TE/Prabhupada 0020 - కృష్ణుని అర్థం చేసుకోవడం అంత సులభతరం కాదు
(Redirected from TE/Prabhupada 0020 - కృష్ణుని అర్ధం చేసుకోవడం అంత సులవతరం కాదు)
Arrival Lecture -- Miami, February 25, 1975
కృష్ణుని అర్థం చేసుకోవడం అంత సులువైన విషయం కాదు.
- manuṣyāṇāṁ sahasreṣu
- kaścid yatati siddhaye
- yatatām api siddhānāṁ
- kaścid vetti māṁ tattvataḥ
- (BG 7.3)
కొన్ని వేల, లక్షల మనుషుల నుండి, ఏ ఒక్కడికో తన జీవితం విజయవంతం ఎలా చేసుకోవాలో అన్న ఆసక్తి ఉంటుంది. ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదు. నిజజీవితంలో వారికి జీవితం యొక్క విజయం ఏంటో తెలియదు. ఆధునిక నాగరికత, అందరూ అనుకుంటున్నారు, నాకు ఒక మంచి భార్య మరియు మంచి వాహనం మరియు మంచి ఇల్లు వుంటే చాలు, అదే విజయం. అది విజయం కాదు. అది తాత్కాలికం. నిజమైన విజయం ఏంటంటే మాయ బంధములలో నుంచి బయటకు రావడం, అనగా ఈ భౌతిక నిబంధనలతో కూడిన జీవితంలో ఉన్న పుట్టుక, మరణం, ముసలితనం మరియు వ్యాధి. మనము జీవితం యొక్క చాలా రకాలను చూస్తున్నాం, మరియు ఈ మనిషి జన్మ మంచి అవకాశం ఈ గొలుసు ప్రక్రియ అయిన శరీరం మార్పు ఒకదాని తర్వాత ఇంకొకదానికి మారడం నుండి బయటకు రావడానికి. ఆత్మ శాశ్వతము అయినది మరియు పరమానందం అయినది ఎందుకంటే అది కృష్ణుని యొక్క అంతర్భాగము అయినది. సత్-చిత్-ఆనంద, శాశ్వతము, పరిపూర్ణమైన పరమానందం, పరిపూర్ణమైన జ్ఞానం. దురదృష్టవశాత్తు ఈ భౌతిక, బద్ధ జీవితంలో మనము చాలా రకాల శరీరాల్ని మారుస్తూ ఉంటాం. కానీ మనము ఆ ఆధ్యాత్మిక స్థాయిని పొందలేక ఉన్నాం ఎక్కడైతే పుట్టుక మరియు మరణం ఉండదో. ఎటువంటి శాస్త్రం లేదు. ఒకరోజు ఒక మానసిక వైద్యుడు నన్ను చూడడానికి వచ్చాడు. మరియు ఆత్మను అర్థం చేసుకోవడానికి మీ విద్య ఎక్కడ ఉంది, మీ సహజమైన స్థానం? కావున నిజంగా ఈ ప్రపంచమంతా చీకటిలో ఉంది. వాళ్ళు యాభై, అరవై లేదా వందల ఏళ్ళు జీవించడం పై ఆసక్తి చూపిస్తున్నారు, కానీ వాళ్ళకి తెలియదు మనము శాశ్వతం, పరమానందం మరియు పరిపూర్ణమైన జ్ఞానం కలవారం అని. మరియు ఈ భౌతిక శరీరం వలన మనము జననం, మరణం, ముసలి తనం మరియు వ్యాధి పొందుతున్నాం అని. మరియు ఇది అలాగే కొనసాగుతోంది అని.
కావున శ్రీ చైతన్య మహాప్రభు, పతనము అయిన ఆత్మల మీద చాలా జాలితో ఆయన అవతరించాడు. కృష్ణుడు కూడా వస్తాడు. కానీ కృష్ణ అంత ఔదార్యముగా ఉండడు. కృష్ణ మొదట నిబంధన పెడతాడు "మొదట నువ్వు నాకు శరణాగతి పొందు. అప్పుడు నేను నీ గురించి చూసుకుంటాను." కానీ చైతన్య మహాప్రభు కృష్ణుని కన్నా చాలా జాలి కలిగినవాడు, కృష్ణ మరియు చైతన్య మహాప్రభు ఒక్కరే అయినప్పటికీ. కావున చైతన్య మహాప్రభు యొక్క జాలి వలన మనము కృష్ణుని చాలా సులువుగా అర్థం చేసుకుంటున్నాం. చైతన్య మహాప్రభు ఇక్కడ ఉండడం వలన. నువ్వు ఆయనను పుజిస్తావు. అది చాలా కష్టం కాదు. Yajñaiḥ saṅkīrtanaiḥ prāyair yajanti hi su-medhasaḥ. Kṛṣṇa-varṇaṁ tviṣākṛṣṇaṁ sāṅgopāṅgāstra-pārṣadam, yajñaiḥ saṅkīrtanam ( SB 11.5.32) మీరు కేవలం హరే కృష్ణ మంత్రాన్ని జపించండి, మరియు మీరు చేయగలిగినంత మీరు చైతన్య మహాప్రభు కు ఇవ్వండి. ఆయన చాలా జాలివంతుడు. ఆయన అపరాధముగా తీసుకోడు. రాధా-కృష్ణుని పూజించడం కొంచెం కష్టం. మనము ఆయనను గొప్ప గౌరవం తో పూజించాలి. కానీ చైతన్య మహాప్రభు స్వచ్చందంగా పతనము అయిన ఆత్మలు కొరకు వచ్చాడు. కొంచెం సేవ. ఆయన సంతృప్తి చెందుతాడు. ఆయన సంతృప్తి చెందుతాడు. కానీ అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఆయన చాలా దయ మరియు జాలి కలిగినవాడు అని, దాని అర్థం మనము ఆయన స్థానం మరిచిపోకూడదు. ఆయన మహోన్నతమైన భగవంతుని స్వరూపం. కావున మనము ఆయనకు చాలా మర్యాద ఇవ్వాలి. కానీ లాభం ఏంటంటే చైతన్య మహాప్రభు ఎటువంటి అపరాధమును తీసుకోడు. మరియు ఆయనను పూజించడం, సంతృప్తి పరచడం, చాలా సులభం. యజ్ఞైః సంకీర్తనైః ప్రాయైర్ యజంతిః సు-మేధసః. కేవలం మీరు హరే కృష్ణ మంత్రాన్ని జపించండి మరియు నృత్యం చెయ్యండి, మరియు చైతన్య మహాప్రభు చాలా సంతోషం పొందుతారు. ఆయన ఈ నృత్యం మరియు జపించడం ప్రారంభించారు, మరియు ఇది సులభమైన ప్రక్రియ భగవంతుడు గురించి తెలుసుకోవడానికి. కావున వీలయినంతవరకు.. వీలయితే, ఇరవై నాలుగు గంటలు. అది సాధ్యం కాకపోతే, నాలుగు, ఆరు సార్లు అయినా, హరే కృష్ణ మంత్రాన్ని చైతన్య మహాప్రభు ఎదురుగా జపించండి, మరియు మీ జీవితంలో విజయం పొందుతారు. ఇది సత్యము.