TE/Prabhupada 0036 - మన జీవిత లక్ష్యం
Lecture on BG 2.1-11 -- Johannesburg, October 17, 1975
మనము ఈ భౌతిక వ్యవహారాలు గురించి తికమక చెందినప్పుడు, ఏమి చెయ్యాలి - ఏమి చెయ్యాలి లేదా ఏది చేయకూడదు, ఇది ఉదాహరణ- ఆ సందర్బంలో మనము గురువును సంప్రదించాలి. ఇక్కడ ఉన్న సూచన అది, మనము చూస్తున్నాము. ప్రచ్ఛామి త్వం ధర్మ- సమ్మూఢ-చేతః. మనము ఆందోళన చెందినప్పుడు, మనము ఏది ధార్మికమైనదో మరియు ఏది ధార్మికమైనది కాదో భేదం గుర్తించలేము. మన స్థానాన్ని సరిగా ఉపయోగించలేము. అది కార్పణ్య-దోసోపహత-స్వభావః ( BG 2. 7) అటువంటి సందర్భములో గురువు అవసరం ఉంది. ఇది వేదము యొక్క సూచన. తద్-విజ్ఞానార్థం స గురుం ఎవాభిగచ్చేత్ శ్రోత్రీయం బ్రహ్మ-నిష్ఠం (MU 1.2.12) ఇది కర్తవ్యం. ఇది నాగరికత, ఈ జీవిత సమస్యలను ఎన్నిటినో ఎదుర్కొంటూ ఉన్నాము. అది సహజం ఈ భౌతిక ప్రపంచంలో. ఈ భౌతిక ప్రపంచ జీవితం యొక్క సమస్యలు. పదం పదం యద్ విపదం ( SB 10.14.58) భౌతిక ప్రపంచం అంటే ప్రతి అడుగులో ప్రమాదం. అది భౌతిక ప్రపంచం అంటే. అందువలన మనము గురువు దగ్గర నుండి మార్గనిర్దేశం పొందాలి, గురువు దగ్గర నుంచి, మరియు ఆధ్యాత్మిక గురువు నుంచి పురోగతి ఎలా సాధించాలో తెలుసుకోవాలి, ఎందుకంటే.. అది మళ్ళీ వివరిస్తాను, మన జీవిత లక్ష్యం, ఈ మానవ జీవితంలో అయినా, ఈ ఆర్య నాగరికతలో, మన జీవిత లక్ష్యం మనము ఈ స్థానాన్ని అర్థం చేసుకోవడం, "నేను ఏంటి. నేను ఏంటి." మనము నేను ఏంటి అనేది అర్థం చేసుకోకపోతే, అప్పుడు నేను పిల్లులు మరియు కుక్కలతో సమానం. కుక్కలు, పిల్లులు, వాటికీ తెలియదు. అవి తాము శరీరము అని అనుకుంటాయి. అది వివరించబడుతుంది. కావున అటువంటి జీవన పరిస్థితిలో, మనము ఆందోళన చెందినప్పుడు... నిజానికి ప్రతి క్షణం మనము ఆందోళన చెందుతున్నాం. అందువలన ఒక సరైన గురువును సంప్రదించడం ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు అర్జునుడు కృష్ణుని సంప్రదిస్తున్నాడు, అత్యంత శ్రేష్టమైన గురువు. అత్యంత శ్రేష్టమైన గురువు. గురువు అనగా మహోన్నతమైన భగవంతుడు. ప్రతి ఒక్కరికి ఆయన గురువు, పరమ-గురు. కావున కృష్ణుని ప్రాతినిధ్యం వహించుతున్న వారు ఎవరైనా సరే, అతను కూడా గురువు. అది నాలుగవ అధ్యాయం లో వివరించబడుతుంది. ఏవం పరంపరా-ప్రాప్తం ఇమం రాజర్సయో విదుః ( BG 4.2) అందువలన కృష్ణుడు ఉదాహరణ చూపిస్తున్నాడు, ఎక్కడ మనము శరణాగతి పొందాలి మరియు గురువును అంగీకరించాలి అని. కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మీరు కృష్ణుని అంగీకరించాలి లేదా అతని ప్రతినిధిని గురువుగా అంగీకరించాలి. అప్పుడు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. లేకపోతే అది సాధ్యం కాదు, ఎందుకంటే అతను ఏది నీకు మంచో, ఏది నీకు చెడో చెప్పగలడు, అతను అడుగుతాడు, యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తత్ ( BG 2.7) నిశ్చితం . నీకు ఏదైనా సలహా అవసరమైతే,సూచన నిశ్చితం సంశయం లేని, ఎటువంటి భ్రమ లేని సూచన కావాలి అంటే, ఎటువంటి తప్పు లేకుండా, ఎటువంటి మోసము లేకుండా, దాన్ని నిశ్చితం అని అంటారు. అది నువ్వు కృష్ణుడి దగ్గర నుండి లేదా అతని ప్రతినిధి నుండి పొందవచ్చు. నువ్వు సరైన సమాచారాన్ని అసంపూర్ణమైన వ్యక్తి లేదా మోసగాడు దగ్గర నుండి పొందలేవు. అది సరైన సూచన కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు గురువు అవుతున్నారు, అది వైఖరి అయిపొయింది మరియు అతను అతని సొంత అభిప్రాయము ఇస్తున్నాడు, "నేను అనుకుంటుంన్నాను," "నా ఉద్దేశంలో." అది గురువు లక్షణం కాదు. గురువు అనగా అతను శాస్త్రముల నుండి అధారాలు ఇవ్వాలి. యః శాస్త్ర-విధిం ఉత్స్రజ్య వర్తతే కామకారతః ( BG 16.23) ఎవరైతే శాస్త్రముల నుండి ఆధారములను ఇవ్వరో, అప్పుడు" న స సిద్ధిమవాప్నోతి, "అతను ఎప్పుడు విజయాన్ని సాధించలేడు. న సుఖం, "లేదా ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి ఆనందాన్ని," న పరాం గతిం, "మరియు మరు జన్మలో ఉన్నతి సాధించుట గురుంచి ఏమి మాట్లాడాలి." ఇవి సూచనలు