఒక్కరూ భగవంతుని చైతన్య వంతులు అవ్వడము సాధ్యం కాదు. ఇది సాధ్యం కాదు ఎందుకంటే వివిధ తరగతులు ఉన్నారు. కానీ కనీసం ఒక తరగతి వ్యక్తులు సమాజంలో ఆదర్శంగా, భగవంతుని చైతన్యమును కలిగిన వారిగా ఉండాలి. ఉదాహరణకు మన సాధారణ జీవితం కోసం మనకు న్యాయవాదులు అవసరం, మనకు ఇంజనీర్ లు అవసరం, మనకు వైద్యము సాధన చేసే వారు అవసరం, మనకు చాలా మంది అవసరం; అదేవిధముగా, సమాజంలో పూర్తిగా భగవంతుని చైతన్యమును మరియు ఆదర్శంగా ఉన్న వ్యక్తుల తరగతి ఉండాలి. అది అవసరము