TE/Prabhupada 0030 - కృష్ణుడు కేవలం ఆనందిస్తున్నాడు



Sri Isopanisad, Mantra 2-4 -- Los Angeles, May 6, 1970

భగవంతుడు, ఆయన నివాసంలోనే ఉన్నా, ఆయన తన మనస్సు కంటే చాలా వేగవంతమైవాడు. మరియు ఇతరుల పరుగులో ఓడిస్తారు. శక్తిమంతమైన దేవతలు ఆయన దరికి రాలేరు. ఒకే చోట ఉన్నప్పటికీ, వాయువును మరియు వర్షమును ఇచ్చే వారిని అదుపు చేయగలడు. వాళ్ళందరని శ్రేష్టతలో అధిగమిస్తాడు. బ్రహ్మ-సంహిత లో కూడా ఇది ధ్రువీకరించబడింది: గోలోక ఏవ నివసతి అఖిలాత్మ-భూతః (Bs 5.37) కృష్ణ, ఎల్లప్పుడూ గోలోక వృందావనంలో ఉన్నా, అతను చేయడానికి ఏమీ ఉండదు. కేవలం అతను తన సహచరుల తోడుతో ఆనందిస్తుంటాడు. గోపికలతో, మరియు ఆవుల కాపరి అబ్బాయిలతో, అతని తల్లి, అతని తండ్రి. స్వేచ్ఛ, పూర్తిగా స్వేచ్ఛ కలిగి ఉన్నాడు, మరియు అతని సహచరులు, వారు మరింత స్వేచ్ఛగా వుంటారు. ఎప్పుడైనా సహచరులు ఆపదలో ఉంటే కనుక, వారిని ఎలా రక్షించాలి అన్న ఆత్రుత కృష్ణుడికి ఉంటుంది, కానీ సహచరులకు, ఎటువంటి ఆతురత వుండదు." ఓహ్ కృష్ణుడు వున్నాడు." చూడండి. (నవ్వులు) సహచరులు. వారికి ఎటువంటి ఆతురత చింత లేదు. ఏదైనా, ఏదైనా జరుగుతున్నా , మీరు కృష్ణ పుస్తకంలో చదవచ్చు- చాలా ప్రమాదాలు ఉన్నాయి బాలురు, కృష్ణునితో కలిసి, వారి ఆవులు మరియు దూడలతో బయటకు వెళ్ళేవారు మరియు ఆడవిలో యమునా నది తీరాన ఆడుకునేవారు, మరియు వాళ్ళని నాశనం చేయడానికి కంసుడు ఏదో ఒక రాక్షసుడిని పంపేవాడు. కావున మీరు చూసారు, మీరు చిత్రాలను కూడా చూస్తారు. వాళ్ళు కేవలం ఆనందిస్తూ వుంటారు ఎందుకంటే వారు చాలా నమ్మకంతో వున్నారు. అది ఆధ్యాత్మిక జీవితం. ఆవశ్య రక్షిబే కృష్ణ విశ్వాస పాలనా. ఈ బలమైన నమ్మకం, ఏంటంటే "ఎటువంటి ప్రమాదకరమైన స్థితి వచ్చినా, కృష్ణుడు నన్ను రక్షిస్తాడు," ఇది శరణాగతి పొందడము.

శరణాగతిలో ఆరు దశలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ఆధ్యాత్మిక సేవ కోసం ఉపయోగ పడే దాన్ని అంగీకరించాలి; ఆధ్యాత్మిక సేవ కోసం ఉపయోగం లేని ప్రతి దాన్ని తిరస్కరించాలి. మరియు తరువాత ఏంటంటే భగవంతుడి సహచరులతో మనల్ని పరిచయం చేసుకోవాలి. ఉదాహరణకు కృష్ణునికి చాలా మంది సహచరులు ఉన్న విధంగా, మీరు కూడా... కృత్రిమముగా కాదు. మీరు పవిత్రము అయితే, మీరు కృష్ణునితో మీ సంబంధాన్ని అర్థం చేసుకోగలరు. అప్పుడు మీరు మిమ్మల్ని ఆ సాంగత్యంతో పరిచయం చేసుకుంటే అప్పుడు తరువాత దశ ఏంటంటే "కృష్ణుడు నన్ను రక్షిస్తాడు." అనే నమ్మకము నిజానికి, ఆయన ప్రతి ఒక్కరినీ రక్షిస్తున్నాడు. అది సత్యం. కానీ మాయలో మనము అనుకుంటున్నాం మనమే మనల్ని రక్షించుకుంటున్నాము అని, మనమే మనల్ని పోషించుకుంటున్నాము. కాదు. అది సత్యం కాదు.