TE/Prabhupada 0025 - నీవు యథార్థ వస్తువుని ఇచ్చినప్పుడు, అది పనిచేయును



Conversation with Yogi Amrit Desai of Kripalu Ashram (PA USA) -- January 2, 1977, Bombay

యోగి అమృతదేశాయ్ : నేను మీ పట్ల చాలా ప్రేమను కలిగివున్నాను. నేను చెప్పాను, నేను ఖచ్చితంగా దర్శనానికి రావాలి అని .

ప్రభుపాద: కృతజ్ఞతలు.

యోగి అమ్రిత్ దేశాయ్: నేను మీ గురించి భక్తులకు చెప్తూ వున్నాను ఏంటంటే మీరు.. ప్రభుపాద: మీరు Dr.మిశ్రా తో వున్నారా?

యోగి అమ్రిత్ దేశాయ్: లేదు, నేను లేను. నేను ఇక్కడ ఉన్న భక్తులు అందరికి చెప్తున్నాను. నేను చెప్పాను పశ్చిమానికి, ఎక్కడైతే భక్తి చాలా అవసరమో అక్కడికి భక్తి తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ ప్రభుపాద. ఎందుకంటే అక్కడ వారు వాళ్ళ బుర్రలో చాలా కలిగి ఉన్నారు ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఈ ప్రేమ యొక్క మార్గం చాలా లోతైనది. ప్రభుపాద: చూడండి. మీరు ఒక నిజమైన దాన్ని ప్రచారము చేస్తే

యోగి అమ్రిత్ దేశాయ్: చాలా నిజమైనది. ప్రభుపాద: దాన్ని గ్రహిస్తారు.

యోగి అమ్రిత్ దేశాయ్: నిజమైనది కాబట్టే అది చాలా చక్కగా పెరుగుతూ ఉంది. ప్రభుపాద: మరియు వారికీ నిజమైనది ఇవ్వడం భారతీయుల యొక్క కర్తవ్యం. అది పర-ఉపకార. నా ముందు వెళ్ళిన యోగులు మరియు స్వాములు వారిని మోసం చేయడానికి వెళ్లారు.

యోగి అమ్రిత్ దేశాయ్: లేదు, సత్యాన్ని చెప్పడానికి వారు భయపడ్డారు ఎందుకంటే వారిని అంగీకరించరు అని భయపడ్డారు . ప్రభుపాద: వాళ్ళకి సత్యం అంటే ఏంటో తెలియదు.(నవ్వులు) భయం కాదు. ఎందుకు? ఒకరు సత్యం అనే వేదిక మీద వుంటే, ఎందుకు భయపడాలి?

యోగి అమ్రిత్ దేశాయ్: అంగీకరిస్తున్నాను. ప్రభుపాద: వారికీ తెలియదు సత్యం ఏంటో, వివేకానంద నుంచి మొదలకుని.

యోగి అమ్రిత్ దేశాయ్: అవును నిజం, మొదటి నుంచి. చూడండి, మీరు వచ్చిన తరువాత... నేను 1960 లో ఉన్నాను. నేను యోగ బోధిస్తూ ఉన్నాను. కానీ మీరు వచ్చిన తరువాత నేను భయం లేకుండా భక్తిని బోధిస్తూ మరియు మంత్రాలు జపిస్తున్నాను. అందువలన ఇప్పుడు ఆశ్రమంలో మనకు చాలా భక్తి ఉంది, చాలా భక్తి. మరియు నేను మీకు ఆ గౌరవం ఇచ్చాను ఎందుకంటే వారికి ఇవ్వడానికి నేను భయపడ్డాను. ఎందుకంటే నేను అనుకున్నాను, "వారు క్రైస్తవులు. వాళ్ళు ఎక్కువ భక్తిని ఇష్టపడరు. వారు అపార్థం చేసుకుంటారు. కానీ మీరు అద్బుతం చేసారు, భగవంతుడు కృష్ణుడు, మీ చేత అద్బుతం చేయించాడు. అది చాలా ఆశ్చర్యకరం, భూమి మీద గొప్ప అద్భుతం. నేను చాలా గట్టిగా అనుభూతి చెందుతాను దాని గురించి. ప్రభుపాద: మీరు చాలా దయతో ఈ వాక్యం అన్నారు. మనము నిజమైనది ఇస్తే, అది పని చేస్తుంది.

