TE/Prabhupada 0007 - కృష్ణుని నిర్వహణ వస్తుంది



Lecture on SB 1.5.22 -- Vrndavana, August 3, 1974

బ్రహ్మానంద: బ్రాహ్మణుడు ఏ ఉద్యోగం అంగీకరించడానికి వీలు లేదు.

ప్రభుపాద: లేదు, అతను ఆకలి చేత మరణిస్తాడు కానీ అతను ఏ ఉద్యోగానికి అంగీకరించడు. బ్రాహ్మణ అంటే అది. క్షత్రియ కూడా అదే, మరియు వైశ్య కూడా. కేవలం శూద్ర మాత్రమే. ఒక వైశ్యుడు ఏదో ఒక వ్యాపారాన్ని కనుగొంటాడు. అతను ఏదో ఒక వ్యాపారాన్ని కనుగొంటాడు. కాబట్టి ఒక ఆచరణాత్మక కథ ఉంది. ఒక నంది అనే వ్యక్తి, చాలా, చాలా రోజుల క్రితం, కలకత్తాలో, అతను ఒక స్నేహితుడు దగ్గర,

"నువ్వు నాకు కొంచెం పెట్టుబడి ఇస్తే, నేను ఏదో ఒక వ్యాపారం మొదలు పెట్టగలను."

అందువలన అతను అన్నాడు, "నువ్వు వైశ్యా? వ్యాపారివా?"

అవును.

"ఓహ్, నువ్వు నా దగ్గర నుంచి ధనాన్ని అడుగుతున్నావా? ధనం వీధిలో వుంది. నువ్వు కనుగొనవచ్చు."

అప్పుడు అతను అన్నాడు, "నేను కనుగొనలేదు".

మీరు కనుగొన లేదా? అది ఏమిటి?

అది, ఆ చనిపోయిన ఎలుక.

అది నీ పెట్టుబడి. చూడండి.

ఆ రోజుల్లో కలకత్తాని ప్లేగు వ్యాధి పీడిస్తూ ఉంది కాబట్టి పురపాలక ప్రకటన ఇచ్చింది, ఎవరైతే చనిపోయిన ఎలుకలను మున్సిపల్ కార్యాలయానికి తీసుకుని వస్తారో, అతనికి రెండు అణాలు చెల్లిస్తాం. అందువలన అతను చనిపోయిన ఎలుక మృతదేహం తీసుకొని పురపాలక కార్యాలయానికి వెళ్ళాడు. అతనికి రెండు అణాలు చెల్లించారు. అతను, ఆ రెండు అణాలతో కొన్ని కుళ్ళిన వక్కలు కొనుగోలు చేసాడు. మరియు వాటిని శుభ్రపరిచి నాలుగు లేదా అయిదు అణాలకు అమ్మాడు. ఈ విధంగా, మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చేసి ఆ మనిషి ధనవంతుడుగా మారాడు. వారి కుటుంబ సభ్యులలో ఒకరు మా ఆశ్రమములో దైవీసోదరుడు (గాడ్ బ్రదర్). నంది కుటుంబం. నంది కుటుంబంలో ఇప్పటికీ, నిత్యం తినడానికి నాలుగు వందల, ఐదు వందల వ్యక్తులు ఉంటారు . ఒక పెద్ద రాజా కుటుంబం వంటిది. మరియు వారి కుటుంబం యొక్క నియమము, కూతురు లేదా కొడుకు పుట్టిన వెంటనే, బ్యాంకులో ఐదు వేల రూపాయలు జమ చేస్తారు. మరియు అతని వివాహ సమయంలో, వడ్డీతో ఆ ఐదు వేల రూపాయలను, అతను తీసుకొనవచ్చు. అంతేకానీ మూలధనములో ఎక్కువ వాటా ఉండదు. మరియు కుటుంబంలో నివసించే ప్రతి ఒక్కరూ, తిండి మరియు ఆశ్రయం పొందుతారు. ఇది వారి... నిజమైనది, నేను చెప్పే దాని అర్థం ఏమిటంటే, ఈ కుటుంబం యొక్క స్థాపకుడు, నంది, అతను తన వ్యాపారం ఒక ఎర్రని, చనిపోయిన ఎలుకతో మొదలు పెట్టాడు.

అది నిజానికి సత్యం, నిజానికి సత్యం, ఒకరు జీవితాన్ని స్వతంత్రంగా జీవించాలి అనుకుంటే... కలకత్తాలో నేను చూసాను. పేద తరగతి వైశ్యులు కూడా, మరియు ఉదయం పూట, వారు కొంచెం పప్పుని తీసుకుంటారు, సంచి నిండా పప్పు, మరియు ఇంటి ఇంటికి వెళ్తారు. పప్పు ప్రతిచోటా అవసరం. కాబట్టి అతను ఉదయం పప్పు వ్యాపారం చేస్తాడు, మరియు సాయంత్రం అతను ఒక డబ్బీ కిరోసిన్ తీసుకువెళ్తాడు. సాయంత్రం కిరోసిన్ ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పటికీ మీరు, భారతదేశంలో చూడవచ్చు వారు.... ఎవరూ ఉపాధి కోసం వెతకరు. అతను కలిగియున్నది ఏదో ఒకటి ఒక చిన్న, కొన్ని బఠాణీ గింజలు లేదా వేరుశెనగ అమ్ముతూ ఉంటారు. అతను ఏదో ఒకటి చేస్తున్నాడు. కృష్ణుడు, అందరికీ జీవించడానికి ఏదో ఒకటి ఇస్తాడు. ఇలా ఆలోచించడం తప్పు "ఈ వ్యక్తి నాకు నిర్వహణ ఖర్చుల కోసము ఇస్తున్నాడు." అది కాదు. శాస్త్రం చెబుతుంది, ఎకో యో బహునాం విదధాతి కామాన్. అది కృష్ణుడు పై నమ్మకం, ఏంటంటే "కృష్ణుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు, కృష్ణుడు నన్ను ఇక్కడికి పంపాడు. కావున ఆయన నాకు జీవించడానికి కావాల్సినవి కూడా కల్పిస్తాడు. కాబట్టి నా సామర్థ్యం ప్రకారం, నేను ఏదో ఒకటి చేస్తాను, మరియు ఆ మూలం కృష్ణుడి ద్వారా, నిర్వహణ వస్తుంది. "