TE/Prabhupada 0017 - ఆధ్యాత్మిక శక్తి మరియు భౌతిక శక్తి



Lecture on Sri Isopanisad, Mantra 1 -- Los Angeles, May 2, 1970

కావున ఈ భౌతిక ప్రపంచంలో రెండు శక్తులు పని చేస్తున్నాయి. ఆధ్యాత్మిక శక్తి మరియు భౌతిక శక్తి. ఈ విధమైన ఎనిమిది భౌతిక అంశాలను భౌతిక శక్తి అని అంటారు. భూమిర్ ఆపో నలో వాయుః ( BG 7.4) భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, మరియు అహంకారం. ఇవన్నీ భౌతికమైనవి. మరియు అదే విధంగా, సూక్ష్మముగా, సూక్ష్మముగా, సూక్ష్మముగా, మరియు స్థూలంగా, స్థూలంగా, స్థూలంగా. ఏ విధంగా నీరు భూమి కన్నా సూక్ష్మమైనది, అలానే అగ్ని నీరు కన్నా సూక్ష్మమైనది. అప్పుడు గాలి అగ్ని కన్నా సూక్ష్మమైనది, అప్పుడు ఆకాశం అగ్ని కన్నా సూక్ష్మమైనది. అదే విధంగా, మనస్సు ఆకాశం కన్నా సూక్ష్మమైనది, లేదా మనస్సు ఆకాశం కన్నా సూక్ష్మమైనది మనస్సు ..మీకు తెలుసు, నేను చాలా సార్లు మనస్సు యొక్క వేగం గురించి ఉదాహరణ చెప్పాను. ఒక్క క్షణంలో చాలా వేల మైళ్ళు వెళ్ళగలదు. కావున అది అంత సూక్ష్మమైతే , అది బలమైనది అవుతుంది. అదే విధంగా, చివరికి, మీరు ఆధ్యాత్మిక భాగానికి వస్తే, సూక్ష్మమైనది, దేని నుంచి అయితే ప్రతి ఒక్కటీ పుడుతోందో, ఓహ్, అది చాలా శక్తిమంతమైనది. అది ఆధ్యాత్మిక శక్తి. అది భగవద్గీత లో చెప్పబడింది. ఆ ఆధ్యాత్మిక శక్తి ఏంటి ? ఆ ఆధ్యాత్మిక శక్తి ఈ జీవం ఉన్న ప్రాణి. అపరేయం ఇతః తు అన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ ( BG 7.5) కృష్ణుడు చెప్తాడు, "ఇవన్ని భౌతిక శక్తులు, వీటిని మించి మరొక ఆధ్యాత్మిక శక్తి ఉంది." అపరేయం. అపర అనగా తక్కువ. అపరేయం. ఇవి అన్ని భౌతిక అంశాలుగా వివరించ బడ్డాయి, అవి తక్కువ స్థాయి శక్తులు. మరియు వీటిని మించి ఉన్నతమైన శక్తి ఉంది, ప్రియమైన అర్జునా. ఏంటి అది? జీవ-భూత మహా-బాహో: "ఈ ప్రాణ జీవులు." అవి కూడా శక్తే. మనము కూడా శక్తే, కానీ ఉన్నతమైన శక్తి. ఎలా ఉన్నతమైన వాళ్ళు? ఎందుకంటే యయేదం ధార్యతే జగత్ ( BG 7.5) ఉన్నతమైన శక్తి తక్కువ స్థాయి శక్తి ని నియంత్రిస్తుంది. పదార్థానికి ఎటువంటి శక్తి లేదు. పెద్ద విమానం, మంచి యంత్రం, గాలి లో ఎగురుతోంది, అది భౌతిక వస్తువులతో తయారు చేయబడింది. కానీ ఆధ్యాత్మిక శక్తి, పైలట్ లేకపోతే అది పనికి రాదు. అది పనికి రాదు. వేల సంవత్సరాలు జెట్ విమానం విమానాశ్రయం లో నిలిచి పోతుంది. చిన్న ఆధ్యాత్మిక శక్తి వచ్చి తగిలేంత వరకు అది విహరించలేదు. కావున భగవంతుడిని అర్థం చేసుకోవడానికి కష్టం ఏమిటి? కావున ఒక సహజమైన విషయం, ఏంటంటే ఈ పెద్ద యంత్రము.. మరియు చాలా పెద్ద యంత్రాలు, ఆధ్యాత్మిక శక్తి తగలకుండా. అవి ముందుకి కదలవు ఒక మనిషి అయినా కానీ లేదా జీవం ఉన్న ప్రాణి. మీరు ఈ భౌతిక ప్రపంచం అంతా ఎవరి నియంత్రణ లేకుండా ఎలా నడుస్తుంది అని మీరు ఎలా ఆశిస్తారు. మీరు ఆ విధంగా వాదనలు ఎందుకు చేస్తారు? అది సాధ్యం కాదు.

అందువలన తక్కువ బుద్ధి కలిగిన వ్యక్తులు, వారు ఈ భౌతిక ప్రపంచం మహోన్నతమైన భగవంతునిచే నియంత్రించ బడుతోంది అని అర్థం చేసుకోరు.