"ఎవ్వరూ కృష్ణుడిలా ప్రసిద్దులు కాలేరు. ప్రపంచమంతటా ఆయనే ప్రసిద్ధుడు, ఇంకా భారతదేశం గురించి ఏమి మాట్లాడాలి? సంపూర్ణ కీర్తి. అదేవిధంగా సంపూర్ణ బలము, సంపూర్ణ ఐశ్వర్యము, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము ... (చూడండి) భగవద్గీతను కృష్ణుడే ఉపదేశించారు. భగవద్గీతకు సమానమైనది లేదు మరియు సాటి లేదు. ఇది అంతటి గొప్ప జ్ఞానము. చూశారా? సంపూర్ణ జ్ఞానం. కాబట్టి ఈ ఆరు విషయాలన్నింటినీ సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు భగవంతుడు. ఇది భగవంతుని నిర్వచనం. సంపూర్ణ బలము, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ ఐశ్వర్యము మరియు సంపూర్ణ వైరాగ్యము.”
|