TE/Prabhupada 0033 - మహాప్రభువు పేరు పతిత పావనుడుMorning Walk -- October 4, 1975, Mauritius

పుష్ట కృష్ణ: ఈ రోజుల్లో ప్రభుత్వాలు అత్యంత దారుణమైన మరియు పాపకరమైన పనులును ప్రోత్సహిస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో మామూలు ప్రజలను ఏ విధంగా సంస్కరణ చెయ్యాలి?

ప్రభుపాద: మీరు ప్రభుత్వం సరిగా ఉంది అని చెబుతున్నారా?

పుష్ట కృష్ణ: లేదు.

ప్రభుపాద: మరి? వారు కూడా మారాలి. ఈ రోజుల్లో ప్రభుత్వం అనగా అందరూ మూర్ఖులు. మూర్ఖుల చేత ఎన్నుకోబడ్డ మూర్ఖులు. అది సమస్య. మీరు వెళ్ళిన ప్రతి చోట, మీరు మూర్ఖులనే కలుస్తారు మంద. మంద అని నిర్వచనం ఇచ్చారు వారికీ. మన శిబిరం లో కూడా చాలా మంది మూర్ఖులు ఉన్నారు. ఒకసారి నివేదిక చూడండి. వారు పవిత్రము అవ్వడానికి వచ్చినా, వారు మూర్ఖులు. ఆ వెధవ అలవాట్లను వాళ్ళు విడిచి పెట్టలేరు. కావున అది సాధారణీకరించబడింది, మంద: "అంతా చెడు". కానీ తేడా ఏంటి అంటే మన శిబిరం లో చెడ్డ వారు సంస్కరణ పొందుతున్నారు; బయట ఆ సంస్కరణ లేదు. ఇక్కడ వారు మంచిగా మారడానికి అవకాశం ఉంది, కానీ బయట అటువంటి నమ్మకము కూడా లేదు. అది తేడా. లేకపోతే ప్రతి ఒక్కరు చెడ్డ వాళ్ళే. ఎటువంటి పక్షపాతము లేకుండా మీరు చెప్పవచ్చు. మందః సుమంద -మతయో ( SB 1.1.10) ఇప్పుడు, ప్రభుత్వం మంచిగా ఎలా ఉంటుంది? ఇది కూడా చెడ్డగా ఉంది. మహాప్రభు పేరు వచ్చి పతిత-పావన; అతను చెడ్డవారిని అందరినీ ముక్తులను చేస్తున్నాడు. ఈ కలియుగములో మంచి వ్యక్తులు ఎవ్వరూ లేరు - అందరూ చెడ్డ వారె. మీరు చెడ్డ వాళ్ళందరితో వ్యవహరించడానికి బలవంతులుగా మారాలి