TE/Prabhupada 0034 - ప్రతి ఒక్కరూ ప్రామాణికుని నుండే జ్ఞానమును పొందుతారు, కానీ అది సాధారణ ప్రామాణికము



Lecture on BG 7.1 -- Durban, October 9, 1975


ఏడవ అధ్యాయం, భగవంతుని దివ్య జ్ఞానం. రెండు విషయాలు ఉన్నాయి, సంపూర్ణమైనది మరియు సాపేక్ష మైనది. ఈ ప్రపంచం సాపేక్ష మైనది. ఇక్కడ ఒక విషయమును ఇంకో విషయముతో సంబంధం లేకుండా అర్థం చేసుకోలేము. మనము ఇక్కడ కొడుకు అని చెప్పిన వెంటనే, అతను తండ్రిని కచ్చితంగా కలిగి ఉంటాడు. మనము ఇదిగో భర్త అని చెబితే, భార్య ఖచ్చితంగా ఉంటుంది. మనము ఇదిగో సేవకుడు అని చెబితే, యజమాని ఖచ్చితంగా ఉండాలి. మనము ఇదిగో వెలుతురు అని చెబితే, చీకటి ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని సాపేక్ష ప్రపంచం అంటారు. ఒకరు మరొక దానిని సాపేక్ష పదాలు ద్వారా అర్థం చేసుకోవాలి. కానీ ఇంకో ప్రపంచం ఉంది, అది ఏంటంటే సంపూర్ణమైన ప్రపంచం. అక్కడ యజమాని మరియు సేవకుడు, ఒక్కరే. ఎటువంటి తేడా లేదు. ఒకరు యజమాని మరియు ఇంకోకరు సేవకుడు అయినప్పటికీ, కానీ స్థానము ఒకటే.

కావున భగవద్గీత ఏడో అధ్యాయం సంపూర్ణ ప్రపంచం మరియు సంపూర్ణ మైన జ్ఞానం గురించి కొంచెం సూచన ఇస్తుంది. పరిపూర్ణమైన , మహోన్నతమైన, కృష్ణుడు చెప్పిన ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి. కృష్ణుడు సంపూర్ణమైన మహోనత్తమైన వ్యక్తి.

ఈశ్వరః పరమః కృష్ణః
సత్-చిత్-ఆనంద-విగ్రహః
అనాదిర్ ఆదిర్ గోవిందః
సర్వ-కారణ-కారణం
(Bs 5 1)

ఇది బ్రహ్మ చేత, చాలా ప్రామాణిక మైన ఆయన గ్రంథమైన బ్రహ్మ సంహితలో కృష్ణుడి గురించి ఆయన ఇచ్చిన నిర్వచనం. ఈ గ్రంథాన్ని శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారత దేశము నుండి సేకరించారు, మరియు ఆయన దక్షిణ భారతం నుండి తిరిగి వచ్చాక ఆ గ్రంథాన్ని తన భక్తులకు ఇచ్చారు. అందువలన ఈ బ్రహ్మ-సంహిత గ్రంథాన్ని చాలా ప్రామాణికమైనదిగా మేము తీసుకుంటాము. ఇది మేము జ్ఞానము నేర్చుకునే పద్ధతి. మేము జ్ఞానమును ప్రామాణికుల నుండి పొందుతాము. ప్రతి ఒక్కరూ ప్రామాణికుని నుండే జ్ఞానమును పొందుతారు, కానీ అది సాధారణ ప్రామాణికము. మరియు ప్రామాణికమును అంగీకరించే మా పద్ధతి కొంచెం వేరుగా ఉంటుంది. మా పద్ధతిలో ఒకరి ప్రామాణికాన్ని అంగీకరిస్తూన్నాము అంటే అతను అతని ముందు ఉన్న ప్రామాణికుని కూడా అంగీకరిస్తూన్నాడు. ఒకరు తనంతకు తనే ప్రామాణికుడు అవ్వలేడు. అది సాధ్యం కాదు. అప్పుడు అది లోపము కలిగినేది. కొడుకు తన తండ్రి నుంచి నేర్చుకుంటాడు అన్న ఉదాహరణ నేను చాలా సార్లు ఇచ్చాను. కొడుకు తండ్రిని అడుగుతాడు, "తండ్రి, ఈ యంత్రం ఏంటి? అప్పుడు తండ్రి చెప్తాడు, "నా ప్రియమైన పుత్రుడా, దాన్ని మైక్రోఫోన్ అని అంటారు ." కావున కొడుకు తన తండ్రి దగ్గర నుండి జ్ఞానాన్ని పొందుతాడు, "ఇది మైక్రోఫోన్ అని." కావున కొడుకు వేరే వారికి, "ఇది మైక్రోఫోన్ అని చెప్పినప్పుడు, అది సత్యము. అతను చిన్నవాడు అయినప్పట్టికీ, అతనికి జ్ఞానము ప్రామాణికుని నుంచి వచ్చినది కాబట్టి, అతను చెప్పినది సత్యము. అదేవిధంగా, మనము తీసుకునే జ్ఞానము ప్రామాణికము అయినప్పుడు, నేను చిన్నవాడిని అవ్వచ్చు, కానీ నేను చెప్పేది సత్యము. ఇది జ్ఞానము పొందే మా పద్ధతి. మేము జ్ఞానాన్ని తయారు చెయ్యము. ఆ పద్ధతి భగవద్గీత నాలుగో అధ్యాయములో చెప్పబడింది,

ఏవం పరంపరా-ప్రాప్తం ఇమం రాజర్సయో విధుః ( BG 4 2) ఇది పరంపర విధానము.

ఇమం వివస్వతే యోగం
ప్రోక్త్వాన్ అహం అవ్యయం
వివస్వాన్ మనవే ప్రహ
మనుర్ ఇక్స్వాకవే బ్రవీత్
( BG 4 1)

ఏవం పరంపర. కావున పరిపూర్ణమైన జ్ఞానము పరిపూర్ణమైన వ్యక్తి నుండి విన్నప్పుడు మనము తెలుసుకోవచ్చు. పరిపూర్ణమైన జ్ఞానము గురించి ఈ సాపేక్ష ప్రపంచంలో మనకు చెప్పలేరు. అది సాధ్యము కాదు. కావున ఇక్కడ మనము పరిపూర్ణమైన ప్రపంచం గురించి అర్థం చేసుకుంటున్నాము. పరిపూర్ణమైన జ్ఞానము, మహోన్నతమైన వ్యక్తి నుండి, పరిపూర్ణమైన వ్యక్తి. పరిపూర్ణమైన వ్యక్తి అనగా అనాదిర్ ఆదిర్ గోవిందః (Bs 5.1) అతను ఆది పురుషుడు, కానీ అతనికి ఆది లేదు; కావున అతను పరిపూర్ణమైన వాడు. ఆయన ఒకరి ద్వారా వచ్చాడు అని అర్థం చేసుకోకూడదు. ఆయన భగవంతుడు. కావున ఇక్కడ ఈ అధ్యాయములో, అందువలన, ఈ విధంగా చెప్పబడింది, శ్రీ భగవాన్ ఉవాచ, పరిపూర్ణమైన వ్యక్తి. భగవాన్ అనగా ఎవ్వరి మీద ఆధారపడని సంపూర్ణమైన వ్యక్తి.