"మరణ సమయంలో, మీరు ఏమి ఆలోచిస్తున్నారో, మీరు మీ తదుపరి జీవితాన్ని అలాంటిదే సిద్ధం చేస్తున్నారని అర్థం. అందువల్ల మొత్తం జీవితం అంత అలా కొనసాగుతుంది. అదే సమయంలో, మన జీవితం చివరలో మనం కనీసం కృష్ణుని గురించి ఆలోచించవచ్చు. అప్పుడు మీరు ఖచ్చితంగా మరియు నిశ్చితంగా కృష్ణుని దెగ్గరకు వెళతారు. ఈ అభ్యాసం మనం చేయవలసి ఉంది. ఎందుకంటే, మనం బలంగా మరియు దృడంగా ఉన్నప్పుడే సాధన చేస్తే తప్ప మన చైతన్యం సరైన ఆలోచన (రాదు). కాబట్టి ఇంద్రియ సంతృప్తి కోసం చాలా విషయాలలో సమయాన్ని వృథా చేయకుండా, మనం నిరంతరం కృష్ణ ఛైతన్యంపై దృష్టి సారిస్తూవుంటే, మన భౌతిక ఉనికి యొక్క అన్ని కష్టాలకు మనము పరిష్కారం చేస్తున్నట్లు. అదీ పదత్తి, అదే కృష్ణ చైతన్యం, ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉండటం."
|