TE/Prabhupada 0065 - కృష్ణ చైతన్యములో శిక్షణ ఇస్తే, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు
Arrival Lecture -- Gainesville, July 29, 1971
మహిళా అతిథి: కృష్ణ చైతన్య ఉద్యమంలో రోజంతా హరే కృష్ణ మంత్రాన్ని జపము చేసేవారు కాకుండా, పరోక్షముగా కృష్ణుడికి సేవ చేసే వారి పరిస్థితి ఏమిటి
ప్రభుపాద: పద్ధతి ఏమిటంటే మీరు చెట్టు యొక్క వేరుకి నీరు పోయాలి. ఆ నీరు ఆకులకు, శాఖలు, కొమ్మలకి పంపిణి చేయబడుతుంది అవి తాజాగా ఉంటాయి. కానీ మీరు ఆకులకు మాత్రమే నీరు పోస్తే అప్పుడు ఆకులు పాడైపోతాయి, చెట్టు చనిపోతుంది. మీరు మీ పొట్టలోకి ఆహారం ఇస్తే, అప్పుడు శక్తి ప్రతిచోటికీ మీ వెంట్రుకలకు, మీ వేలుకు మీ గోర్లకు పంపిణి చేయబడుతుంది. మీరు చేతిలోకి ఆహారం తీసుకొని కడుపుకు ఇవ్వకపోతే అది నిష్ఫలమవుతుంది కాబట్టి ఈ అన్ని మానవతా సేవలు కృష్ణ చైతన్యము లేకపోవుట వలన వృధా అవుతుయి వారు మానవ సమాజంలో, సేవ చేయుటకు ఎన్నోవిధాలుగా ప్రయత్నిస్తున్నారు కానీ వారి ప్రతి ప్రయత్నము నిరాశ కలిగిస్తుంది ఎందుకంటే కృష్ణ చైతన్యము లేనందున,. కృష్ణ చైతన్యములో శిక్షణ ఇచ్చి ఉంటే, అప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ఎవరైతే సహకరిస్తారో, ఎవరైతే శ్రవణము చేస్తారో, ఎవరైతే చేరుతారో, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. మాది ఒక సహజ విధానము. మీరు భగవంతుని ప్రేమిస్తారు. నిజముగా భగవంతుని ప్రేమిస్తే, సహజంగా మీరు అందరిని ప్రేమిస్తారు. మీరు జంతువులను కూడా ప్రేమిస్తారు. కేవలం కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి, భగవంతుడిని ప్రేమించటము వలన ఆయన జంతువులను కూడా ప్రేమిస్తాడు. ఆయన పక్షులను, జంతువులను, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. కానీ మానవతా ప్రేమ అని పిలవబడేది వారు కొందరు మానవుల మీద ప్రేమతో ఉంటారు. కానీ జంతువులను చంపుతారు. ఎందుకు వారు జంతువులను ప్రేమించలేరు? ఎందుకంటే వారి ప్రేమ అసంపూర్ణమైనది. కానీ కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి ఒక జంతువును ఎప్పుడూ చంపడు లేదా జంతువును ఇబ్బంది పెట్టాడు. ఇది విశ్వవ్యాప్తమైన ప్రేమ. మీరు కేవలం మీ సోదరుడు లేదా మీ సోదరిని ప్రేమిస్తే, అది విశ్వవ్యాప్తమైన ప్రేమ కాదు. సార్వత్రిక ప్రేమ అంటే మీరు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. సార్వత్రిక ప్రేమ కృష్ణ చైతన్యము వలన అభివృద్ధి చెందుతుంది. ఏ ఇతర మార్గాల ద్వారా కాదు
మహిళా అతిథి: నాకు తెలుసు కొందరు మీ భక్తులు భౌతిక ప్రపంచము యొక్క తల్లిదండ్రుల నుండి విడిపోయారు అది వారికి కొంత శోకం కలిగించినది ఎందుకంటే వారి తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదు ఇప్పుడు మీరు వారికి ఏమి చెప్పి ఈ పరిస్థితిని ఎలా సరిదిద్దుతారు?
