TE/660801 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మొత్తం భౌతిక ప్రకృతి మూడు గుణాల ప్రభావంతో పనిచేస్తోంది: సత్త్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. మీరు మొత్తం మానవ జాతిని ఒకటిగా వర్గీకరించలేరు. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం, ప్రతి ఒక్కరినీ ఒకే ప్రామాణిక స్థాయికి తీసుకు రావడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ ప్రకృతి యొక్క వివిధ గుణాల ప్రభావంతో పనిచేస్తున్నందున ఇది సాధ్యం కాదు. అందువల్ల విభజన, సహజ విభజన ఉండాలి. ఈ విషయం మనం చర్చించాము. కాని మనం ఈ భౌతిక ఉపరితలం దాటినప్పుడు, అప్పుడు ఏకత్వం ఉంటుంది. ఇక విభజన లేదు. అప్పుడు ఎలా అధిగమించాలి? ఆ అతీంద్రియ స్వభావం కృష్ణ ఛైతన్యం. మనం కృష్ణ ఛైతన్యంలో పూర్తిగా నిమగ్నమైన వెంటనే, ప్రకృతి యొక్క ఈ భౌతిక గుణాలకు మనం అధిగమించగల్గుతాము."
660801 - ఉపన్యాసం BG 04.13-14 - న్యూయార్క్