TE/Prabhupada 0060 - జీవితము పదార్థము నుండి రాదు



Room Conversation with Svarupa Damodara -- February 28, 1975, Atlanta

ప్రభుపాద: జీవి వీర్యంలో వుంటాడు అని చెప్తాము అది స్త్రీ, గర్భాశయం లో ప్రవేశపెట్టినప్పుడు శరీరం అభివృద్ధి చెందుతుంది. ఇది జీవితం యొక్క ప్రారంభం. ఇది అనుసరణీయం. ఈ జీవితము భగవంతునిలో భాగము కాబట్టి భగవంతుడు ప్రారంభము. జన్మాద్యస్య యతః ( SB 1.1.1) అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అందువలన, మనము ఈ పతనమైన ప్రపంచంలో ఈ సిద్ధాంతమును రుజువు చేయవలెను అంతేకాకుండా, ఎందుకు వారు జీవితమును పదార్థము నుండి సృష్టించలేరు? శాస్త్రవేత్తల వాదనలకు విలువ ఏమిటి? వారు అలా ఎందుకు చేయలేకపోతున్నారు. జీవితం పదార్థము నుండి పుడుతుంది అని రుజువు ఎక్కడ ఉంది? మీరు తయారు చేయండి.

స్వరూప దామోదర: నిరూపించడము కొరకు అన్వేషణలో వున్నారు (నవ్వులు)

ప్రభుపాద: ఏమిటి? ఇది అర్థంలేనిది. హమ్బగ్. జీవం, జీవం నుండి వస్తోంది, సాక్ష్యం వున్నది, చాలా రుజువులు వున్నాయి ఒక వ్యక్తి, జంతువు, వృక్షము అన్నీ జీవము నుండి వస్తున్నాయి. ఇప్పటివరకు, ఎవరూ ఒక రాయి నుండి ఒక వ్యక్తి నుండి జన్మించినట్లు చూడలేదు ఎవరూ చూడలేరు. కొన్నిసార్లు అది వృశ్చిక -తందూల- న్యాయ అని అంటారు. మీకు తెలుసా? వృశ్చిక -తందూల- న్యాయ. వృశ్చిక తేలు, తందూల అంటే వరి అని అర్థము కొన్నిసార్లు మనము బియ్యం కుప్పలను చూస్తాము, తేలు వస్తుంది కానీ బియ్యం తేలుకు జన్మనివ్వలేదు. మీరు మీ దేశంలో చూడలేదా? మేము అది చూసాము. బియ్యం, బియ్యం కుప్పల నుండి, ఒక తేలు, ఒక చిన్న తేలు వస్తుంది. నిజానికి, తేలు తల్లిదండ్రులు వారి గుడ్లను బియ్యంలో పెట్టిన తరువాత, అవి పులియబడినప్పుడు తేలు బయటకు వస్తుంది, బియ్యం కుప్పల నుండి తేలు రాదు అందుకని దానిని వృశ్చిక -తందూల- న్యాయ అని అంటారు. వృశ్చిక అంటే తేలు తందూల అంటే బియ్యం కాబట్టి "జీవం భౌతిక పదార్థము నుండి వస్తున్నది అన్నది " వృశ్చిక -తందూల- న్యాయ వంటిది జీవము భౌతిక పదార్థము నుండి ఉత్పత్తి సాధ్యం కాదు. అంతే కాకుండా... ప్రాణము, ఆత్మ వున్నప్పుడు, శరీరం పెరుగుతుంది, శరీరము పెరుగుతుంది లేదా మార్పులు చెందుతుంది, మీరు చెప్పినట్లుగా. కానీ, పిల్లవాడు మరణించినా లేదా చనిపోయిన తరువాత బయటకు వస్తే, శరీరం పెరగదు. భౌతిక పదార్థము ప్రాణము ఉన్నప్పుడే పెరుగుతుంది