TE/Prabhupada 0015 - నేను ఈ శరీరం కాదు



Lecture on BG 9.34 -- New York, December 26, 1966

ఆత్మ యొక్క ఉనికి ప్రదర్శనకు ఆరు లక్షణాలు ఉన్నాయి. పెరుగుదల ఒక ముఖ్యమైనది. కాబట్టి పెరుగుదల, ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరం నుండి బయటకు వెళ్తుందో, పెరుగుదల ఆగిపోతుంది. పిల్లాడు చనిపోయి జన్మిస్తే, ఓహ్, అప్పుడు ఎటువంటి పెరుగుదల ఉండదు. ఓహ్, తల్లితండ్రులు ఉపయోగం లేనిది అని అంటారు. విసిరి వేయండి. కాబట్టి అదేవిధంగా, కృష్ణ భగవంతుడు అర్జునుడికి మొదట ఉదాహరణ ఈ విధంగా ఇచ్చాడు. ఇలా ఆలోచించవద్దు, ఈ శరీరం లోపల ఉన్న ఆధ్యాత్మిక కణము వల్ల, శరీరం బాల్య దశ నుండి చిన్ననాటి దశకు పెరుగుతుంది. చిన్ననాటి దశ నుండి యవ్వన దశకు, యవ్వన దశ నుండి ముసలి దశకు. అందువలన, ఈ శరీరం ఉపయోగం లేనప్పుడు, తెలియకుండా, ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్తుంది," వాసాంసి జీర్నాని యథా విహాయ ( BG 2.22) మనము పాత వస్త్రాలు వదిలి కొత్త వస్త్రాలు ఎలా అయితే ధరిస్తామో, అదే విధంగా, మనం వేరే శరీరాన్ని పొందుతాం.

మరియు మనము పొందే శరీరం మన యొక్క ఎంపిక పై ఉండదు. ఆ ఎంపిక ప్రకృతి నియమాల పై ఆధారపడి ఉంటుంది. ఆ ఎంపిక ప్రకృతి నియమాల పై ఆధారపడి ఉంటుంది. చనిపోయేటప్పుడు మీరు ఏమి చెప్పలేరు, కానీ మీరు ఆలోచించవచ్చు. మీరు చెప్పగలరు, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వ్యక్తిత్వం మరియు ఆ ఎంపిక అంతా అక్కడ ఉంది. యమ్ యమ్ వాపి స్మరన్ భావం త్యజతి అన్తే కలేవరం ( BG 8.6) మీరు చనిపోతున్నప్పుడు కేవలం మీ మనస్తత్వం, మీ ఆలోచనలు వృద్ధి చెందిన విధంగా, మీకు ఆ శరీరం ప్రకారం మరు జన్మ కలుగుతుంది. కావున తెలివైన వ్యక్తి, ఎవరైతే స్థిర బుద్ధి కలిగి వుంటారో, అతను తాను ఈ శరీరం కాదు అని అర్థం చేసుకోవాలి. మొదటిది. నేను ఈ శరీరం కాదు. అప్పుడు అతనికి అర్థం అవుతుంది అతని కర్తవ్యం ఏమిటో. ఓహ్, ఒక ఆధ్యాత్మిక ఆత్మ, అతని కర్తవ్యం ఏమిటి?

అతని కర్తవ్యం వచ్చి, అది భగవద్గీతలో చెప్పబడింది. తొమ్మిదవ అధ్యాయం చివరి పద్యములో, ఆ కర్తవ్యం వచ్చి మన్మనా భవ. ( BG 9.34) మీరు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తున్నారు. మనలో ప్రతి ఒక్కరు, రూపంతో, మనం ఏదో ఒకటి ఆలోచిస్తాం. ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా మీరు ఉండలేరు. అది సాధ్యం కాదు. కావున ఇది కర్తవ్యం. మీరు కృష్ణుడి గురించి ఆలోచించండి. మీరు కృష్ణుడి గురించి ఆలోచించండి. మీరు ఏదో ఒకటి ఆలోచించాలి. కావున కృష్ణుడి గురించి అలోచిస్తే హాని ఏమిటి? కృష్ణుడికి చాలా కార్యకలాపాలు ఉన్నాయి, చాలా సాహిత్యాలు, మరియు చాలా ఉన్నాయి. కృష్ణుడు ఇక్కడికి వస్తాడు. మనకు చాలా పరిమాణములో పుస్తకాలు ఉన్నాయి. మీరు కృష్ణుడి గురించి ఆలోచించాలి అనుకుంటే, మేము మీకు చాలా సాహిత్యాలు అందచేయగలం. వాటిని మీరు ఇరవై నాలుగు గంటలు మీ జీవితం మొత్తం చదివినా పూర్తి చేయలేరు. కావున కృష్ణుడి గురించి ఆలోచించడానికి చాలా ఉంది. కృష్ణుడి గురించి ఆలోచించండి. మన్మనా భవ. ఓహ్, నేను నీ గురించి ఆలోచించగలను.

ఒక వ్యక్తి తన యజమానికి సేవ చేస్తున్నట్లు. ఓహ్, అతను ఎల్లప్పుడు తన యజమాని గురించే ఆలోచిస్తాడు. ఓహ్, నేను అక్కడికి తొమ్మిది గంటలకు వెళ్ళకపోతే, యజమానికి అసంతృప్తి కలుగుతుంది. అతను కొంచెం ప్రయోజనం కోసం ఆలోచిస్తున్నాడు. ఆ విధమైన ఆలోచన పనికి రాదు. అందువలన ఆయన చెప్తాడు, భవ మద్భక్తః.( BG 9.34) మీరు నా గురించి కేవలం ప్రేమతో ఆలోచించండి. ఒక యజమాని, ఎప్పుడు, నేను చెప్పేది ఏంటంటే, ఒక సేవకుడు తన యజమాని గురించి ఆలోచన చేసినప్పుడు, అక్కడ ప్రేమ లేదు. అతను ధనం గురించి అలోచిస్తున్నాడు. ఎందుకంటే, నేను కార్యాలయానికి తొమ్మిది గంటలకు హాజరు కాలేకపోతే, ఓహ్, ఆలస్యం అవుతుంది, మరియు నేను రెండు డాలర్లు కోల్పోతాను. అందువలన అతను యజమాని గురించి ఆలోచించడం లేదు, అతను ఆ ధనం గురించి ఆలోచిస్తున్నాడు. కావున అటువంటి ఆలోచన మిమ్మల్ని రక్షించలేదు. అందువలన ఆయన చెప్తాడు, భావ మద-భక్తః. మీరు కేవలం నా భక్తుడు అవ్వండి. అప్పుడు నా గురించి మీ ఆలోచన మంచిగా ఉంటుంది. మరియు ఆ భక్తి ఏమిటి? మద్భక్తః. భక్తి.. భక్తి అనగా సేవ. మద్యాజి ( BG 9.34) . మీరు భగవంతుడికి కొంచెం సేవ చేయండి. ఈ విధంగా మా లాగా మేము ఎల్లప్పుడు నిమగ్నం అయ్యి ఉన్నాం. మీరు ఎప్పుడు వచ్చినా మేము ఏదో ఒక కార్యం లో నిమగ్నం అయ్యి ఉండడం చూస్తారు. కావున మేము కొంత కర్తవ్యాన్ని తయారు చేసాం. కేవలం కృష్ణుని గురించి ఆలోచించడం.