TE/Prabhupada 0081 - సూర్య గ్రహములో నివసించే జీవుల శరీరాలు అగ్ని వలె వుంటాయి



Lecture on BG 2.13 -- New York, March 11, 1966


ధీర అంటే ఏమిటో చెప్పబడినది

dehino 'smin yathā dehe
kaumāraṁ yauvanaṁ jarā
tathā dehāntara-prāptir
dhīras tatra na muhyati
(BG 2.13)


దేహినః అంటే "ఈ భౌతిక శరీరాన్ని అంగీకరించినవాడు." అస్మిన్. అస్మిన్ అంటే అర్థం "ఈ ప్రపంచంలో" లేదా "ఈ జీవితంలో." దేహే అంటే "ఈ శరీరము లోపల." ఎందుకంటే దేహినః అంటే "ఈ శరీరమును ఎవరైతే అంగీకరించారో" దేహే "ఈ శరీరములో." కాబట్టి నేను ఈ శరీరంలో నివసిస్తున్నాను. కానీ నేను ఈ శరీరం కాదు. మీరు ఈ చొక్కా కోటు లోపల ఉన్నట్లు, అదేవిధముగా, నేను కూడా ఈ శరీరం లోపల ఉన్నాను. ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. స్థూల శరీరం భూమి, నీరు, అగ్ని, గాలి ఆకాశముతో చేసినవి ఈ స్థూల శరీరం, ఈ భౌతిక శరీరము మొత్తము. ఇప్పుడు ఈ ప్రపంచంలో, భూమి ప్రముఖంగా ఉంది. శరీరం, ఐదు ప్రాథమిక అంశాలతో తయారు చేయబడినది. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము. ఈ ఐదు పదార్ధాలు. ఈ భవనం లాగే. ఈ మొత్తం భవనం భూమి, నీరు అగ్నితో తయారు చేస్తారు. మీరు కొంత భూమిని తీసుకున్నారు. ఇటుకలు తయారు చేసి మీరు అగ్నిలో ఇటుకలు కాలుస్తారు. నీటితో మట్టిని కలిపిన తరువాత మీరు వాటికి ఆకారము ఇచ్చి అగ్నిలో పెట్టారు, దానికి తగినంత బలము వచ్చినప్పుడు, దానిని గొప్ప భవనము కట్టుటకు ఉపయోగించారు. ఇది భూమి, నీరు అగ్ని, యొక్క కలయిక తప్ప ఇంక ఏమీ కాదు అంతే. అదేవిధముగా, మన శరీరం కూడా ఆ విధముగా తయారు చేయబడింది: భూమి, నీరు, అగ్ని, గాలి ఆకాశముతో. గాలి కదులుతుంది. నీకు తెలుసు. గాలి ఎప్పుడూ వున్నది. ఈ బాహ్య చర్మం భూమి, పొట్టలో వేడి ఉంది వేడి లేకుండా, మీకు ఏది జీర్ణం కాదు. మీరు చూడండి? వేడి తగ్గిన వెంటనే, మీ జీర్ణ శక్తి చెడి పోతుంది. అనేక విషయాలు వున్నవి. ఇది ఏర్పాటు. ఇప్పుడు, ఈ లోకము మీద మనకు ఈ శరీరము వున్నది. దీనిలో భూమి చాలా ప్రముఖంగా ఉంది. అదేవిధముగా, ఇతర లోకములు, ఇతర గ్రహాలలో, ఎక్కడైతే నీరు చాలా, ప్రముఖంగా ఉంటుందో కొన్ని చోట్ల అగ్ని చాలా ప్రముఖంగా ఉంటుంది. సూర్య లోకములో, అక్కడ శరీరాలు... అక్కడ కూడా జీవరాశులలో ఉన్నాయి, కానీ వారి శరీరం మండుతున్న అగ్ని లాగా ఉంటుంది. వారు అగ్నిలో జీవిస్తారు. వారు అగ్నిలో జీవిస్తారు. అదేవిధముగా, వరుణలోకం, వీనస్, ఈ గ్రహాలలో, వారికి విభిన్న రకములైన శరీరములు వున్నాయి ఇటువంటిది ఇక్కడ మీరు నీటిలో చూడగలరు నీటి జంతువులు వేరే రకమైన శరీరం కలిగి ఉన్నాయి సంవత్సరాల తరబడి జల జీవులు నీటి లోపల చాలా సౌకర్యంగా ఉంటాయి. కానీ ఒక్క క్షణం మీరు వాటిని నీటి బయటకు తీస్తే అవి మరణిస్తాయి. అదేవిధముగా, మీరు నేల మీద చాలా సౌకర్యంగా ఉంటారు, కానీ మిమ్మల్ని నీటిలో ఒక్క క్షణము ఉంచితే, మీరు చనిపోతారు. మీ శరీరం, వాటి శరీర నిర్మాణం భిన్నంగా ఉంటుంది, పక్షి శరీరము పక్షి, ఒక గొప్ప పక్షి, అది ఎగురుతుంది, కానీ అది భగవంతుడు రూపొందించిన ఒక ఎగిరే పరికరం. కానీ మానవులు తయారు చేసిన పరికరాలు కూలిపోతాయి. మీరు చూడండి? ఎందుకంటే అవి కృత్రిమమైనవి.

కావున ఇది ఏర్పాటు. ప్రతి జీవి ఒక ప్రత్యేక రకమైన శరీరమును కలిగి ఉంది. దేహినోఽస్మిన్ యథా దేహే ( BG 2.13) ఆ శరీరం యొక్క స్వభావం ఏమిటి? మనము శరీరమును ఎలా మార్చవచ్చు అన్నది ఇక్కడ వివరిస్తున్నారు ఎలా... మనకు అది కష్టమైన సమస్య. మనము పూర్తిగా లీనమైపోయి వున్నాము ఆత్మతో ఈ శరీరాన్ని గుర్తించే ఆలోచనతో. ఆధ్యాత్మిక జ్ఞానంలో ABCD ఏమిటంటే. నేను ఈ శరీరం కాదు ఎవరైనా గట్టిగా తాను నేను ఈ శరీరం కాదు అని నమ్మితే తప్ప, ఆయన ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించలేడు. కాబట్టి శ్రీకృష్ణుడి మొదటి పాఠం ఆ విధముగా తీసుకోవాలి. ఇక్కడ ఇది దేహినోఽస్మిన్. ఇప్పుడు దేహి అంటే ఆత్మ. దేహి అంటే ఆత్మ అని అర్థం. ఈ భౌతిక శరీరాన్ని అంగీకరించిన వ్యక్తి, ఆయనని దేహి అని పిలుస్తారు. కాబట్టి అస్మిన్, ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు, కానీ ఆయన శరీరం మారుతుంది.