TE/Prabhupada 1057 - భగవత్-గీత గీతోపనిషత్తు అని కూడా పిలువబడుతోంది, అంటే వేదజ్ఞానం యొక్క సారాంశం అని



660219-20 - Lecture BG Introduction - New York

భగవద్గీత గీతోపనిషత్తు అని కూడా పిలువబడుతోంది, అంటే వేదజ్ఞానం యొక్క సారాంశం అని.

ప్రభుపాద:

oṁ ajñāna-timirāndhasya
jñānāñjana-śalākayā
cakṣur unmīlitaṁ yena
tasmai śrī-gurave namaḥ

అజ్ఞానాంధకారంతో మూసుకుపోయిన నా కళ్ళను తెరచిన నా ఆధ్యాత్మిక గురువునకు నేను నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను

śrī-caitanya-mano-'bhīṣṭaṁ
sthāpitaṁ yena bhū-tale
svayaṁ rūpaḥ kadā mahyaṁ
dadāti sva-padāntikam

చైతన్య మహా ప్రభు యొక్క కోరికను ఈ భౌతిక జగత్తునందు స్థాపించిన శ్రీల రూప గోస్వామి ప్రభుపాద తన పాదపద్మముల చెంత నాకు ఆశ్రయం ఎప్పుడు ఇస్తాడు?

vande 'haṁ śrī-guroḥ śrī-yuta-pada-kamalaṁ śrī-gurūn vaiṣṇavāṁś ca
śrī-rūpaṁ sāgrajātaṁ saha-gaṇa-raghunāthānvitaṁ taṁ sa-jīvam
sādvaitaṁ sāvadhūtaṁ parijana-sahitaṁ kṛṣṇa-caitanya-devaṁ
śrī-rādhā-kṛṣṇa-pādān saha-gaṇa-lalitā-śrī-viśākhānvitāṁś ca

నేను నా ఆధ్యాత్మిక గురువుగారి పాదాలకు, భక్తి మార్గంలో ఉన్న అందరి పాదాలకు నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. నేను సమస్త వైష్ణవులకు, ఆరుగురు గోస్వాములయిన శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, రఘునాథ దాస్ గోస్వామి జీవ గోస్వామి, మరియు వారి సహచరులకు నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. నేను శ్రీ అద్వైత ఆచార్య ప్రభునకు, శ్రీ నిత్యానంద ప్రభునకు, శ్రీ చైతన్య మహా ప్రభునకు మరియు శ్రీనివాస్ ఠాకూర్ నేతృత్వంలోని అతని భక్తులందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇప్పుడు నేను శ్రీ కృష్ణుని పాదపద్మములకు, శ్రీమతి రాధారాణికి లలిత మరియు విశాఖ నేత్రుత్వంలోని గోపికలందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను.


he kṛṣṇa karuṇā-sindho
dīna-bandho jagat-pate
gopeśa gopikā-kānta
rādhā-kānta namo 'stu te

ఓ ప్రియమయిన శ్రీ కృష్ణ, కరుణాసాగరా, నీవే ఆపదల్లో ఉన్నవారి స్నేహితుడవు మరియు ఈ సృష్టికి మూలం. సమస్త గోపగణానికి ప్రభువు నీవు, సమస్త గోపికలకు ముఖ్యంగా శ్రీమతి రాధారాణికి ప్రాణప్రదం నీవు. నీకు నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను.

tapta-kāñcana-gaurāṅgi
rādhe vṛndāvaneśvari
vṛṣabhānu-sute devi
praṇamāmi hari-priye

కరిగించిన బంగారపు శరీర ఛాయతో, బృందావనానికి రాణి అయిన శ్రీమతి రాధారాణికి, నేను నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను.నీవు వృషభాను యొక్క కూతురవు మరియు శ్రీ కృష్ణునికి ఎంతో ప్రీతికరం.

vāñchā-kalpatarubhyaś ca
kṛpā-sindhubhya eva ca
patitānāṁ pāvanebhyo
vaiṣṇavebhyo namo namaḥ

నేను వైష్ణవ భక్తులందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. కల్ప వృక్షములలాగా వారు అందరి కోరికలను తీర్చగలరు. వారు పతీత జీవాత్మల పట్ల అత్యంత దయ కలిగి ఉంటారు.

