TE/660419 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"ప్రస్తుత తరుణంలో, మన భౌతిక స్థితిలో, మనము ఆలోచనలను తయారు చేస్తున్నాము, మరియు విస్మయము చెన్ధుతున్నాము ఎందుకంటే మనస్సు యొక్క కార్యము ఏదో ఒకదాన్ని సృష్టించడం మరియు మళ్ళీ తిరస్కరించడం.
'అవును, నన్ను ఇలా చేయనివ్వు' అని మనస్సు ఏదో ఆలోచిస్తుంది, 'ఓహ్, దీన్ని చేయకపోవడమే మంచిది' అని నిర్ణయిస్తుంది. దీనిని సంకల్ప-వికల్ప అంటారు, నిర్ణయించడం మరియు తిరస్కరించడం. మరియు దీనికి కారణం ఈ భౌతిక వేదికలో మన అస్థిర పరిస్థితి. కానీ మనం పరమ చైతన్యం ప్రకారం పనిచేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ దశలో, 'నన్ను ఇది చేయనివు' లేదా 'నన్ను ఇది చేయనివ్వొద్దు' అనే ద్వంద్వత్వం లేదు. ఒకే ఒక్క విషయం ఉంది, 'నేను దీన్ని చేస్తాను. ఇది ఉన్నత చైతన్యం ద్వారా అనుమతి చేయబడినందున నేను దీన్ని చేస్తాను'. మొత్తం భగవద్గీత ఈ జీవిత సూత్రంపై ఆధారపడి ఉంది." |
660419 - ఉపన్యాసం BG 02.55-56 - న్యూయార్క్ |