TE/Prabhupada 0082 - కృష్ణుడు ప్రతిచోటా ఉన్నాడు



Lecture on BG 4.24 -- August 4, 1976, New Mayapur (French farm)


భక్తుడు: మనము కృష్ణుడు ప్రతి జీవుని యొక్క హృదయములోను ఆధ్యాత్మిక లోకములోను ఉన్నాడు అని చెప్తాము

ప్రభుపాద: కృష్ణుడు ప్రతిచోటా ఉన్నాడు.

భక్తుడు: ఒక వ్యక్తిగానా లేక ఒక శక్తిగానా?

ప్రభుపాద: తన శక్తిలో. వ్యక్తిగా కూడా. మనము సొంత కళ్ళతో వ్యక్తిని చూడలేకున్నాము కానీ మనము శక్తిని అనుభూతి చెందవచ్చు. ఈ అంశాన్ని మరింత స్పష్టముగా అర్థము చేసుకోండి. కాబట్టి, పూర్తిగా అర్థమైతే, అప్పుడు ఈ శ్లోకము, ప్రతిదీ బ్రహ్మం. sarvaṁ khalv idaṁ brahma... ఉత్తమ భక్తుడు, ఆయన కృష్ణుడిని తప్ప మరేమీ చూడడు.

భక్తుడు: శ్రీల ప్రభుపాదా భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి మధ్య తేడా ఉందా?

ప్రభుపాద: అవును, వ్యత్యాసం చాలా వుంది. చాలా తేడాలు ఉన్నాయి. ఉదాహరణ విద్యుత్. అనేక పరికరములు పని చేస్తున్నాయి, భిన్నమైన శక్తులతో. మాటలను రికార్డు చేసే పరికరము విద్యుత్ ద్వారా పనిచేస్తున్నట్లు, అదే శక్తి విద్యుత్. కృష్ణుడు చెప్తారు అహం సర్వస్య ప్రభవః ( BG 10.8) తాను ప్రతి దాని యొక్క మూలం.

భక్తుడు: ఇది భగవద్గీతలో వివరించారు. జీవిత కాలములో జీవి యొక్క శరీరం మారుతుంది, కానీ మనము చూస్తున్నాము నల్ల మనిషి ఎప్పుడూ తెల్లగా మారడు లేదా ఎప్పుడూ స్థిరముగా చూస్తాము శరీరము మారుతున్నా, లోపల స్థిరంగా ఏదో ఉంది. అది ఏమిటి? అది ఎలా జరుగుతుంది శరీరం మారుతుంది. కానీ మనము చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు మనిషిని గుర్తించగలము?

ప్రభుపాద: మీరు మరింత ఉన్నతి పొందినప్పుడు, మీరు నలుపు తెలుపు మధ్య ఎలాంటి తేడా లేదు అని కనుగొంటారు. ఒక పుష్పం వికసిస్తుంది, రంగులు చాలా ఉంటాయి. ఒకే మూలం నుండి వస్తుంది. నిజానికి ఎలాంటి తేడా లేదు, కానీ దానిని అందముగా చేయుటకు చాలా రంగులు ఉన్నాయి. సూర్యరశ్మి లో ఏడు రంగులు ఉన్నాయి, ఆ ఏడు రంగుల నుండి చాలా రంగులు బయటకు వస్తున్నాయి, మూలం రంగు తెలుపు ఒకటే, ఆపై చాలా రంగులు వస్తాయి. మీకు అర్థము అయినదా? కాలేదా?

భక్తుడు: శ్రీల ప్రభుపాదా కృష్ణుడు ప్రతిదీ రూపొందించినప్పుడు ప్రతిదీ కృష్ణుడి అనుమతికి సేవకునిగా ఉంటుంది మనము వాస్తవమునకు మంచి లేదా చెడు ఏమిటో చెప్పగలమా?

ప్రభుపాద: ఇది మానసిక కల్పన. మంచి లేదా చెడు అనేది లేదు. కానీ మొత్తం మీద, భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతిదీ చెడు మాత్రమే.