TE/660530 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఒక సాధువు అన్ని జీవులకు స్నేహితుడు. అతను మానవులకు మాత్రమే స్నేహితుడు కాదు. అతను జంతువులకు స్నేహితుడు. అతను చెట్లకు స్నేహితుడు. అతను చీమలు, పురుగులు, సరీసృపాలు, పాములు-అందరికీ స్నేహితుడు. తితిక్షవః కారునైకః సుహ్రుదః సర్వ-దేహినాం (SB 3.25.21).


మరియు అజాత-శత్రు. మరియు అతను అందరికీ స్నేహితుడు కాబట్టి, అతనికి ఎవరు శత్రువులు లేరు. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచం చాలా అవిశ్వాసనీయంగా ఉంది, అటువంటి సాధువుకి కూడా శత్రువులు ఉన్నారు. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువుకు కొంతమంది శత్రువులు ఉన్నట్లే, మహాత్మా గాంధీకి కూడా కొంతమంది శత్రువులు ఉన్నారు. కాబట్టి ప్రపంచం అంత నమ్మకద్రోహం కూడి ఉంది. ఒక సాధువుకి కూడా, కొంత మంది శత్రువులు ఉన్నారు. చూశారా? కానీ సాధువుకి, అతని వైపు నుండి, అతనికి ఎవరు శత్రువులు లేరు. అతను అందరికీ స్నేహితుడు. తితిక్షవః కారునైకః సుహ్రుదః సర్వ-దేహినాం (SB 3.25.21). మరియు అజాత-శత్రవః శాంతః ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఇవి సాధువుల లక్షణాలు."

660530 - ఉపన్యాసం BG 03.21-25 - న్యూయార్క్