TE/Prabhupada 0023 - మరణానికి ముందే కృష్ణ చైతన్య వంతులు అవ్వండి



Sri Isopanisad Invocation Lecture -- Los Angeles, April 28, 1970

కావున ఇక్కడ చెప్పబడింది విశ్వానికి దాని సొంత సమయం కలిగి ఉంది అది పరిపుర్ణమైన శక్తి చేత నిర్ణయించబడింది అని. విశ్వం కూడా చాలా పెద్ద పదార్థం, భౌతిక పదార్థం. అంతే. మీ శరీరం వలె; ప్రతి ఒక్కటి పరస్పర సంబంధం కలిగినవి. ఆధునిక విజ్ఞానం, సాపేక్ష సిద్ధాంతం. ఒక అణువు, ఒక చిన్న కణము, చిన్న చీమ, కావున దానికి పరస్పర సంబంధం అయిన జీవితం ఉంది, మీకు కూడా పరస్పర సంబంధమైన జీవితం ఉంది. అదేవిధంగా ఈ భూతమంతటి విశ్వం కూడా, ఈ విశ్వం కొన్ని మిలియన్ సంవత్సరాలు ఉండవచ్చు, కానీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. అది యదార్ధం. అది చాలా పెద్దది కాబట్టి, కొన్ని మిలియన్ సంవత్సరాలు ఉండవచ్చు, కానీ అది అంతం అవుతుంది. అది ప్రకృతి యొక్క సిద్ధాంతం. మరియు ఆ కాలం ముగిసినప్పుడు, ఈ తాత్కాలిక ఆవిర్భావం నాశనం అవుతుంది. పరిపూర్ణమైన, మహోన్నతమైన పరిపూర్ణమైన కృష్ణుని చేత పరిపూర్ణంగా ఏర్పాటు చేయబడుతుంది. మీ సమయం పూర్తి అయినప్పుడు, ఎక్కువ సేపు ఈ శరీరంలో ఎంత మాత్రం ఉండరు. ఎవ్వరూ తనిఖీ చెయ్యలేరు. ఏర్పాటు చాలా శక్తివంతమైంది. మీరు చెప్పలేరు, "నన్ను ఉండనివ్వండి అని." నిజానికి అది జరిగింది. నేను ఇండియా, అలహాబాద్ లో ఉన్నప్పుడు, మాకు బాగా తెలిసిన ఒక స్నేహితుడు, చాలా ధనవంతుడు. అతను చనిపోతున్నాడు. అప్పుడు అతను డాక్టర్ ను అభ్యర్తిస్తున్నాడు, "మీరు నాకు కనీసం ఇంకో నాలుగు సంవత్సరాలు జీవించడానికి ఇవ్వలేరా? చూడండి, నాకు ఒక ప్రణాళిక ఉంది. నేను పూర్తి చేయలేకపోయాను." మీరు చూడండి. ఆస-పస-సతైర్ బద్ధః ( BG 16.12) ఇది అతీంద్రియమైనది. ఇలా ప్రతి ఒక్కరు అనుకుంటారు "ఓహ్, నేను ఇది చెయ్యాలి. నేను అది చెయ్యాలి." లేదు. వైద్యులు లేదా వైద్యులతండ్రులు లేదా వారి తండ్రి, ఏ శాస్త్రవేత్త అపలేరు. ఓహ్, లేదు, నాలుగు సంవత్సరాలు కాదు. కేవలం నాలుగు నిముషాలు కూడా కుదరదు, తక్షణమే మీరు వెళ్లిపోవాలి. ఇది చట్టం. కావున ఆ క్షణం వచ్చే ముందే, ఒకరు కృష్ణ చైతన్యం గురించి తెలుసుకోవడానికి చాలా తెలివిగలవారు అయ్యి ఉండాలి. తూర్ణం యతేత. తూర్ణం అనగా చాలా త్వరగా, చాలా త్వరగా మీరు కృష్ణ చైతన్యం గురించి తెలుసుకోవాలి. అను...తరువాత, మరణం ముందు, మరణం వస్తుంది, మీరు మీ కార్యాలను పూర్తి చెయ్యాలి. అది బుద్ధి. లేదా అది అపజయం. కృతజ్ఞతలు.