TE/Prabhupada 0011 - ఎవరైనా కృష్ణుని మనస్సులో ఆరాధించవచ్చు



Lecture on BG 4.28 -- Bombay, April 17, 1974

భక్తి-రసామృత-సింధు లో ఒక కథ ఉంది... కథ కాదు.సత్యం. అక్కడ ఈ విధంగా వివరింపబడింది. ఒక బ్రాహ్మణ- అతను గొప్ప భక్తుడు. అతనికి ఎప్పుడు చాలా మెరుగైన సేవ, అర్చన, ఆలయ పూజలలో చేయాలని ఉండేది. కానీ అతని వద్ద ధనం లేదు. కానీ ఒక రోజు అతను భాగవత ప్రవచనము లో కూర్చుని ఉన్నాడు. మరియు అతను అప్పుడు విన్నాడు, కృష్ణుడిని మనస్సులోనే పూజించవచ్చు అని. కావున అతను ఈ అవకాశం తీసుకున్నాడు ఎందుకంటే అతను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాడు కృష్ణుడిని చాలా బ్రహ్మాండంగా ఎలా పూజించాలి అని, కానీ అతని వద్ద ధనం లేదు.

కావున అతను, ఈ సూచన తెలుసుకున్నప్పుడు, కృష్ణుడిని ఒకరు మనస్సులోనే పూజించవచ్చు అని, గోదావరి నది లో స్నానం చేసిన తరువాత, అతను ఒక చెట్టు కింద కుర్చుని ఉన్నాడు మరియు అతని మనస్సులో అతను ఒక బ్రహ్మాండమైన సింహాసనాన్ని నిర్మిస్తున్నాడు, నగలతో అలంకరించి మరియు విగ్రహాన్ని సింహాసనం పై పెట్టి, విగ్రహానికి స్నానం చేయిస్తున్నాడు గంగ, యమునా, గోదావరి, నర్మదా, కావేరి నది యొక్క నీళ్ళతో. తరువాత విగ్రహాన్ని చాలా అందంగా అలంకరణ చేస్తున్నాడు, తరువాత పూలతో, పూలమాలతో పూజ చేస్తున్నాడు.

తరువాత అతను చాలా మంచిగా వండుతున్నాడు, మరియు అతను పరమాన్నము వండుతున్నాడు, తియ్యని అన్నం. కావున అతను దాన్ని చాలా వేడిగా ఉందేమో అని పరీక్షించాలి అనుకున్నాడు. ఎందుకంటే పరమాన్నము చల్లగా తీసుకోవాలి, వేడిగా తీసుకోకూడదు. కావున అతను తన వేలు పరమాన్నముపై పెట్టినాడు మరియు అతని వేలు కాలింది. అప్పుడు అతని ధ్యానం భగ్నం అయ్యింది, ఎందుకంటే అక్కడ ఏమి లేదు. కేవలం అతని మనస్సులోనే అతను అంతా చేస్తున్నాడు. కావున... కానీ అతని వేలు కాలడం చూసి, అతను ఆశ్చర్యం చెందాడు.

ఈ విధంగా, నారాయణ వైకుంఠం నుంచి, ఆయన మందహాసము చేస్తున్నాడు. లక్ష్మీదేవి అడిగింది, ఎందుకు మందహాసము చేస్తున్నారు? నా ఒక భక్తుడు ఈ విధంగా పూజిస్తున్నాడు. కావున అతన్ని వెంటనే వైకుంఠానికి తీసుకురమ్మని నా మనుషులను పంపించాను.

కావున భక్తి-యోగ చాలా మంచిది. స్వామి విగ్రహానికి బ్రహ్మాండమైన పూజ చేయడానికి మీకు ఎటువంటి మార్గము లేకపోయినా, మీ మనస్సులో చేయవచ్చు. అది కూడా సాధ్యం