TE/Prabhupada 0013 - 24 గంటలు నిమగ్నమవ్వాలి
Lecture on BG 2.49-51 -- New York, April 5, 1966
యోగః కర్మసు కౌసలమ్. కౌసలమ్ అనగా నైపుణ్యము ఉన్న చమత్కారము, నైపుణ్యము ఉన్న చమత్కారము ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు మొదటి వ్యక్తి నిపుణుడు, రెండవ వ్యక్తి అంత నైపుణ్యం గల వ్యక్తి కాదు యంత్రాంగంలో కూడా, యంత్రంలో ఏదో తప్పు ఉంది చాలా నిపుణుడు కానీ వ్యక్తి, అతను పగలు మరియు రాత్రి ప్రయత్నిస్తున్నాడు, దానిని ఎలా సరి చేయాలి అని, కానీ నిపుణుడు వచ్చి ఒకేసారి లోపం ఏమిటో గ్రహించి చెప్పగలడు మరియు అతను ఒక వైర్ ను ఏదో ఒక విధముగా కలుపుతాడు, యంత్రం పని చేయడము ప్రారంభం అవుతుంది. చూడండి, హ్ర్జుం, హ్ర్జుం,హ్ర్జుం,హ్ర్జుం,హ్ర్జుం,హ్ర్జుం. ఉదాహరణకు కొన్ని సార్లు మేము మా ఈ టేప్ రికార్డర్ పనిచేయడంలో ఇబ్బంది పడినట్లు, మరియు కార్ల్ లేదా ఎవరైనా వచ్చి సరిచేసేవరకు. కాబట్టి ప్రతి ఒక్క దానికి నైపుణ్య జ్ఞానం అవసరం. కావున కర్మ, కర్మ అనగా పని. మనము పని చెయ్యాలి. పని చేయకుండా మన శరీరం మరియు ఆత్మ కూడా ముందుకు వెళ్ళదు. అది చాలా దురభిప్రాయం, ఎవరైతే.. ఆధ్యాత్మిక పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తున్నారో వారు పని చేయనవసరము లేదు. లేదు, అతను ఇంకా ఎక్కువ పని చెయ్యాలి. ఎవరైతే ఆధ్యాత్మిక పరిపూర్ణత కోసం కాదో, వారు నిమగ్నం అవ్వచ్చు కేవలం ఎనిమిది గంటల పనిలో, కానీ ఎవరైతే ఆధ్యాత్మిక పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తున్నారో, నిమగ్నం అయ్యారో, ఓహ్, వారు ఇరవై నాలుగు గంటలు, ఇరవై నాలుగు గంటలు నిమగ్నం అయ్యి ఉండాలి. అది తేడా. మరియు ఆ తేడా వచ్చి... మీకు ఈ భౌతిక ప్రపంచం లో తెలుస్తుంది, ఈ శరీర భావన జీవితం లో. మీరు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తే, మీరు అలసట చెందుతారు. కానీ ఆధ్యాత్మిక లక్ష్యం కోసం చేస్తే, మీరు ఇరవై నాలుగు గంటలు కంటే ఎక్కువ పని చేసినా... దురదృష్టవశాత్తు, మీకు ఇరవై నాలుగు గంటలు కన్నా ఎక్కువ లేవు మీ దగ్గర. అయినప్పటికీ, మీరు అలసట చెందరు. నేను చెప్తాను. ఇది నా ఆచరణాత్మక అనుభవం. ఇది నా ఆచరణాత్మక అనుభవం. మరియు నేను ఇక్కడ ఉన్నాను, ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉంటాను, రాయడమో లేదా చదవడమో ఏదో ఒకటి, చదవడమో లేదా రాయడమో ఏదో ఒకటి, ఇరవై నాలుగు గంటలు. కేవలం నాకు ఆకలి వేసినప్పుడు, కొంచెం ఆహారం తీసుకుంటాను. కేవలం నాకు నిద్ర వచ్చినప్పుడు, నేను నిద్ర పోతాను. లేకపోతే, ఎల్లప్పుడు, నేను అలసట చెందను. మీరు Mr.పాల్ ను అడగవచ్చు, నేను రోజు ఇలా చేస్తున్నానో లేదో అని. కావున నేను ఆ పని చేయడం లో ఆనందం పొందుతాను. నేను అలసట చెందను. అదేవిధంగా, ఒకరు ఆ ఆధ్యాత్మిక భావనలో వుంటే, అతను అలసట అనుభూతి చెందడు. పైగా, అతను నిద్రించడానికి చిరాకు పడతాడు, నిద్రకు వెళ్ళడానికి, "ఓహ్, నాకు ఇబ్బంది కలిగించడానికి నిద్ర వచ్చింది." చూడండి? అతను తను నిద్రా సమయాన్ని తగ్గించాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు, మనం ప్రార్థిస్తున్నట్టు, వందే రూప-సనాతన రఘు-యుగౌ శ్రీ-జీవ గోపాలకౌ. ఈ ఆరుగురు గోస్వాములు, వారు చైతన్య మహాప్రభుచే ఈ శాస్త్రం గురించి చర్చించడానికి ప్రతినిధులుగా నియమించబడ్డారు. వారు దాని గురించి విస్తారమైన సాహిత్యాన్ని రాసారు. మీరు చూడండి? మీరు ఆశ్చర్యపోతారు వారి నిద్ర రోజులో కేవలం గంట లేదా అరగంట మాత్రమే దాన్ని కూడా, కొన్నిసార్లు విడిచిపెట్టేవారు