TE/Prabhupada 0069 - నేను మరణించుట లేదు



Conversation Pieces -- May 27, 1977, Vrndavana

కీర్తనానంద: మీరు బాగా లేకుంటే మేము సంతోషంగా ఉండలేము.

ప్రభుపాద: నేను ఎప్పుడూ మంచి ఆరోగ్యముతో వుంటాను.

కీర్తనానంద: మీ వృద్ధాప్యము ఎందుకు మాకు ఇవ్వకూడదు?

ప్రభుపాద: నేను అన్ని విషయాలు చక్కగా జరగటము చూసినప్పుడు, నేను సంతోషంగా వుంటాను. ఈ దేహంతో పని ఏమిటి? శరీరము శరీరమే. మనము శరీరమే కాదు.

కీర్తనానంద: తన తండ్రికి పురుదాసుడు తన యవ్వనము ఇచ్చినాడు కదా

ప్రభుపాద: అవును.

రామేశ్వర: యయాతి. యయాతి రాజు తన వృద్ధాప్యాన్ని వర్తకం చేశాడు.

కీర్తనానంద: తన కుమారుడుతో. మీరు కూడా దాన్ని చెయ్యవచ్చు.

ప్రభుపాద: (నవ్వుతూ) ఎవరు చేశారు?

రామేశ్వర: యయాతి రాజు.

ప్రభుపాద: అవును యయాతి రాజు. లేదు, ఎందుకు? మీరు నా శరీరము కాబట్టి మీరు నివసించండి. ఏమి తేడా లేదు. అది ఎట్లాగంటే నేను పని చేస్తున్నాను, నా గురు మహారాజ భక్తిసిద్ధాంత సరస్వతి ఇక్కడ ఉన్నారు భౌతికంగా ఆయన ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ ప్రతి కార్యక్రమాలలోను ఆయన ఉన్నారు. వాస్తవానికి నేను వ్రాసాను అనుకుంటున్నాను.

తమాల కృష్ణ: అవును, ఇది భాగవతంలో వున్నది, "ఎవరైతే ఆయనతో నివసిస్తారో వారు శాశ్వతముగా వుంటారు". ఆయన మాటలను జ్ఞాపకము ఉంచుకొనువాడు శాశ్వతముగా వుంటాడు.

ప్రభుపాద: కావున నేను మరణించడము లేదు.

కీర్తనానంద: "ఎవరైతే గణనీయమైన కృషి చేస్తారో వారు ఎప్పటికీ జీవిస్తారు ఆయన చనిపోరు. మన ఆచరణాత్మకమైన జీవితంలో కూడా... వాస్తవానికి, ఇది భౌతికము. కర్మ-ఫలము. తన కర్మ ప్రకారం మరొక శరీరాన్ని అంగీకరించాలి. కానీ భక్తులకు ఇది వర్తించదు. ఆయన కృష్ణుడికి సేవ చేయడానికి ఎప్పుడూ శరీరాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి కర్మ ఫలము ఉండదు.