"జ్ఞానం లేకుండా, ఒకరు బంధము నుండి విడవడ లేరు. మరి ఆ జ్ఞానం ఏమిటి? జ్ఞానం ఏమిటంటే 'నేను ఈ జడ పదార్థం కాదు; నేను జీవ ఆత్మని.' ... కానీ ఈ జ్ఞానం ఏమిటంటే ... "నేను ఈ శరీరం కాదు, కానీ నేను జీవ ఆత్మని" అని చెప్పడం చాలా తేలికైన విషయం అయినప్పటికీ, వాస్తవానికి పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండటం గొప్ప పని. ఇది చాలా సులభం కాదు. ఆ అత్యున్నత జ్ఞానాన్ని పొందడం కోసం, నేను చెప్పేది, తత్త్వజ్ఞులు బంధము నుండి వేరుబడటానికి, జీవితం తరువాత జీవితం ప్రయత్నిస్తున్నారు. కానీ భక్తి సేవలో నిమగ్నమైతే అది ఒక సులభమైన ప్రక్రియ. అది శ్రీమద్ భాగవతంలో ఇచ్చిన సూత్రం. వాసుదేవే భగవతి (SB 1.2.7). వాసుదేవే భగవతి, 'భగవంతుడు కృష్ణుడు.' వాసుదేవుడు కృష్ణుడు."
|