ప్రభుపాద: చక్కగా, కృష్ణ చైతన్యంలో వున్న ఒక వ్యక్తి, తన తల్లిదండ్రులకు, కుటుంబమునకు, దేశమునకు, సమాజానికి ఉత్తమ సేవ అందిస్తాడు. కృష్ణ చైతన్యము లేకుండా, మీ తల్లిదండ్రులకు ఏమి సేవ చేస్తారు? సాధారణంగా, వారు వేరుగా వుంటారు. కానీ, ప్రహ్లాదుడు మహారాజ ఒక గొప్ప భక్తుడు ఆయన తండ్రి ఒక గొప్ప అభక్తుడు. ఎంతగా అంటే ఆతని తండ్రి నరసింహస్వామిచే సంహరించ బడ్డాడు. కానీ ప్రహ్లాద మహారాజుని కొన్ని వరములు కోరుకోమని భగవంతుడు ఆదేశించినప్పుడు, ఆయన చెప్పెను "నేను ఒక వ్యాపారవేత్తను కాదు, కొన్ని సేవలు మీకు చేసి, తిరిగి మీ దగ్గర నుండి సేవలు తీసుకొనుటకు.. నన్ను దయచేసి క్షమించుము. నరసింహస్వామి చాలా సంతృప్తి చెంది: ఇతడు ఒక పవిత్రమైన భక్తుడు. కానీ అదే పవిత్రమైన భక్తుడు భగవంతుడిని కోరాడు. ఓ దేవా, నా తండ్రి నాస్తికుడు, ఆయన చాలా నేరాలు చేసాడు, కాబట్టి నేను నా తండ్రికి విముక్తిని ఇవ్వమని వేడుకుంటున్నాను. నరసింహస్వామి పలికెను నీ తండ్రి నీవు భక్తుడు అవ్వటము వలన ఎప్పుడో విముక్తుడు అయినాడు. ఆయన ఎన్ని అపరాధములు చేసినను, నీవు ఆయన కుమారుడు అవటము వలన విముక్తి పొందినాడు మీ తండ్రి మాత్రమే కాదు, మీ తండ్రికి తండ్రి, ఏడు తరాలవారు అందరూ విముక్తులు అయ్యారు. ఒక వైష్ణవుడు కుటుంబంలో జన్మిస్తే, ఆయన తండ్రి మాత్రమే కాదు, ఆయన తండ్రిని, ఆతని తండ్రి తండ్రిని, ఆతని తండ్రి తండ్రిని ఏడు తరాలవారిని ఆ విధముగా విముక్తి కలుగ చేస్తారు. కాబట్టి కృష్ణ చైతన్యవంతులము అవుట మీ కుటుంబానికి ఉత్తమ సేవ. వాస్తవానికి, నా విద్యార్థులు ఒకరు కార్తికేయ, ఆయన తల్లికి సమాజం అంటే చాలా ఇష్టం. అతడు తన తల్లిని చూడాలి అనుకున్నప్పుడు ఆయన తల్లి కూర్చో. నేను డాన్సు పార్టికి వెళుతున్నా అనేది. వారి సంబంధం అది. అయినప్పటికీ ఈ పుత్రుడు కృష్ణ చైతన్యములో ఉండటము వలన ఆయన తన తల్లి దగ్గర, అనేక సార్లు కృష్ణుడి గురించి చెప్పాడు. మరణసమయంలో, తల్లి తన కుమారుడిని అడిగింది: మీ కృష్ణుడు ఎక్కడ. ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు? వెంటనే ఆమె మరణించింది. అంటే మరణం సమయంలో ఆమె కృష్ణుడిని గుర్తుచేసుకున్నది వెంటనే ఆమె విముక్తి పొందినది భగవద్గీతలో చెప్పబడినది యం యం వాపి స్మరన్ భావం త్యజతంతే కలేవరమ్ ( BG 8.6) మరణం సమయంలో, మనము కృష్ణుడిని గుర్తుంచుకుంటే, అప్పుడు జీవితం విజయవంతమవుతుంది. కాబట్టి ఈ తల్లి, కుమారుడు కృష్ణ చైతన్యము కలిగి ఉండుట వలన నిజానికి ఆమెకు కృష్ణ చైతన్యములో లేకపోయినా ఆమె విముక్తి పొందినది. కాబట్టి ఈ ప్రయోజనము ఉంది