TE/Prabhupada 0012 - వినడమే జ్ఞానానికి మూలం కావాలి



Lecture on BG 16.7 -- Hawaii, February 3, 1975

మనలో ప్రతి ఒక్కరూ లోపము కలిగిన వారె. మనము మన కళ్ళ గురించి చాలా గర్వం చెందుతాము: "మీరు నాకు చూపించగలరా?" మీ కళ్ళకు ఎటువంటి అర్హత ఉంది మీరు చూడడానికి? అతను ఇలా ఆలోచన చెయ్యడు, నాకు అర్హత లేదు; కానీ నేను చూడాలి అనుకుంటున్నా." ఈ కళ్ళు, ఓహ్, అవి చాలా షరతుల పై ఆధారపడ్డాయి. ఇప్పుడు విద్యుత్ ఉంది, మీరు చూడగలరు. విద్యుత్ పోయిన వెంటనే, మీరు చూడలేరు. అప్పుడు మీ కళ్ళ యొక్క విలువ ఏంటి ? ఈ గోడ వెనుక ఏమి జరుగుతోందో నువ్వు చూడలేవు.

కావున మీ ఇంద్రియాలు జ్ఞానం యొక్క ఆధారం అని నమ్మవద్దు. లేదు. జ్ఞానం యొక్క మూలము వినడం ద్వారా ఉండాలి. దాన్ని శృతి అంటారు. అందువలన వేదాల పేరు శృతి. శృతి-ప్రమాణ, శృతి -ప్రమాణం. ఉదాహరణకు ఒక చిన్న పిల్లాడు తన తండ్రి ఎవరో అని తెలుసుకోవాలనుకుంటే కావున ఆధారము ఏది? ఆ ఆధారము వచ్చి శృతి, తల్లి దగ్గర నుండి వినడం. తల్లి చెప్తుంది, "ఈయన నీ తండ్రి." కావున అతను వింటాడు; అతను చూడడు అతను తన తండ్రి ఎలా అయ్యాడు అని. ఎందుకంటే తన శరీరం నిర్మాణం అవ్వక ముందే తండ్రి ఉన్నాడు, అతను ఎలా చూడగలడు? కావున చూడడం ద్వారా, మీరు మీ తండ్రిని నిర్దారించుకోలేరు. మీరు ప్రామాణికము నుంచి వినాలి, తల్లి ఇక్కడ ప్రామాణికము. అందువలన శృతి -ప్రమాణం: వినడం ద్వారా రుజువు ఉంది, చూడడం ద్వారా కాదు. చూడడం.. మన లోపం గల కళ్ళతో.. చాలా అడ్డంకులు ఉన్నాయి. కావున అదేవిధంగా, ప్రత్యక్ష జ్ఞానం ద్వారా మీరు నిజాన్ని తెలుసుకోలేరు.

ప్రత్యక్షంగా తెలుసుకొనుట అనేది ఊహాగానమే. డాక్టర్ ఫ్రాగ్. డాక్టర్ ఫ్రాగ్ అట్లాంటిక్ మహా సముద్రం ఏంటో ఊహిస్తోంది. అతను ఒక బావిలో ఉన్నాడు, మూడు అడుగుల బావి, మరియు ఒక స్నేహితుడు అతనికి చెప్పాడు, ఓహ్, నేను విస్తారమైన నీళ్ళని చూసాను. ఏంటి ఆ విస్తారమైన నీళ్ళా? "అట్లాంటిక్ మహాసముద్రం." ఎంత విస్తారమైనది? చాలా, చాలా పెద్దది." అప్పుడు డాక్టర్ ఫ్రాగ్ ఆలోచిస్తున్నాడు, "నాలుగు అడుగులు ఉంటుందా? ఈ బావి మూడు అడుగులు. అది వుంటే నాలుగు అడుగులు, సరే, ఐదు అడుగులు. సరే సరే, పది అడుగులు." కావున ఈ విధంగా, ఊహిస్తోంది, డాక్టర్ ఫ్రాగ్, ఆ కప్ప అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాన్ని ఎలా అర్థం చేసుకోగలదు? మీరు అట్లాంటిక్, పసిఫిక్ మహా సముద్రాల పొడువు వెడల్పు ఊహించి చెప్పగలరా? కావున ఊహాగానము ద్వారా మీరు తెలుసుకోలేరు. వాళ్ళు ఈ విశ్వం గురించి చాలా ఏళ్ళ నుంచి ఊహగానము చేస్తున్నారు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, వాటి పొడువు మరియు వెడల్పు ఎంత, ఎక్కడ.. ఎవ్వరికి ఈ భౌతిక ప్రపంచం గురించే తెలియదు, మరియు ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఏమి చెప్పాలి? అది మించింది, చాలా మించింది.

పరః తస్మాత్ తు భావోన్యః అవ్యక్తోఽవ్యక్తాత్ సనాతనః ( BG 8.20) మీరు భగవద్గీతలో కనుగొనవచ్చు. వేరొక ప్రకృతి ఉంది. ఈ ప్రకృతి, ఏదైతే మీరు చూస్తున్నారో, ఆకాశం, గుండ్రటి గోపురం, దాని పైన, మరలా ఐదు అంశాలు గల పొరలు ఉన్నాయి. ఇది కప్పడం. ఉదాహరణకు ఒక కొబ్బరి కాయను మీరు చూసినారు. అది గట్టిగా కప్పబడింది, మరియు ఆ గట్టి పొర లోపల నీళ్ళు ఉంటాయి. అదే విధంగా, ఈ కప్పబడిన దాంట్లో... మరియు ఈ కప్పడం బయట ఐదు పొరలు ఉన్నాయి, ఒక దాని కన్నా మరొకటి వేల సార్లు పెద్దవైనవి. నీటి పొర, గాలి పొర, నిప్పు పొర. కావున మీరు ఈ అన్ని పొరలు చొచ్చుకుని వెళ్ళాలి. అప్పుడు మీరు ఆధ్యాత్మిక ప్రపంచం దగ్గరకు వెళ్ళగలరు. ఈ అన్ని ప్రపంచాలు, అసంఖ్యామైనవి, కోటి. యస్య ప్రభ ప్రభవతో జగదండ-కోటి( Bs. 5.40) జగదండ అనగా విశ్వము. కోటి, కొన్నిలక్షలు కలిపి ఉన్నాయి, అదే భౌతిక ప్రపంచం. మరియు ఆ భౌతిక ప్రపంచం వెలుపల ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది, మరొక ఆకాశం. అది కూడా ఆకాశమే. దాన్ని పరవ్యోమ అని అంటారు. కావున మీ ఇంద్రియ జ్ఞానము ద్వారా మీరు చంద్ర గ్రహం లేదా సూర్య గ్రహంలో ఏమి ఉందో అంచనా వెయ్యలేరు, ఈ గ్రహం, ఈ విశ్వము లోపల. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఊహాగానము ద్వారా ఎలా అర్థం చేసుకోగలరు? ఇది మూర్ఖత్వం.

అందువలన శాస్త్రం చెప్తుంది, అసిన్త్యః ఖలు ఏ భావ న తమస్ తర్కేన యోజయేత్. అచింత్య, ఏదైతే తెలుసుకోలేమో, మీ ఇంద్రియ జ్ఞానానికి మించి, వాదించి మరియు ఊహించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యకండి. ఇది మూర్ఖత్వం. అది సాధ్యం కాదు. అందువలన మనము గురువు దగ్గరకు వెళ్ళాలి. తద్-విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రీయం బ్రహ్మ-నిష్టమ్ (MU 1.2.12). ఇది విధానం.