TE/Prabhupada 0018 - గురువు పాదాల చెంత దృఢ విశ్వాసముతో ఉండుట
Lecture on SB 6.1.26-27 -- Philadelphia, July 12, 1975
ప్రభుపాద: కావున ఈ సమయం మనం పరిష్కారం తయారు చేయడానికి ఉపయోగించాలి ఈ జీవితానికి సంబంధించిన పదే పదే చనిపోవడం మరియు మళ్ళీ వేరొక శరీరాన్ని అంగీకరించడం. కావున వాళ్ళు దీన్ని ఎలా అర్థం చేసుకోగలరు ఒక సరైన గురువు దగ్గరికి రాకుండా? అందువలన శాస్త్రం చెప్తుంది, తద్-విజ్ఞానార్థం: "మీరు జీవితం యొక్క నిజమైన సమస్యను తెలుసుకోవాలంటే మరియు మీరు జ్ఞానవంతులు అయ్యి, ఎలా కృష్ణ చైతన్యం లోకి రావాలి, ఎలా శాశ్వతము అవ్వాలి? ఇంటికి మరలా వెళ్ళాలి? భగవంతుని ఎలా చేరుకోవాలి? అప్పుడు మీరు గురువు దగ్గరకు వెళ్ళాలి." మరియు గురువు ఎవరు? అది వివరింపబడింది, చాలా సులువైన విషయం. గురువు ఎన్నడూ ఇటువంటి ఆలోచన తయారు చేయడు "నువ్వు ఇది చేసి మరియు నాకు ధనం ఇవ్వు మరియు నువ్వు సంతోషం పొందుతావు." అతను గురువు కాదు. అది ధనం సంపాదించడానికి మరొక మార్గం. కావున ఇక్కడ చెప్పబడింది, మూఢ, పిచ్చి వాళ్ళ స్వర్గంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు, వారు సొంత ఆలోచనలను తయారు చేసుకుంటున్నారు అజామిళ వలె... కొంతమంది ఇదే వారి కర్తవ్యం అని అంగీకరించారు, కొంతమంది.. అతను మూర్ఖుడు మీరు మీ కర్తవ్యం ఏమిటో మీ గురువు దగ్గర నుంచి తెలుసుకోవాలి. మీరు ప్రతి రోజు గానం చేస్తారు., గురు-ముఖ-పద్మ-వాక్య, చిత్తతే కొరియా ఐక్య, ఆర న కోరిహో మనే ఆశ. ఇది జీవితం. ఇది జీవితం. గురు-ముఖ-పద్.. మీరు నిజమైన గురువు ను అంగీకరించండి, మరియు అతను ఏది ఆజ్ఞ ఇస్తే, దాన్ని నిర్వర్తించండి. అప్పుడు మీ జీవితం విజయవంతం అవుతుంది. ఆర న కోరిహో మనే ఆశ. మూర్ఖుడా, నువ్వు వేరే ఏది ఆశ పడకు. మీరు రోజూ గానం చెయ్యడం లేదా? కానీ మీరు దాన్ని అర్థాన్ని అర్థం చేసుకుంటున్నారా? లేదా మీరు కేవలం గానం చేస్తున్నారా? దాని అర్థం ఏంటి? ఎవరి వివరిస్తారు? ఎవ్వరికీ తెలియదు? అవును, దాని అర్థం ఏంటి?
భక్తుడు: "నా కోరిక కేవలం నా బుద్ధి పరిశుద్ధం అవ్వాలి. నా ఆధ్యాత్మిక గురువు నోటి ద్వారా వచ్చిన మాటలతో. నాకు ఇది తప్ప మరే కోరిక లేదు.