śrī-kṛṣṇa-caitanya
prabhu-nityānanda
śrī-advaita gadādhara
śrīvāsādi-gaura-bhakta-vṛnda

నేను శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభువుకు, నిత్యానంద ప్రభువుకు, శ్రీ అద్వైత, గదాధర, శ్రీవాస. మొదలగు చైతన్య మహా ప్రభువు భక్తులందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను.

hare kṛṣṇa hare kṛṣṇa kṛṣṇa kṛṣṇa hare hare
hare rāma hare rāma rāma rāma hare hare

నా ప్రియమైన ప్రభువా, మరియు ప్రభువు యొక్క ఆధ్యాత్మిక శక్తీ, దయచేసి మీ సేవలో నన్ను నియమించండి. నేను ఈ భౌతిక సేవతో విసిగిపోయాను. దయచేసి మీ సేవలో నన్ను నియమించండి.

గీతోపనిషత్తుకు పరిచయము, ఎ. సి భక్తివేదాంత స్వామి ద్వారా, శ్రీమద్-భాగవతము, ఇతర గ్రహాలకు సులభ మార్గం వంటి గ్రంథముల రచయిత భగవద్దర్శన్ యొక్క సంపాదకుడు, మొదలగునవి చేసినవారు.

భగవద్గీత గీతోపనిషత్తు అని కూడా పిలువబడుతోంది, అంటే వేదజ్ఞానం యొక్క సారాంశం అని, మరియు వివిధ వేద గ్రంథములలోని ఉపనిషత్తులన్నింటిలోకి ఎంతో ముఖ్యమైనది. ఈ భగవద్గీతకు ఆంగ్లములో చాలా వ్యాఖ్యానాలున్నాయి మరి భగవద్గీత యొక్క మరొక ఆంగ్ల వ్యాఖ్యన అవసరం ఏమిటి అనే దాన్ని క్రింది విధంగా వివరించవచ్చు ఒక... ఒక అమెరికన్ మహిళ, శ్రీమతి. చార్లెట్ లీ బ్లంక్ నన్ను తను చదవగల ఒక ఆంగ్ల భగవద్గీత అనువాదాన్ని సిఫార్సు చేయమని అడిగింది. నిస్సందేహంగా, అమెరికాలో భగవద్గీతకు చాలా సంచికలు లభిస్తాయి కానీ నేను చూసినంతవరకు, కేవలం అమెరికాలో మాత్రమే కాక, భారతదేశంలో కూడా, వాటిలో ఏ ఒక్కటి ప్రామానికమైనదిగా చెప్పలేము, ఎందుకంటే వారిలో దాదాపు అందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భగవద్గీతకు వ్యాఖ్యాన రూపంలో భగవద్గీత యొక్క యథాతథమైన భావాన్ని ముట్టుకోకుండా.

భగవద్గీత యొక్క భావాన్ని భగవద్గీతలోనే పేర్కొనబడింది. అది ఈ విధంగా చెప్పవచ్చు. మనం ఒక ఔషధాన్ని తీసుకోవాలనుకుంటే, మనం పాటించాల్సివుంటుంది దాని మీద పేర్కొన్న మార్గదర్శకాలను. మనం ఒక ఔషధాన్ని మన కోరిక మీద కానీ లేదా స్నేహితుడి సలహా మీద కానీ తీసుకోకూడదు, మనం కేవలం దాని మీద వ్రాసిన సూచనలను అనుసరించి మరియు వైద్యుని సలహాను అనుసరించి తీసుకోవాలి. అలాగే, భగవద్గీతను కూడా వక్త ఇచ్చిన నిర్దేశాలను అనుసరించి యథాతథముగా తీసుకోవడం లేదా స్వీకరించడం చేయాలి