TE/Prabhupada 0055 - చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి ఏమిటంటే



Lecture on BG 2.18 -- Hyderabad, November 23, 1972

చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి ఏమిటంటే, ఈ భూమి మీద ఎన్ని గ్రామాలూ పట్టణాలు వున్నాయో ప్రతి చోట ఈ హరే కృష్ణ మహా మంత్రం లేదా చైతన్య మహాప్రభు నామము కీర్తన చేయబడుతుంది అది జరిగినది. ఈ హరే కృష్ణ మహా మంత్రాన్ని ప్రపంచము మొత్తము ప్రచారము చేయడానికి అవకాశము వున్నది ఇది ఆచరణాత్మకమే. చైతన్య మహాప్రభు ఈ పనిని ప్రతి ఒక్క భారతీయుడుకి ఇచ్చారు కేవలము బెంగాలీలకు మాత్రమే కాదు. ఆయన బెంగాల్లో ఆవిర్బవించినా, ఇది కేవలము బెంగాలీలకు మాత్రమే అని చెప్పలేదు ఆయన చెప్పారు భరత- భూమితే మనుష్య- జన్మ హలిలయార ( CC Adi 9.41) పవిత్రమైన భారత భూమిలో ఎవరైతే మానవునిగా జన్మ తీసుకుంటారో వారు తమ జన్మను పరిపూర్ణము చేసుకోవాలి." జన్మ సార్థక కరి". మీ జన్మను పరిపూర్ణముగా చేసుకోకుండా మీరు ప్రచారము చేయలేరు నేను అసంపూర్ణముగా వుంటే, నేను ప్రచారము చేయలేను. ప్రచారము చేయువారు పరిపూర్ణ భక్తులుగా ఉండవలెను అది కష్టము కాదు. మనకు భగవంతుని, గొప్ప మునుల, పవిత్ర భక్తుల యొక్క మార్గ నిర్దేశము వున్నది

కావున మన జీవితమును పరిపూర్ణము చేసుకొనుట కష్టమేమి కాదు. కేవలము మనము దానిని నిర్లక్ష్యము చేస్తున్నాము ఇది మన దురదృష్టము మంద సుమంద -మతయో మంద -భాగ్యః ( SB 1.1.10) మనము మంద బుద్ధి గలవారము, మనము బూటకపు తర్కమును అంగీకరించి, సమయమును వృధా చేసుకుంటున్నాము శాస్త్రముల నుండి నిజమైన మార్గమును తీసుకోవాలి అప్పుడు మనము తెలివిగలవారము అవగలము సుమేధస. యజ్ఞైః సంకీర్తన- ప్రాయైర్ యజంతి హి సుమేధసః ( SB 11.5.32) ఇది సత్వర మార్గపు పద్ధతి మేధస్సు కలిగిన వారు ఈ సంకీర్తన పద్ధతి ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధిస్తారు ఇది వాస్తవము, ఈ పద్ధతి శాస్త్రీయమైనది. ప్రామాణికమైనది. కావున నిర్లక్ష్యము చేయరాదు హరే కృష్ణ మహామంత్రమును మనస్సు నందు హృదయము నందు పరిపూర్ణముగా తీసుకోండి నియమితః స్మరణే న కాలః. ఇక్కడ నియమాలు నియంత్రణలు లేవు ఏ సమయములోనైనా, ఏ స్థితిలోనైనా చేయవచ్చును ఈ మహామంత్రం పతితులైన బద్ధ జీవుల కొరకు ఇవ్వబడినది. దీనికి కష్టమైన నియమాలు లేవు నామ్నామకారి బహుధా నిజ సర్వ శక్తి స్తత్రార్పితా నియమితః స్మరణే న కాలః. కృష్ణుడి నామము కృష్ణుడి వలె శక్తీవంతమైనది కృష్ణుడికి ఆయన నామమునకు వ్యత్యాసము లేదు. కృష్ణుడు మహాోన్నతుడు కృష్ణుడికి కృష్ణుడి నామమునకు వ్యత్యాసము లేదు కృష్ణుడి లీల, గుణములు, పరివారము, కృష్ణుడి నుంచి వచ్చేది ఏదయినా అంతయు కృష్ణుడే మీరు కృష్ణుడి గురించి శ్రవణము చేస్తుంటే, కృష్ణుడిని శ్రవణము ద్వారా సమీపిస్తున్నారు మీరు కృష్ణుడి అర్చామూర్తిని చూసినట్లయితే, మీరు వ్యక్తిగతంగా కృష్ణుడిని చూస్తున్నారని అర్థం. ఎందుకంటే కృష్ణుడు సంపూర్ణుడు ఆయన మీ సేవను ఏ విధముగానైనా అంగీకరించవచ్చు. ఎందుకంటే ఆయనే సమస్తము ఈశావాశ్యమ్ ఇదం సర్వం ( ISO 1) ఆయన శక్తి పరాస్య బ్రహ్మణః శక్తిస్తతేదమ్ అఖిల జగత్. ప్రతిదీ కృష్ణుడి శక్తే మనకు కృష్ణుడి శక్తితో సంబంధము ఉంటే, కొంత జ్ఞానంతో వున్నా, మనము నేరుగా కృష్ణుడితో సంబంధము కలిగి వుంటాము ఇది పద్ధతి కృష్ణుడితో అన్ని సమయములలో సంబంధము కలిగి వుంటే దానిని కృష్ణ చైతన్యము అని అంటారు అప్పుడు మీరు శుద్ధ భక్తులు అవుతారు ఒక ఇనుప ముక్కను మంటలో పెడితే మొదట వెచ్చగా, తరువాత ఇంకొంచం వెచ్చగా, మరికొంత వెచ్చగా, చివరికి ఎర్రగా వేడిగా మారుతుంది ఎప్పుడైతే అది ఎర్రగా మారుతుందో, అది అగ్ని, ఇనుప ముక్క కాదు అదేవిధముగా మీరు కృష్ణ చైతన్యములో వుంటే మీరు కృష్ణభక్తులు అవుతారు ఇది పద్ధతి. ప్రతీదీ శుద్ధమవుతుంది అప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితం మొదలు అవుతుంది. అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది