TE/Prabhupada 0111 - మీ ఆచార్యుని ఆదేశములను పాటించండి. మీరు ఎక్కడున్నా క్షేమముగా వుంటారు
Morning Walk -- February 3, 1975, Hawaii
భక్తుడు : శ్రీల ప్రభుపాద, ఎవరైనా తన అధికారాన్ని ఎక్కడ నుండి పొందుతారు?
ప్రభుపాద: గురువు అధికారి.
భక్తుడు: కాదు, నాకు తెలుసు, కానీ నాలుగు నియమాలను అనుసరించి మరియు పదహారు మాలల జపము చేయుట కంటే ఆతని ఇతర చర్యలకు అతను రోజులో చాలా ఇతర పనులు చేస్తాడు. ఆయన ఎక్కడ నుండి అతను తన అధికారాన్ని పొందుతాడు, ఆలయంలో నివసించకుండా వుంటే?
ప్రభుపాద: నాకు అర్థం కాలేదు. గురువు అధికారి. మీరు అంగీకరించారు.
బలి మార్దన: ప్రతి దానికి.
జయతీర్థ: నేను ఆలయము వెలుపల ఉద్యోగం చేస్తున్నాను, నేను బయిట నివసిస్తున్నాను, కానీ నా ఆదాయంలో 50% ఇవ్వడం లేదు. కాబట్టి నేను చేస్తున్న పని, ఇది నిజంగా గురువు ఆధీనంలో ఉంటుందా?
ప్రభుపాద: మీరు గురువు యొక్క సూచనలను అనుసరించడము లేదు. ఇది వాస్తవం. జయతీర్థ: రోజు సమయంలో పని చేస్తున్న అన్ని కార్యకలాపాలు, నేను గురువు యొక్క సూచనలను పాటించడము లేదు. అంటే, నేను చేస్తున్న అనధికారికమైన పని.
ప్రభుపాద: అవును. మీరు గురువు యొక్క సూచనలను అనుసరించక పోతే, మీరు వెంటనే పడిపోతారు. ఇది మార్గము. లేకపోతే మీరు ఎందుకు పాడతారు, yasya prasādād Bhagavat-Prasado? గురువును సంతృప్తి పరుచుట నా విధి. లేకపోతే నేను భక్తుల మధ్య ఉండను. మీరు భక్తుల మధ్య ఉండడాన్ని కోరుకోకుంటే, మీరు మీ ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తారు. గురువు ఆదేశములను పాటించరు. కానీ మీరు మీ స్థానం లో స్థిరంగా ఉండలనుకుంటే, అప్పుడు మీరు ఖచ్చితంగా గురువు యొక్క సూచనలను పాటించండి.
భక్తుడు: మేము కేవలం మీ పుస్తకాలు చదవడం ద్వారా మీ సూచనలను అర్థం చేసుకోవచ్చు.
ప్రభుపాద: అవును. ఏదేమైనా, ఆదేశాన్ని పాటించండి. అది అవసరం. సూచనలను అనుసరించండి. మీరు ఎక్కడ నివసిస్తున్నా, అది పట్టింపు లేడు. మీరు సురక్షితంగా ఉంటారు. సూచనలను పాటించండి. అప్పుడు మీరు ఎక్కడైనా సురక్షితంగా ఉంటారు. ఆది పట్టింపు లేదు. నేను మీకు చెప్పినట్లుగా నా గురు మహారాజుని నా జీవితంలో పది రోజులు కన్నా ఎక్కువ చూడలేదు. కానీ నేను అయిన సూచనలను పాటించాను. నేను ఒక గృహస్తుడిని, నేను ఎప్పుడూ ఆలయములో నివసించలేదు. ఇది ఆచరణాత్మకమైనది. చాలామంది మా గురువుగారి శిష్యులు ఈ బొంబాయి దేవాలయమునకు బాధ్యత వహించాలని సూచించారు ... గురు మహారాజ్ అన్నారు "అవును, అది మంచిది. అతను బయట ఉండడమే ఉత్తమం" అతను అవసరమైనది భవిష్యత్తులో చేస్తాడు.
భక్తులు: జయ హరి బోల్. ప్రభుపాద: అయిన అలా అన్నారు ఆ సమయములో నాకు ఏమి అర్థం కాలేదు అయిన ఏమి కోరుకుంటున్నారో. అయితే, నాకు తెలుసు, ఆయన నన్నుప్రచారము చేయాలనీ కోరుకుoటున్నారు అని .
యశోదానందనా: మీరు దీనిని చాల అద్భుతమైన రీతిలో నిర్వర్తించారు.
భక్తులు: జయ ప్రభుపాద హరి బోల్.!
ప్రభుపాద: అవును, అవును, చాల అద్భుతమైన రీతిలో చేశాను. నేను నా గురు మహారాజ యొక్క ఆదేశాన్ని ఖచ్చితముగా అనుసరిoచినందు వలన అంతే , లేకపోతే నాకు బలం లేదు నేను ఎలాంటి మాయాజాలం చేయలేదు. నేను చేసానా? బంగారము ఉత్పత్తి చేశానా? (నవ్వులు) అయినప్పటికీ, బంగారము తయారీ చేసే గురువు కంటే నేను మంచి శిష్యులను పొందాను.