యోగి అమ్రిత్ దేశాయ్: అవును. నేను కూడా అదే చేస్తున్నాను. ప్రతి ఒక్కరు.. ఆశ్రమంలో 180 మంది బ్రహ్మచారులు శాశ్వతంగా ఉండే వారు ఉన్నారు. వారు అందరూ ఆచరణాత్మకముగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు ప్రతి ఒక్కరు ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేస్తారు, మరియు తొమ్మిది గంటలకు నిద్ర పోతారు. మరియు వారు ఒకరిని ఒకరు తాకరు కూడా. వారు వేరు వేరు గదులలో నిద్రిస్తారు. సత్-సంగ లో కూడా వారు వేరు గా కూర్చుంటారు. ప్రతి ఒక్కటి చాలా నియమంగా ఉంటుంది. మత్తు పదార్థములు, మద్యపానం, మాంసం, టీ, కాఫీ, వెలుల్లి, ఉల్లిపాయ ఇవేమీ తీసుకోరు. పవిత్రముగా ఉంటారు. ప్రభుపాద: చాలా మంచిది. అవును. మేము కూడా ఇదే పాటిస్తున్నాము.

యోగి అమ్రిత్ దేశాయ్: అవును. ప్రభుపాద: కానీ మీ దగ్గర ఏదైనా భగవంతుని అర్చామూర్తి వుందా?

యోగి అమ్రిత్ దేశాయ్: ఉంది. కృష్ణుడు మరియు రాధా మా అర్చామూర్తులు నా గురు స్వామి కృపాలు-ఆనంది. ఆయనకు బరోడా దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది. ఆయన ఇరవై ఏడు సంవత్సరాలు తన సాధనను చేసి, మరియు పన్నెండు సంవత్సరాలు పూర్తి మౌనం పాటించారు. గత కొద్ది సంవత్సరములుగా ఆయన ప్రజల కోరిక మేరకు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాట్లాడుతున్నారు. ప్రభుపాద: ఆయన జపం చేయడం లేదా?

యోగి అమ్రిత్ దేశాయ్: ఆయన జపం చేస్తారు. ఆయన మౌనంగా ఉన్నప్పుడే జపం అనుమతించబడింది. ఎందుకంటే ఆయన చెప్తారు.. మీరు భగవంతుడి పేరు చెప్పినప్పుడు, అది మౌనాన్ని విరమించినట్టు కాదు. కావున ఆయన జపం చేస్తారు. ప్రభుపాద: మౌనం అంటే పనికిరానివి మాట్లాడక పోవడం. హరే కృష్ణను జపించడం. అది మౌనం. ఈ భౌతిక విషయాలు గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేయడం కన్నా, హరే కృష్ణ మంత్రాన్ని జపం చేద్దాం. అది అనుకూలమైనది. మరియు మౌనం ప్రతికూలమైనది. అర్థంలేనివి మాట్లాడకండి. అర్థం వచ్చేవి మాట్లాడండి.

యోగి అమ్రిత్ దేశాయ్: అవును! అది నిజం. ప్రభుపాద: పరం దృష్ట్య్వా నివర్తతే ( BG 2.59) పరం దృష్ట్య్వా నివర్తతే. ఎప్పుడైతే ఒకరు తన అర్థంలేని వాటిని నిలిపి వేస్తారో, అప్పుడు పరం, మహోన్నతుడు... పరం దృష్ట్య్వా నివర్తతే. మీ దగ్గర మంచివి వుంటే, సహజంగానే ఉపయోగం లేని వాటిని విడిచి పెడతారు. కావున భౌతికమైంది ఏదైనా, అది ఉపయోగం లేనిది. కర్మ, జ్ఞాన యోగ అవి అన్ని భౌతిక మైనవి. కర్మ, జ్ఞాన, యోగ. యోగాలుగా చెప్పబడే ఇవి అన్నీ కూడా భౌతికమైనవే