TE/Prabhupada 0024 - కృష్ణుడు చాలా దయ కలిగిన వాడు



Lecture on SB 3.25.26 -- Bombay, November 26, 1974

అర్జునుడు కృష్ణుడిని ముఖాముఖిగా చూస్తున్నప్పుడు - కృష్ణుడు భగవద్గీత బోధిస్తూ ఉన్నాడు - ఏంటంటే కృష్ణుని చూడడం మరియు భగవద్గీత చదవడం రెండూ ఒకటే, ఎటువంటి తేడా లేదు. కొంతమంది ఇలా చెప్తారు "అర్జునుడు చాలా అదృష్టవంతుడు కృష్ణుడిని ముఖాముఖిగా చూస్తూ బోధనలను తీసుకున్నాడు అని." అది సరైనది కాదు. మీకు చూడడానికి కళ్ళు వుంటే, కృష్ణుని వెనువెంటనే చూడవచ్చు. అందువలన ఇది చెప్పబడింది, ప్రేమాంజన-చ్చురిత.. ప్రేమ మరియు భక్తి, ఒకటే. ప్రేమాంజన-చ్చురిత-భక్తి-విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి [Bs. 5.38]. దీనికి సంబంధించిన ఒక కథను మీకు వినిపిస్తాను, ఏంటంటే దక్షిణ భారతంలో ఒక బ్రాహ్మణ రంగనాథ ఆలయంలో, భగవద్గీత చదువుతూ ఉన్నాడు. మరియు అతను అక్షర జ్ఞానం లేని వాడు. అతనికి ఒక్క అక్షరం కానీ సంస్కృతం కానీ తెలియదు, విద్యలేని వాడు. అక్కడ పొరుగున ఉండే వారికి తెలుసు "అతను అక్షర జ్ఞానం లేని వాడు అని, మరియు భగవద్గీత చదువుతూ ఉన్నాడు అని." అతను "ఉహ్,ఉహ్," అంటూ ఆ విధంగా భగవద్గీతను తెరుస్తున్నాడు. సరే, బ్రాహ్మణ, నువ్వు భగవద్గీతను ఎలా చదువుతున్నావు అంటూ అతన్ని కొంత మంది హాస్యం చేసారు. నాకు అక్షర జ్ఞానం లేదు కాబట్టి వీరు నన్ను హాస్యం చేస్తున్నారు అని అతనికి అర్థం అయ్యింది. ఈ విధంగా, ఆ రోజు రంగనాథ ఆలయంలో చైతన్య మహాప్రభు కూడా వచ్చి ఉన్నారు, మరియు "ఇతను భక్తుడు" అని ఆయన అర్థం చేసుకోగలిగారు. కావున ఆయన అతని దగ్గరికి వెళ్లి ఇలా అడిగారు, "నా ప్రియమైన బ్రాహ్మణా, నువ్వు ఏమి చదువుతున్నావు?" ఈ మనిషి నా పై హాస్యం చేయడం లేదు అని తను అర్థం చేసుకున్నాడు. అందుకు అతను చెప్పాడు, "నేను అక్షర జ్ఞానం లేని వాడిని, భగవద్గీత చదువుతున్నాను, భగవద్గీత చదవడానికి ప్రయత్నిస్తున్నాను. నా గురు మహారాజ చెప్పారు 'నన్ను ప్రతి రోజు పద్దెనిమిది అధ్యాయాలు చదువు అని.' కానీ నాకు జ్ఞానం లేదు. నేను చదవలేను. అయినప్పటికీ, గురు మహారాజ చెప్పారు కాబట్టి ఆయన ఆజ్ఞను ఆచరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మరియు పేజీలను తెరుస్తున్నాను, అంతే. దాన్ని ఎలా చదవాలో నాకు తెలియదు." నేను చూసాను నువ్వు కొన్ని సార్లు ఏడుస్తున్నావు, అని చైతన్య మహాప్రభు అన్నారు, అప్పుడు, "అవును, నేను ఏడుస్తున్నాను." నువ్వు చదవలేకపోతే ఎలా ఏడుస్తున్నావు? లేదు, ఎందుకంటే నేను భగవద్గీత పుస్తకం తీసుకున్నప్పుడు, ఒక చిత్రం చూస్తాను, అది ఏంటంటే కృష్ణుడు చాలా దయకలిగిన వాడు వలన ఆయన అర్జునుడు రథసారథి స్థానాన్ని తీసుకున్నాడు. అర్జునుడు కృష్ణుని భక్తుడు. కావున శ్రీ కృష్ణుడు చాలా దయతో సేవకుని స్థానాన్ని అంగీకరించాడు. ఎందుకంటే, "నా రథాన్ని ఇక్కడ పెట్టు," అని అర్జునుడు ఆజ్ఞ ఇస్తుంటే కృష్ణుడు అతనికి సేవ చేస్తున్నాడు. కావున కృష్ణుడు చాలా దయ కలిగిన వాడు. ఎప్పుడైతే ఈ చిత్రాన్ని నా మనస్సులో చూస్తానో నేను ఏడుస్తాను." అప్పుడు చైతన్య మహాప్రభు అతన్ని వెంటనే ఆలింగనం చేసుకొని నువ్వు భగవద్గీత చదువుతున్నావు అని అన్నారు. ఎటువంటి విద్య లేకుండా, నువ్వు భగవద్గీత చదువుతున్నావు." ఆయన అతన్ని ఆలింగనం చేసుకున్నారు.

కావున ఇది....అతను ఆ చిత్రాన్ని ఏ విధంగా చుస్తూ వున్నాడు? ఎందుకంటే అతను కృష్ణుని ప్రేమికుడు కాబట్టి, అతను ఈ శ్లోకాలు చదవగలడా లేదా అన్నది విషయం కాదు. కానీ అతను కృష్ణుని ప్రేమలో నిండిపోయి ఉన్నాడు మరియు అతను చూస్తున్నాడు, ఇది అవసరం కృష్ణుడు అక్కడ కూర్చుని ఉన్నాడు, మరియు అర్జునుడి రథాన్ని నడుపుతూ వున్నాడు