ప్రభుపాద: అవును, ఇది ఆజ్ఞ. గురు-ముఖ-పద్మ-వాక్య, చిత్తతే కొరియా ఐక్య. ఇప్పుడు చిత్త అనగా చేతనం లేదా మనస్సు. "నేను ఇదే చేస్తాను, చాలు. నా గురు మహారాజ చెప్పాడు; నేను ఇది చేస్తాను." చిత్తతే కొరియా ఐక్య, ఆర న కోరిహో మనే ఆశ. కావున అది నా గర్వం కాదు, కానీ నేను చెప్పగలను, మీ సూచన మీద నేను చేశాను. అందువలన మీరు ఎటువంటి కొంచెం గెలుపుని చూసినా, అది ఇందుకే. నాకు శక్తి లేదు, కానీ నేను నా గురువు యొక్క మాటలను నా ఆత్మ మరియు జీవితంగా తీసుకున్నాను. కావున ఇది సత్యం. గురు-ముఖ-పద్మ-వాక్య, చిత్తతే కొరియా ఐక్య. కావున ప్రతి ఒక్కరూ అది చెయ్యాలి. కానీ అతను ఏదైనా కలిపితే, మార్చితే, అప్పుడు అతను అంతం అవుతాడు. చేర్చడం, మార్చడం ఉండకూడదు. మీరు గురువు దగ్గరికి వెళ్ళాలి- గురు అనగా భగవంతునికి నిజాయతి గల సేవకుడు, కృష్ణ. మరియు ఆయన మాటలను పాటించి ఆయనను సేవించండి. అప్పుడు మీరు విజయవంతం అవుతారు. మీరు ఏదైనా ఉహించుకుంటే, "నేను నా గురువు కన్నా చాలా తెలివైన వాడిని, మరియు నేను చేర్చడం మరియు మార్చడం చేయగలను," అప్పుడు మీరు అంతం అవుతారు. కావున అది ఒక్కటే, మరియు ఇప్పుడు, మరింత గానం చెయ్యండి.
భక్తుడు: శ్రీ-గురు-చరణే రతి, ఏయ్ సే ఉత్తమ-గతి.
ప్రభుపాద: శ్రీ-గురు-చరణే రతి,ఏయ్ సే, ఉత్తమ-గతి. మీరు నిజమైన వృద్ధి సాధించాలి అంటే, మీరు మీ గురువు యొక్క పాద పద్మములు దగ్గర చాలా నమ్మకం కలిగి ఉండాలి. తరువాత?
భక్తుడు: జే ప్రసాదే పూరే సర్వ ఆశ.
ప్రభుపాద: జే ప్రసాదే పూరే సర్వ ఆశ. యస్య ప్రసాదాత్.. వైష్ణవ తత్వశాస్త్రము మొత్తంగా ఇదే భోదన. కావున మనము అది చేసేవరకు, మనము మూఢునిగా ఉంటాం, మరియు ఇది అజామిళ-ఉపాఖ్యానంలో వివరింపబడింది. కావున ఈ రోజు మనము ఈ పద్యము చదువుతున్నాం, స ఏవం వర్తమానః, ఆజ్ఞః. మరలా అతను చెప్తాడు. మరలా వ్యాసదేవుడు చెప్తాడు "ఈ ముర్కుడు అతని కొడుకు సేవలో నిమగ్నం అయ్యాడు, నారాయణ, పేరుతో." అతనికి తెలియదు.."ఏంటి ఈ అర్థం లేని నారాయణ అంటే?" అతనికి తన కొడుకు తెలుసు. కానీ నారాయణ చాలా దయతో, అతను ఎల్లప్పుడూ తన కొడుకు పేరును పిలుస్తున్నాడు, నారాయణ, దయచేసి ఇక్కడికి రా, నారాయణ దయచేసి ఇది తీసుకో, కావున కృష్ణుడు దాన్ని అంగీకరించాడు అతను నారాయణ అని జపిస్తున్నాడు అని. కృష్ణ చాలా దయ కలిగిన వాడు. అతను ఎప్పుడు భావించలేదు అతను నారాయణ దగ్గరకు వెళుతున్నాడు అని. అతనికి తన కొడుకు కావాలి ఎందుకంటే అతను అంటే చాలా ప్రేమ. కానీ అతనికి పవిత్రమైన నారాయణ నామం పఠించడానికి అవకాశం లభించింది. ఇది అతని అదృష్టం. అందువలన, దీని ప్రకారం, మనం పేరు మారుస్తాం. ఎందుకు? ఎందుకంటే ప్రతి పేరు కృష్ణుని కి సేవ కోసమే అని అర్థం. ఉపేంద్ర వలె, ఉపేంద్ర అంటే వామనదేవ. కావున మీరు ఉపేంద్ర, ఉపేంద్ర లేదా అటువంటి పేరును పిలిస్తే ఆ పేరుని పరిగణిస్తారు. కావున అది తరువాత వివరించబడుతుంది.