TE/Prabhupada 0016 - నేను పనిచేయాలి అని కోరుకుంటున్నాను
Lecture on BG 7.1 -- San Francisco, March 17, 1968
కావున కృష్ణుని ఎలా చేరుకోవాలి అనేది ఒకరికి తెలిసివుండాలి. కృష్ణుడు ప్రతి చోట ఉన్నాడు. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. ఇది కృష్ణ చైతన్యం. కృష్ణుని రూపాల లోని లక్షణాలను ఒకరు ఎలా పొందాలి అనేది తెలుసుకోవాలి. చెక్క లేదా ఇనుప లేదా ఏ ఖనిజమైన.. అది పట్టింపు లేదు. కృష్ణుడు ప్రతి చోట ఉన్నాడు. మీరు కృష్ణునితో ప్రతిదానితో ఎలా పరిచయం చేసుకోవాలి అన్నది నేర్చుకోవాలి. అది యోగ ప్రక్రియలో వివరించబడింది. మీరు నేర్చుకుంటారు. కావున కృష్ణ చైతన్యం కూడా యోగ వంటిదే, అది పరిపుర్ణమైన యోగ, యోగ ప్రక్రియలకంటే ఉత్తమమైనది. ఎవరైనా, ఏ యోగి అయినా రావచ్చు, మరియు మనము సవాలు చేయచ్చు. మరియు మనము చెప్పవచ్చు ఇది A-1 యోగ ప్రక్రియ అని. ఇది A-1, మరియు ఇది అదే సమయం లో చాలా సులువైనది. మీరు మీ శరీరాన్ని వ్యాయామం చెయ్యవలసిన అవసరం లేదు. ఒక్కోసారి మీరు బలహీనంగా లేదా అలసట చెందుతారు, కానీ కృష్ణ చైతన్యం లో మీరు ఆ అనుభవం పొందరు. మా విద్యార్థులు అందరు, వారు కేవలం కృష్ణ చైతన్యములో అధిక పని చేయడం కోసము ఆత్రుతతో ఉంటారు. స్వామీజీ, నేను ఏమి చెయ్యాలి? నేను ఏమి చెయ్యగలను? వారు నిజానికి మంచిగా చేస్తున్నారు. చాలా మంచిగా. వాళ్ళకి అలసట రాదు. అది కృష్ణ చైతన్యం. ఈ భౌతిక ప్రపంచం లో మీరు కొంచెం సేపు పని చేస్తే, మీరు అలసిపోతారు. మీకు విశ్రాంతి కావాలి. కానీ నాకు కాదు, నేను చెప్పే దాని అర్థం, నా గురించి ఎక్కువ చెప్పడం కాదు. నేను డెబ్బై ఏళ్ల ముసలి వాడను. ఓహ్, నేను అనారోగ్యముతో ఉన్నప్పుడు. ఇండియాకి తిరిగి వెళ్ళాను. నేను మళ్ళీ తిరిగి వచ్చాను. నాకు పని చెయ్యాలని ఉంది! నాకు పని చెయ్యాలని ఉంది. సామాన్యంగా, నేను అన్ని పనుల నుంచి విరమణ తీసుకోవచ్చు, కానీ నేను అలా భావించడము లేదు. నేను పని చెయ్యగలిగే వరకు, నాకు పనిచెయ్యాలని ఉంది. రాత్రి పగలు చెయ్యాలని ఉంది. రాత్రి పూట నేను ఢిక్టాఫోను(మాటలను రికార్డు చేసి అవసరమైన సమయంలో వినిపించు యంత్రము)తో పని చేస్తాను. ఒకవేళ నేను పని చేయలేకపోతే నేను పశ్చాత్తాపం చెందుతాను. ఇది కృష్ణ చైతన్యం. పని చేయడానికి ఒకరు చాలా ఆత్రుతగా ఉండాలి. ఇది ఖాళీగా కూర్చొనే సమాజం అని కాదు. కాదు. మేము తగినంత పనుల్లో నిమగ్నం అయ్యాము. వాళ్ళు పత్రికలను కూర్పు చేస్తున్నారు, వాళ్ళు పత్రికలను అమ్ముతున్నారు. ఈ విధంగా కృష్ణ చైతన్యమును ఎంతగానో వ్యాప్తి చేయవచ్చు అని తెలుసుకోండి. ఇది ఆచరణాత్మకమైనది.