TE/Prabhupada 0041 - ప్రస్తుత జీవితం అపవిత్రతతో నిండియున్నది



Lecture on BG 9.1 -- Melbourne, June 29, 1974

సంపూర్ణ జ్ఞానం అందువల్ల మీరు భగవద్గీతను పఠిస్తే, మీరు సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలరు. కావున భగవంతుడు ఏమి చెప్పాడు?

ఇదం తు తే గుహ్యతమం
ప్రవక్ష్యామి అనసూయవే
( BG 9.1)

భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. కావున తొమ్మిదవ అధ్యాయంలో ఆయన చెప్తాడు, "ప్రియమైన అర్జునా, నేను ఇప్పుడు నీకు చెబుతున్నది చాలా రహస్యమైన విశ్వసనీయమైన జ్ఞానము, "గుహ్యతమమ్. తమమ్ అనగా అతిశయోక్తి. సానుకూల, సమతులన మరియు అతిశయోక్తి. సంస్కృతములో, తర-తమ. తర వచ్చి సమతులన, మరియు తమ అనగా అతిశయోక్తి. కావున భగవంతుడు ఇక్కడ చెబుతాడు, పరిపూర్ణమైన భగవంతుడు చెబుతున్నాడు, ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి. ఇప్పుడు నేను నీతో చాలా విశ్వసనీయమైన జ్ఞానము చెబుతున్నాను. జ్ఞానం విజ్ఞాన-సహితం. జ్ఞానము పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉన్నది, ఊహించినటువంటిది కాదు. జ్ఞానం విజ్ఞాన-సహితం.విజ్ఞాన అనగా "శాస్త్రం," "ఆచరణాత్మకముగా చూపెట్టడము." కావున జ్ఞానం-విజ్ఞాన-సహితం యజ్ జ్ఞాత్వ. నువ్వు ఈ జ్ఞానమును నేర్చుకుంటే, యజ్ జ్ఞాత్వ మోక్షసే సుభాత్. అసుభాత్. మోక్ష్యసే అనగా నువ్వు స్వేచ్చ పొందుతావు, మరియు అసుభాత్ అనగా అశుభ్రమైనది. అశుభ్రమైనది.

కావున మన ప్రస్తుత జీవితం, ఈ ప్రస్తుత క్షణంలో, ప్రస్తుత జీవితం అనగా ఈ భౌతిక శరీరం మనం కలిగి ఉన్నంత కాలం, అది అపవిత్రతో నిండి ఉన్నది. మోక్ష్యసే అసుభాత్. అసుభాత్ అనగా అపవిత్రమైనది